మెయన్ ఫీచర్

హిమాలయాలను రక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆస్తి ఉత్తరస్యాం దిశి దేవతాత్మా- హిమాలయో నామ నగాధిరాజః’’ అని కాళిదాసు హిమాలయాలను దేవతాత్మగా వర్ణించాడు. సృష్టి పుట్టినప్పటినుండి హిమాలయాలు భారతదేశానికి సహజ రక్షణను కల్పించాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంవల్ల విమానాల ద్వారా రాకెట్ల ద్వారా అంతర్జాతీయ క్షిపణుల ద్వారా హిమాలయాలను అధిగమించి భారత్ పైకి దాడిచేసే అవకాశాలు శత్రువులకు ఏర్పడింది.
హిమాలయాల్లో కాశ్మీరు, నేపాల్, సిక్కిం, భూటాన్, టిబెట్, అరుణాచల్‌ప్రదేశ్ వంటి ఎన్నో ప్రాంతాలున్నాయి. ఇవన్నీ 1947కు ముందు భారతదేశంలో అంతర్భాగాలే. భరతవర్షే భరతఖండే అంటే కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు మాత్రమే ఉన్న భూభాగం కాదు. ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్, శ్రీలంక భూటాన్, నేపాల్, ఆఫ్ఘనిస్థాన్, మాల్దీవులు, బెలూచిస్తాన్ ఈ మొత్తం కలిపితే ప్రాచీన భారతదేశం అవుతుంది. అంతేకాదు శైలేంద్రరాజులు ఆగ్నేయ ఆసియాను ఏడువందల సంవత్సరాలు పాలించారు. చైనా రాణిని ఒక హిందూ రాజ వైద్యుడు వివాహమాడి, ఆ దేశాన్ని పాలించిన సంఘటన చిన్నప్పుడు చదువుకున్నాను. టిమోజిన్ అనే మంగోలు ఆటవికుడు చైనాను ఆక్రమించుకునేటప్పటికి చైనాలో బౌద్ధం రాజ మతంగా ఉండేది. ఇక ఇండోనేషియాలో నేటికీ శ్రీరాముడు హనుమంతుడు సీత వంటి దేవతామూర్తుల విగ్రహాలు కనిపిస్తాయి. అంటే భారతీయ సంస్కృతి మొత్తం ఆసియాకు విస్తరించిందని తాత్పర్యం. సుకర్ణో మేఘావతి సుహృత్ వంటి ఇండోనేషియా పాలకుల పేర్లు (సుహార్తో) ఇందుకు మరిన్ని ఉదాహరణలు. అనేకానేక కారణాలవలన హిందువులు బలహీనులైనారు. ఫలితంగా భారతదేశంనుండి విడివడిన ప్రాంతాలు స్వతంత్ర రాజ్యాలుగా మారాయి. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చినట్లే ఇచ్చి దేశాన్ని బ్రిటీషువారు ఆర్థికంగా రాజకీయంగా బలహీనపరిచారు. ఇండియానుండి నేపాల్, శ్రీలంక, బర్మా వంటి ప్రాంతాలు విడిపోయి స్వతంత్ర దేశాలు అయినాయి. ఇక నెహ్రూగారి పుణ్యమా అని తూర్పు-పశ్చిమ పాకిస్తాన్‌లు ఏర్పడ్డాయి. కాశ్మీరును పాకిస్తాన్ సైనిక చర్యతో ఆక్రమించుకుంది. టిబెట్‌ను చైనా స్వాధీనం చేసుకుంటే నెహ్రూగారు అది చైనావారి ఆంతరంగిక సమస్య- మనం జోక్యం చేసుకోకూడదు’ అన్నారు. దలైలామా ఇండియాలోని ధర్మశాలకు రహస్యంగా పారిపోయి వచ్చి తన అనుచరులతో నేటికీ తలదాచుకుంటున్నారు.
