పశ్చిమగోదావరి

పశ్చిమ వాతావరణాన్ని నాశనం చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్వాహబ్ ప్రకటన దారుణం:మెగా ఆక్వాఫుడ్ పార్కుపై సమరభేరిలో సిపిఎం నేత మధు
భీమవరం, డిసెంబర్ 22: పశ్చిమ గోదావరి జిల్లా వాతావరణాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాశనం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ఆరోపించారు. ఈ జిల్లాను ఆక్వాహబ్‌గా ప్రకటించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించేలా తాము కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు వ్యతిరేక పోరాట సమితి మంగళవారం నిర్వహించిన సమరభేరి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు పెద్దప్రమాదం పొంచి ఉందన్నారు. దీన్ని ఎవరూ గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కును ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నం చేసి విరమించుకున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చేపలు, రొయ్యల వల్ల లాభాలు వస్తాయని జిల్లాను ఆక్వాహబ్‌గా ప్రకటించారని, వ్యవసాయం వల్ల మైనస్ 9శాతం నష్టం వస్తుందని సిఎం అభిప్రాయపడుతున్నారన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించే సమయంలో స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినందున కాలుష్యంపై ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించడానికి కృషిజరగాలన్నారు.
కంసాలి బేతపూడి, జొన్నలగరువు, తుందుర్రు గ్రామాలకు చెందిన పెద్దలు సముద్రాల వెంకటేశ్వరరావు, జవ్వాది సత్యనారాయణ, ఆరేటి వాసు, ననే్నటి నాగరాజు, విప్పర్తి చంటిరాజు, తాడి దానియేలులు మాట్లాడుతూ గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు వల్ల గొంతేరు డ్రెయిన్ కాలుష్యభరితంగా మారనుందని వేదన వ్యక్తంచేశారు. అంతే కాకుండా ఈ ప్రాంతంలో కాలుష్యం పెరిగిపోతుందని, అందువల్ల ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపివేసి, మరోప్రాంతానికి తరలించుకుపోవాలని ఆనంద ఫౌండేషన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. జనవరి 1వ తేదీ తర్వాత ఏ సమయంలోనైనా పార్కు నిర్మాణ పనులను అడ్డుకుంటామన్నారు. సిపిఎం నేతలు రావుల వెంకయ్య, బలరాం, బొక్కా సత్యనారాయణ, దిగుపాటి రాజగోపాల్, శీలబోయిన రాఘవులు, డి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.