భక్తి కథలు

కాశీఖండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మపురాణాదులు పదునెనిమిది- అవి 1.బ్రహ్మపురాణము 2.పద్మపురాణము 3.విష్ణుపురాణము 4.శివపురాణము 5.్భగవత పురాణము 6.్భవిష్య పురాణము 7.నారద పురాణము 8.మార్కండేయ పురాణము 9.అగ్నిపురాణము 10.బ్రహ్మవైవర్త పురాణము 11.లింగపురాణము 12.వారాహ పురాణము 13.స్కాంద పురాణము 14.వామన పురాణము 15.కూర్మ పురాణము 16.మత్స్యపురాణము 17.గరుడ పురాణము 18.బ్రహ్మాండ పురాణము- వీటికే అష్టాదశ పురాణాలు అని పేరు.
ఈ పద్ధెనిమిది పురాణాల్లోను నాలుగు లక్షల శ్లోకాలు వున్నాయి. ఈ మహాపురాణాలనుంచి అష్టాదశ ఉప పురాణాలు ఉద్భవించాయి. అష్టాదశ మహాపురాణాలలో స్కాంద పురాణం పదమూడవది. ఈ స్కాందం అనేక సంహితలతో, అనేక ఖండాలలో, పలు చిత్ర విచిత్ర కథలతో విలసిల్లుతున్నది. స్కాంద పురాణ శ్లోకాల సంఖ్య ఒక లక్ష.
స్కాంధ పురాణానికి కాశీఖండం సారాంశం. చతుర్విధ పురుషార్థాలకి ఆలవాలం. బ్రహ్మ విద్య లేక మోక్ష విద్యకి ఆది కారణం. అన్ని ఖండాలలోనూ కాశీఖండం మిక్కిలి ప్రఖ్యాతిపడసింది.
పద్మాదులైన పదిహేడు పురాణాల గ్రంథ సంఖ్య మూడు లక్షల శ్లోకాలతో పరిసమాప్తం అవుతుంది. స్కాంద పురాణం ఒక్కటే లక్ష గ్రంథ సంఖ్య కలది. గ్రంథం అంటే ముప్ఫయి రెండు అక్షరాల శ్లోకం. గొప్పతనానికి మూలం అయిన స్కాందానికి ఏ ఇతర పురాణాలు సాటి వస్తాయి? ఈ పద్ధెనిమిది పురాణాలలో ఎనిమిది పురాణాలు విష్ణువు, బ్రహ్మ మొదలైన దేవతల పారమ్యాన్ని తెలియపరుస్తాయి. తక్కిన పది పురాణాలు శివపారమ్యాన్ని ప్రస్తుతిస్తాయి. ప్రతిపాదిస్తాయి. చతుర్వేదాల్లో వలెనే శివ పారమ్యాన్ని పురాణ సంహితల్లో కూడా అధికంగా ప్రస్తుతింపబడుతుంది. ‘పురా అపి నవమ్’ పురాణం. పురాణానికి పంచ లక్షణాలు ఉన్నాయి. అవి- 1.సర్గం 2.ప్రతిసర్గం. 3.వంశం 4.వంశానుచరితం 5.మన్వంతరం.
సర్గం అంటే సృష్టి. ప్రతిసర్గం అంటే ప్రళయం. దేవదానవ మానవ తిర్యగాదుల ఉత్పత్తి క్రమం వంశం. వంశానుక్రమం అంటే సూర్య, చంద్ర వంశ సమాగతులయిన రాజుల చరిత్ర. పదునల్గురు మనువుల కాలవర్ణం మన్వంతరం.
అష్టాదశాత్మాకం అయిన ఈ పురాణ విద్య నాల్గు లక్షల గ్రంథ పరిమితి కలది. గ్రంథం అంటే ముప్ఫయి రెండు అక్షరాల అనుష్టుప్ శ్లోకం. పురాణ విద్య చతుర్వేదాలు, షడంగాలు, మీమాంస, న్యాయం, పురాణం, ధర్మశాస్త్రం అనే పధ్నాలుగు విద్యలలో చాలా గొప్పది. పెద్దది. ఆ విద్యలో కర్మ విషయం అనుషంగికం అయి ప్రధానంగా వుంటుంది.
పురాణ మహత్త్వము అసాధారణం అయింది సుమా! రోమహర్షణుడి కుమారుడు సూతుడు పురాణ విజ్ఞాన విదుడు కావడంవల్ల పుట్టువు చేత కనిష్ఠుడు ప్రాకృతుడు అయినా మహాప్రభావులు, బహ్మసములు అయిన మహా మునీశ్వరులకి దిట్టతనంతో బ్రహ్మతత్త్వాన్ని ఉపదేశిస్తూ వుంటాడు.

-ఇంకా ఉంది