టిబెట్ కింది భాగంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. దీనికి లోయర్ టిబెట్ అని పేరు. టిబెట్ చైనాకు చెందినప్పుడు లోయర్ టిబెట్ కూడా వారికే చెందాలి కదా! ఇదీ గత కొన్ని దశాబ్దాలుగా చైనాచేస్తున్న వాదం. ఐతే ఇక్కడ భారత్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నది. ఐనా మేఘాలయ- అరుణాచల్‌ప్రదేశ్‌లో క్రైస్తవ- కమ్యూనిస్టువర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. అంటే సాంస్కృతికంగా ఈ ప్రాంతాన్ని భారత్‌నుండి విడదీసే ప్రయత్నం తీవ్రంగా జరుగుతున్నది. దీన్ని అరవై ఏళ్లుగా కాంగ్రెసు ప్రభుత్వాలు ప్రోత్సహించడం దారుణం. ఇటీవల అరుణాచలప్రదేశ్ గవర్నర్ దేశభక్తుడు కాబట్టి ఆయనను తొలగించాలి అని ఆందోళన జరగటం మీకు గుర్తుండే ఉంటుంది. ఇక నేపాల్ అనాదిగా హిందూ సంస్కృతితో పరిమళించిన ప్రాంతమే. గౌతమ బుద్ధుడు పుట్టిన లుంబిని ఇక్కడే ఉంది. రాజుమహేంద్ర రాణి ఐశ్వర్యలు పాలం విమానాశ్రయానికి వచ్చినప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ వంటి వారు స్వాగతం చెప్పిన దృశ్యాలు నాకింకా గుర్తున్నాయి. దశలవారిగా నేపాల్‌లో చైనా కల్లోలం సృష్టించింది. భట్టారాయ్ అనే తమ అనుచరునితో నేపాల్‌లో విధ్వంసక కార్యకలాపాలను ప్రోత్సహించింది. ఖాట్మండూకు నూరు కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాచీన తాళపత్ర గ్రంథాలయం ఉంది. అందులో విలువైన సంస్కృత ప్రాకృత (పాళీ) భాషలోని గ్రంథాలు పెద్దసంఖ్యలో ఉన్నాయి. దానికి నిప్పుపెట్టారు. రాచరిక నిర్మూలన పేరుతో బీరేంద్ర కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా రాజ్యవ్యవస్థను కూల్చివేశారు. మిత్తింటి వెంకట్రావు సికిందరాబాదులో ఉన్న వయోవృద్ధుడు. ఆయన ఇండోనేపాల్ ఫ్రండ్‌షిప్ సొసైటీని చాలా దశాబ్దాలు నడిపి ఎనలేని సేవ చేశారు. ప్రతి సంవత్సరం పశుపతినాధ సందర్శనంకోసం నేటికీ వేల సంఖ్యలో భక్తులు నేపాల్ వెళ్తుంటారు. అలాంటిది ఏకైక హిందూ రాజ్యమైన నేపాల్‌లో భారత వ్యతిరేక ధోరణులు ప్రబలాయి. మానస సరోవర్ వెళ్లడానికి వీసా తీసుకోవలసిందే!! చైనా 1962లో హిమాలయ సానువులను ఆక్రమించుకున్నప్పుడు మక్‌మోహన్‌రేఖ సరిగ్గాలేదనే సాకు చూపించింది.
1857లో మొదటి స్వాతంత్య్ర సమరం జరిగిన తర్వాత బ్రిటీషువారు నేటి ఉత్తరప్రదేశ్ బిహారులలోని కొన్ని జిల్లాలను నేపాల్‌లో కలిపారు. ఈ భూభాగానికి మాధేస్ అని పేరు. ఈ ప్రజలను మాధేసీలు అంటారు. వీరు హిందీ మాట్లాడుతారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న కారణంగా జయప్రకాశ్‌నారాయణ్‌తోబాటు నేపాల్‌కు చెందిన బి.సి కొయిరాలాను కూడా బ్రిటీషువారు హజారీబాగ్ జైలులో బంధించిన విషయం గుర్తుండే ఉంటుంది. భారత సైన్యంలో నేపాల్‌కు చెందిన గూర్ఖా దళం ఉండటం కూడా మనకు తెలుసు. అంటే నేపాల్ ఇండియా వేరువేరుకావు. ఐతే వ్యూహాత్మకంగా నేడు ఈ రెండుప్రాంతాల మధ్య చైనా చిచ్చుపెట్టింది. అంటే తొలి దశలో నేపాల్‌కు భారత్‌పై వ్యతిరేకత పెరిగితే మలి దశలో నేపాల్‌ను, టిబెట్ వలె చైనా ఆక్రమించుకోవచ్చు. ఇందుకు భారత్‌లోని తమ ఆంతరంగికుల మద్దతు ఉండనే ఉన్నది.
