ఎడిట్ పేజీ

సరిహద్దుల్లో అశాంతికి చైనా ఆజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కుక్కతోక వంకర’ అన్నట్టు చైనా పాలకులకు బుద్ధి రావటం కలలోని మాట. అమెరికా, చైనాల వాణిజ్య యుద్ధం ప్రస్తుతం పతాక స్థాయి చేరుకుని, ఆసియా ఖండంపై ఈ రెండు దేశాలూ పట్టు బిగిస్తున్నాయి. పాకిస్తాన్‌కు రక్షణ సహాయాన్ని అమెరికా ఆపివేయగా చైనా మాత్రం పాక్‌ను తన వాణిజ్యవలస క్షేత్రంగా మార్చుకుంది. ఉత్తర కొరియా, చైనాల నుండి పాక్‌కు ఆయుధ సంపత్తి అందుతోంది. ఆయుధ పాటవాన్ని భారత్‌పై ప్రయోగించటమే పాక్ లక్ష్యం. మన దేశంలోని దక్షిణ లడఖ్‌ను ఆక్రమించడానికి చైనా వ్యూహరచన చేసింది. అక్కడ అక్రమ కట్టడాలు, రోడ్లు నిర్మించి తన సైనికులను ప్రవేశపెట్టింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కొంత భాగాన్ని చైనాకు పాక్ దత్తత ఇచ్చింది. బలూచిస్థాన్‌లో చైనా వాణిజ్య సౌకర్యాల పేరుతో రెడ్ కారిడార్ నిర్మించింది. దీనిని అడ్డుకునే బలూచి ప్రజలను సామూహికంగా హత్యచేసి ఖననం చేస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించిన డ్యామ్ 2019 నాటికి పూర్తవుతుంది. దీని గేట్లు తెరిస్తే అరుణాచలప్రదేశ్ వంటి కొన్ని ఈశాన్య రాష్ట్రాలు నీట మునుగుతాయి. ఈ ప్రయత్నాలను మన ప్రభుత్వం ఎలా నిరోధిస్తుందో చూడాలి. మన రాజకీయ పార్టీలు పరస్పరం కొట్లాడుకుంటూ దేశ భద్రతను గాలికొదిలేశాయి. చైనా ద్విముఖ పోరాటం మొదలుపెట్టింది. ఇందులో మొదటిది- భారత్‌ను ఈస్టిండియా కంపెనీ తరహాలో ఆక్రమించుకోవటం. అంటే తమ సరుకులను ఇండియాలోకి డంప్ చేయటం. రెండవది- టిబెట్, లడఖ్‌లను అంచెలంచెలుగా ఆక్రమించుకోవటం. భారత్‌లో వర్గపోరాటం పేరిట అశాంతిని రెచ్చగొట్టడం. భారత్‌లోని అగ్ర నాయకులను హత్య చేయించటం. చైనా చేస్తున్న ఈ వ్యూహరచనకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఇప్పటికే మన నిఘా విభాగానికి అందాయి.
భారత నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ లంబా కొద్దిరోజుల క్రితం మాట్లాడుతూ, పాక్ సహా ఇతర దేశాల నుంచి ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ప్రతిఘటిస్తామన్నారు. ముంబయి పేలుళ్ల ఘటనకు పదేళ్లు నిండిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి పాకిస్తాన్ దళాలు దాడికి తెగబడితే ప్రత్యక్ష యుద్ధం తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. భారత్‌కు ప్రస్తుతం 7,500 కిలోమీటర్ల సొంత భూభాగంలో రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంది. పది నాటికల్ మైళ్ల విస్తీర్ణం వరకూ నిఘా వేయగల హైరిజల్యూషన్ కెమెరాలు భారత్‌కు ఉన్నాయి. కానీ, చేపలను వేటాడే జాలర్ల వేషాల్లో పాక్ సైనికులు మన సముద్ర జలాల్లోకి ప్రవేశించవచ్చు. కశ్మీర్, హైదరాబాదు, భైంసా వంటి అనేక ప్రాంతాల్లో ముస్లిం సామాజిక వర్గాలను ఎగదోయడం, కేరళలోని మల్లపురం వంటి ప్రాంతాల్లో ఐసిస్ ఉగ్రవాద స్థావరాలను నిర్మించటం- దానిని అక్కడి సీపీఎం ప్రభుత్వం ప్రత్యక్షంగా ప్రోత్సహించటం వంటి అంశాలు దేశంలో అశాంతిని రేకెత్తించే ప్రమాదం ఉంది.