సారాంశం ఏమంటే ఇండియా క్రమంగా టిబెట్ అరుణాచలప్రదేశ్ నేపాల్ ఆక్రమిత కాశ్మీర్ వంటి ప్రాంతాలను కోల్పోతున్నది. దీన్ని అరవై సంవత్సరాలు మనలను పాలించిన ధృతరాష్ట్రులు పట్టించుకోలేదు. 1989లో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇండో- నేపాల్ వాణిజ్య ఒప్పందాలు రద్దుకావటం చరిత్ర విద్యార్థులకు తెలుసు. ఇందుకు నాటి బీరేంద్ర కారణం. ఇతడు చైనా బంటు. నేపాల్‌కు ఉప్పు కిరోసిన్ ప్రాణరక్షణ ఔషధాలు చైనానుండి పొందవలసి ఉంది. ఈ విధంగా చైనా ప్రధాని భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌లో ప్రదర్శనలు నిర్వహించేటట్లు చేయించాడు. నేపాల్ కాంగ్రెసు-నేపాలీ కమ్యూనిస్టులతో కూడిన అఖిలపక్ష ఉద్యమాలు ఊపునందుకున్నాయి.
వి.పి.సింగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారత్ సరుకులు మళ్లీ నేపాల్ చేరటం మొదలైంది. అప్పుడు ఎస్.కె.సిన్హా భారత రాయబారిగా నేపాల్‌లో నియుక్తులై ఇండో నేపాల్ సాన్నిహిత్యానికి కృషిచేశారు. భారత రాజ్యాంగ నిపుణుడు ఎల్.ఎం.సింఘ్వి నేపాల్ రాజ్యాంగ నిర్మాణాన్ని చేశారు. భారత ‘సెక్యులర్’ పదం నేపాల్ హిందూ దేశానికి ఇష్టంలేదు. ఐనా సింఘ్వి రాజ్యాంగాన్ని వారు మన్నించారు. రాజు వీరేంద్ర సకుటుంబంగా రాజప్రసాదంలో హత్య చేయబడటంలో నేపాల్ రాజకీయాలు చైనాకు అనుకూలంగా మలచబడ్డాయి. తనకు దొరికిన ప్రతి సువర్ణావకాశాన్ని చైనా సద్వినియోగంచేసుకుంటే ఇండియా జారవిడుచుకుంది. రాజు జ్ఞానేంద్ర, యువరాజు పారస్‌ల దౌష్ట్యం ఆధారంగా నేపాల్‌లో అంతర్యుద్ధం (సివిల్ వార్) సృష్టించారు. భారత్‌లో 2004లో యుపిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోనియాగాంధీ మన్మోహన్‌సింగులు తమ రాజకీయ అస్తిత్వంకోసం కమ్యూనిష్టుల మీద ఆధారపడవలసి వచ్చింది. అందుకని వీరు ఎలాచెబితే అలాగే ఇండో- నేపాలీ విదేశాంగ విధానం రూపొందించారు. క్రమంగా ‘హిందు’పదం వదిలిపెట్టి నేపాల్ ‘సెక్యులర్’ పదం స్వీకరించేటట్లు చేశారు. ఐతే 2014లో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక మోదీ నేపాల్ వెళ్లి తిరిగి భారత్ నేపా ల్ సాంస్కృతిక బంధాన్ని పునరుద్ధరించే ప్రయత్నం సాగించారు. 2015 సెప్టెంబరులో ప్రకటింపబడ్డ నూతన నేపాల్ రాజ్యాంగంలో భారత సంతతికి చెందిన మధేసీల పట్ల వివక్ష స్పష్టంగా కన్పడుతున్నది. జనాభా ఆధారంగా కాక భౌగోళిక వైశాల్యం ఆధారంగా నియోజకవర్గాల విభజన జరిపి 52 శాతం ఉన్న మధేసీలకు అన్యాయం జరిగేటట్లు నూతన నేపాలీ ప్రభుత్వం చేసింది. అంటే 165 నియోజకవర్గాల్లో మాధేసీలకు 65 నియోజకవర్గాలు మాత్రమే వచ్చాయి. ఈ విధంగా నేపాల్‌ను భారత్‌కు దూరంచేసే వ్యూహంలో చైనా సఫలమయింది. ఇవేవీ మన దేశంలోని సోనియా భజన బృందానికి పట్టకపోవటం ఆశ్చర్యం కల్గించే విషయం. నేపాల్ నూతన రాజ్యాంగాన్ని చైనా స్వాగతిస్తే భారత్ అభ్యంతరం తెలిపింది. ఇది మా ఆంతరంగిక వ్యవహారాలల్లో జోక్యంచేసుకోవడం అని నేపాల్ ఇండియాను బెదిరించి ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదుచేసే దశవరకు వెళ్లిందంటే మన పూర్వ పాలకులు విదేశాంగ నీతిని ఎంత దిగజార్చారో అర్ధంచేసుకోవచ్చు. నిజానికి మొన్నటి నేపాల్ భూకంప సంక్షోభంలో నేపాల్‌ను కాపాడింది భారత ప్రభుత్వమే. ఐనా ఈ ఇంగితం వారికి లేకుండాపోతే ఎలా? ‘‘1950వ దశకంలో టిబెట్టును చైనా కబళించినట్లే ఇప్పుడు నేపాల్‌ను కూడా కబళిస్తే ఇక భారత్ అస్తిత్వానికి హిమాలయాలల్లో ప్రమాదం పొంచి ఉన్నట్లే’’ అంటారు నేపాల్‌లోని మాజీ భారత రాయబారి ఎస్.కె.సిన్హా.
తమిళనాడు రాష్ట్రంలో సగం విస్తీర్ణంకూడా లేని శ్రీలంక తమిళ జాలర్లను ఎలా ధైర్యంగా అరెస్టుచేస్తున్నది? త్రింకోమలై కచ్చితీవుప్రాంతాలలో షణ్ముఖం గణేశ దేవాలయాలను ఎలా నేల కూల్చగలిగింది? కాశ్మీరులో ఇండియా త్రివర్ణ పతాకానికి బదులు పాక్ జండాలు ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల ఖలీఫా జండాలు ఎలా ఎగురుతున్నాయి? నేపాల్ తన సరిహద్దులలో భారత సైనికులను నిరోధించి ఎలా నిరసన తెలుపగలిగింది? బ్రహ్మపుత్రపై చైనా ఎలా వంతెనలు నిర్మించగలిగింది? ఇంత జరుగుతున్నా భారత ప్రజలు ప్రభుత్వాలు చూస్తూ ఎందుకు ఊరుకున్నాయి?! హిమాలయ పాద సానువులలోని చిన్న చిన్న దేశాలు ప్రాంతాలు క్రమక్రమంగా చైనా ఖాతాలోకి వెళ్లిపోతున్నాయి. ఖైబర్ బోలక్ కనుమల నుండి మానస సరోవర్‌వరకు మొత్తం నేడు భారత్‌కు అరక్షిత ప్రాంతం. అంటే హిమాలయాలు ఇక మీద మనలను రక్షించలేవు. చేతనైతే మనమే హిమాలయాలను రక్షించుకోవాలి.
ఒక్కటి మాత్రం నిజం! ఆసియాలో బలమైన ఆర్థిక రాజకీయశక్తిగా ఇండియా ఎదగటం చైనాకు ఇష్టంలేదు. అందుకే సమయం వచ్చినప్పుడల్లా భారత సమైక్యతపై దెబ్బతీస్తూ తన బలాన్ని పెంచుకుంటున్నది. కొద్దిరోజుల క్రితం బిజెపి నాయకుడు రాంమాధవ్ మాట్లాడుతూ ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్‌లు కలిసి అఖండ భారత్‌గా ఉండటం మంచి ఆలోచన అన్నారు. దానిలో భారతదేశంలోని సామ్యవాదులు అదేదో మహాపాపమైనట్లు గొడవచేశారు. ఎందుకని? ఇండియా నేపాల్ పాక్ బంగ్లా- శ్రీలంకలు కలిసి ఒక ఫెడరేషన్‌గా ఏర్పడితే తప్పేమిటి? ఇప్పుడు ఆర్థికంగా కామన్‌వెల్త్ కూటమి అలాంటి పనినే పరోక్షంగా ఆర్థిక సాంస్కృతిక రంగాలల్లో చేస్తున్నది. దానిని అందరూ అంగీకరించారు. అలాంటప్పుడు హిమాలయ దేశాలన్నీ కలిసి భారత్‌తో అఖండ సమాఖ్య (ఫెడరేషన్) గా ఏర్పడితే మంచిదే కదా??

- ముదిగొండ శివప్రసాద్