విచిత్రమేమంటే ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రవాద సంస్థ ‘సిమీ’తో అక్కడి సమాజ్‌వాదీ పార్టీ సంబంధాలు పెట్టుకుంది. అలాగే, తెలంగాణలో ముస్లిం పార్టీ ‘మజ్లిస్’తో అధికార తెరాస పార్టీ సన్నిహితంగా ఉంటోంది. మజ్లిస్, తెరాసల మధ్య అనధికారికంగా ఎన్నికల పొత్తు కుదిరింది. ఈ పరిణామాలను ఎవరూ పట్టించుకోవటం లేదు. దేశం లోపల, బయట భారత్ మతోన్మాద ఉగ్రవాదాన్ని ఎదుర్కొనవలసి ఉంది. సరిహద్దుల్లో పాక్, చైనాలు అశాంతిని రాజేస్తున్నాయి. పాకిస్తాన్‌లోని కరాచీ రేవులో చైనా న్యూక్లియర్ సబ్ మెరిన్ ఎందుకు మాటువేసి ఉంది? ఈ రేవు పట్టణాన్ని చైనాకు పాక్ దత్తత ఇచ్చిందా?
***
భాజపాలో ప్రధాని నరేంద్ర మోదీకి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారా? ఆదిత్యనాథ్ సీఎం పదవిని చేపట్టాక ఫూల్‌పూర్, ఖైరానీ, గోరఖ్‌పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో భాజపా ఓటమిని చవిచూసింది. ఈ వైఫల్యాల నేపథ్యంలో ఆదిత్యనాథ్‌ను మోదీకి ప్రత్యామ్నాయంగా భాజపా తెరపైకి తెస్తుందా? అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో మోదీ మంచిపేరు తెచ్చుకున్నా- పెద్దనోట్ల రద్దు, వస్తుసేవా పన్ను (జీఎస్టీ) అంశాల్లో మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం కలవారు చాలామంది ఇరుకున పడ్డారు. వారే ఇప్పుడు మోదీని గద్దె దింపాలని ఆందోళన మొదలుపెట్టారు. మాయావతి, మమతా బెనర్జీ, ములాయం సింగ్, సోనియాగాంధీ సహా చాలామంది రాజకీయ నాయకుల, పారిశ్రామికవేత్తల ఆర్థిక మూలాలు నోట్లరద్దుతో దెబ్బతిన్నాయి. అడవిలోని ‘అన్న’ కరన్సీ డంప్‌లు నిరుపయోగం అయ్యాయి. రాజీవ్ గాంధీని శ్రీపెరుంబుదూరులో హత్య చేసిన పద్ధతిలో ఎన్నికల రోడ్ షోలో మోదీని హత్యచేయాలని మావోయిస్టులు కుట్ర పన్నారు. మోదీని ఓడించాలని పరితపిస్తున్న విపక్ష నేతలు ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్నారు. విపక్షాల ఐక్యత ప్రశ్నార్థకంగా మారింది. కర్నాటకలో జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నాళ్లు అధికారంలో ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. చైనా, పాకిస్తాన్‌ల నుండి వస్తున్న సందేశాలు, సంకేతాల మేరకు కొందరు విపక్ష నేతలు మోదీని ‘టార్గెట్’ చేస్తున్నారు.
***
భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదగటం అమెరికా,బ్రిటన్, చైనాలకు ఇష్టం లేదు. అందుకే భారత్‌ను అంతర్యుద్ధంలోకి నెట్టివేయాలని, మోదీ స్థానంలో బలహీనమైన ప్రధానమంత్రిని ఢిల్లీలో కూర్చోబెట్టాలని శత్రు దేశాలు వాంఛిస్తున్నాయి. ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఇండియాలోని ముస్లిములు ఎవరికి ఓటువేయాలో సౌదీ అరేబియా, పాకిస్తాన్ నిర్ణయిస్తున్నాయి.
***
హైదరాబాద్‌లో ఎన్నికల వేడి తీవ్రంగా ఉండగా కొన్ని ముఖ్యాంశాలను విశే్లషకులు గమనించడం లేదు. లోక్‌సత్తా పార్టీ ఇపుడు ఏమైంది? తెలంగాణ ఎన్నికల్లో జనసేన, వైకాపాలు ఎందుకు పోటీ చేయడం లేదు. ఈ పార్టీలకు చెందిన సానుభూతిపరులు ఏ పార్టీకి ఓట్లు వేస్తారు. తెరాసకు మద్దతు ఇస్తారా? మహాకూటమి ఓటమికి చేతులు కలుపుతారా? 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా మారి పోతాయి. వామపక్ష పార్టీలు కలసి పోటీ చేయడం లేదు. ఇక హైదరాబాద్‌లో శివసేన వర్గం బిజెపికి మద్దతు ఇవ్వడం లేదు. హైదరాబాద్‌లో కన్నడిగులు, బెంగాలీలు, గుజరాతీలు, రాజస్థానీలు గణనీయంగా ఉన్నారు. వీరు ఏ పార్టీకి అండగా నిలుస్తారు?
***
కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అమెరికాలో విద్యనభ్యసించి వచ్చిన కేటీఆర్ మహాకూటమిపైన ముఖ్యంగా కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాము తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ వారు అడ్డుకుంటున్నారన్నది ఆయన ప్రధాన ఆరోపణ. ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ నేతలపై కేటీఆర్ గురిపెట్టారు. ఎన్నికల సమయంలో తెరాస, కాంగ్రెస్ నేతల మధ్య తిట్ల పురాణం కొనసాగుతోంది. రాజకీయాల్లో ఆదర్శంగా నిలవాల్సిన నేతలు ఇలా చౌకబారు మాటలతో దాడులు చేసుకోవడం మంచి సంప్రదాయం కాదు. తెరాస ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలతో రాష్ట్రం దివాలా తీస్తోందని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. మిగులు రాష్టమ్రైన తెలంగాణ గత నాలుగేళ్ళలో రూ. 2 లక్షల కోట్ల రుణాలతో అప్పుల కుప్పగా ఎలా మారింది? సెక్రటేరియట్ ఉండగా కోట్లు ఖర్చుపెట్టి కేసీఆర్ ‘ప్రగతి భవన్’ను ఎందుకు కట్టినట్లు? తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను కేసీఆర్ రెచ్చగొట్టటం వల్లనే సుమారు 1,500 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ సంఖ్యను తగ్గించి 500 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం చెబుతున్నదని కాంగ్రెస్ వారు ఆరోపిస్తున్నారు.
***
పూణెలోని కాస్మోస్ బ్యాంక్‌లో రూ. 94 కోట్ల కుంభకోణం జరిగింది. ఇది ఎంతమంది దృష్టికి వచ్చిందో తెలియదు. దీనిపై ‘సిట్’ విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్టు మరో వార్త. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, లలిత్ మోడీ వంటి ఘరానా వ్యక్తులు బ్యాంకులను ఎలా మోసం చేయగలుగుతున్నారు? సామాన్యులకు సవాలక్ష కండిషన్లు పెట్టి ఋణాలు ఇచ్చే బ్యాంకులు ఈ మహానుభావులకు ఎలా వేల కోట్లు ఎలాంటి హామీలు లేకుండా ఎలా ఇస్తున్నాయి? దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ పై దేశప్రజల విశ్వాసం సన్నగిల్లుతున్నది. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మరింత పతనమయింది. డాలరు ఖరీదు 70 రూపాయలయింది. ఇపుడు వంద రూపాయల నోటుకు కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి దోహదం చేస్తుంది. కొద్దిరోజుల క్రితం ‘ఇండియాటుడే’ పత్రిక దేశంలోని ముఖ్యమంత్రుల పని తీరుపై ఒక సర్వే నిర్వహించింది. అందులో మమతాబెనర్జీ బాగా పనిచేస్తున్నదని ప్రజాభిప్రాయం రాగా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వే వెల్లడించింది. ఇది నమ్మవలసిందేనా?
***
పాకిస్తాన్ ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన పంజాబ్ మంత్రి నవజోత్‌సింగ్ సిద్ధూ వెళ్లటం న్యాయమేనా? పాక్ సైన్యాధ్యక్షుణ్ణి సిద్ధూ కౌగలించుకొని మంతనాలు జరపటం దేశద్రోహం కాదా? కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ప్రధాని నరేంద్ర మోదీని ఓడించాలని పాక్ సైనికాధికారులను ఆహ్వానించటం ఏమిటి? అయ్యర్‌ను మోదీ ఎందుకు జైలుకు పంపలేదు? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అయ్యర్‌ను ఎందుకు పార్టీనుండి బహిష్కరించలేదు? దేశంలో ఇంతమంది దేశద్రోహులు పుట్టుకువస్తుంటే మన స్వాతంత్య్రం నిలుస్తుందా??
* * *
‘ఒక అబద్ధాన్ని సృష్టించడానికి వందసార్లు ప్రచారం చేస్తే- అప్పుడు అది నిజంగా కన్పడుతుంది’ అన్నాడు మూనిచ్ నగరంలో గోబెల్స్. ఇతను నియంత హిట్లర్‌కు 1933లో ప్రచార సమార శాఖ మంత్రి. మన రాజకీయ నాయకులు గోబెల్స్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ‘నీళ్ళు, నిధులు, నియామకాలు’ అంటూ కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో విస్తృత ప్రచారం చేశారు. ఆ మాటలకు ఆవేశం తెచ్చుకున్న ఎంతోమంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు నిధులూ లేవు, నియామకాలూ లేవు. తెలంగాణ సర్కారు 2 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నట్లు గణాంకాలు చూపిస్తున్నాయి.

-- ప్రొ. ముదిగొండ శివప్రసాద్