మెయన్ ఫీచర్

తూర్పు తీరంలో లోపిస్తున్న భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై నుండి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన భారత వైమానిక దళానికి చెందిన ఎన్-32 విమానం ఆచూకీ లభించకపోవడంతో భారత భద్రతా వ్యవస్థ పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 29 మంది శిక్షణ పొందిన సైనికులు సైతం గల్లంతవడం దురదృష్టకరం. ఈ విమా నం ఆచూకీ కనుగొనడానికి భారత ప్రభు త్వం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటి వరకు ఫలితం లేదు.
కొద్దికాలం క్రితం మలేసియాకు చెందిన ఎంహెచ్-370 పౌరవిమానం హిందూమహాసముద్రంలో గల్లంతైంది. తర్వాత దాని ఆచూకీ లభించినా అసలేం జరిగిందో అంతుబట్టడంలేదు. తాజాగా జరిగిన సంఘటన తూర్పుతీరంలో మన భద్రత సన్నద్ధత పట్ల అనుమానాలు కలిగిస్తున్నది. బహుశా ఈ ప్రాంతంలో వైమానిక దళానికి చెందిన రాడా ర్ అండమాన్, నికోబార్ దీవులలో మాత్రమే ఉంది. అది కూడా ఎప్పుడూ అవసరం మేర కు పనిచేయదని తాజా సంఘటన వెల్లడి చే స్తున్నది. చైనా లేదా పాకిస్తాన్ దేశాలకు చెం దిన వైమానిక దళాలు సాయుధ విమానాలను ప్రయోగిస్తే తూర్పుతీరంలో ముందుగా పసిగట్టి ఎదుర్కొనగలమా అనే సందేహాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి. ఈ తీరంలో పలు కీలకపైన పౌర, సైనిక స్థావరాలున్నాయి. వీటిల్లోనే కుడంకుళం అణువిద్యుత్ ఉత్పాదక కేంద్రం, తూతుకూడి ఓడరేవు, మహేంద్రగిరి వద్ద గల ఇస్రో రాకెట్ ప్రయోగకేంద్రం ఉన్నాయి. వీటన్నింటికి మించి శ్రీహరికోట వద్దగల రాకెట్ ప్రయోగకేంద్రం ప్రసిద్ధి చెందింది.
పార్లమెంటులో ఒక సభ్యుడు భద్రత అం శాలను చిత్రీకరించిన సంఘటనపై రోజుల తరబడి చర్చలు జరిపి పార్లమెంట్‌ను సమావేశాలను స్తంభింపజేసిన రాజకీయ పార్టీలు కీలకమైన ఇటువంటి భద్రత అంశాలను ప ట్టించుకొనకపోవడం విచారకరం. అదేవిధం గా మోదీ సైతం ప్రధానమైన అంశాలను వి స్మరిస్తున్నారు. శత్రువులనుండి ఎటువంటి దా డులు ఎదురైనా ఎదుర్కొనడానికి పశ్చిమ తీరంలోవలె భారత్ తూర్పుతీరంలో సంసిద్ధంగా లేదని భావించవలసి వస్తున్నది. చైనా కు చెందిన నౌకలు, జలాంతర్గాములు పెద్ద సంఖ్యలో హిందూ మహాసముద్రంలోకి వస్తున్నాయి. తూర్పు తీరంలోని దక్షిణ భా గం కిందికి వెళితే హిందూ మహాసముద్రం పెద్దదూరంలో లేదని చెప్పవచ్చు. ఎనబయ శా తం చమురు రవాణా ఓడలు ప్రయాణించే హిందూమహా సముద్రం వాణిజ్యానికి, యు ద్ధానికి కీలక ప్రాంతంగా మారుతున్నది. అందుకనే తూర్పు తీరంలో సైతం ఎటువంటి ఉపద్రవాన్నయనా ఎదుర్కొనడానికి భారత్ సిద్ధపడవలసిన అవసరం ఉన్నదని స్పష్టమవుతున్నది.
ఒక పక్కన తూతుకూడి ఓడరేవును అభివృద్ధి చేయడంతో వాణిజ్య కార్యలాపాలు పెరుగుతున్నాయి. బెంగళూరు, చెన్నైల నుం చి జాతీయ రహదారులు ఏర్పడడంతో వాహనాల రద్దీ మరింతగా పెరిగే అవకాశముంది. అయితే భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడకు పెద్ద పెద్ద ఓడలు వచ్చి ఆగలేవు. చిన్న చిన్న పడవల ద్వారా మాత్రమే రవాణా కు అనుకూలంగా ఉంటుంది. మరోపక్కన పశ్చిమతీరంలో తిరువనంతపురం సమీపం లో రెండు పెద్ద ఓడరేవులు సిద్ధం కానున్నా యి. కేరళలోని విఝిన్‌జం కంటైనర్ రవాణా ఓడరేవుతో పాటు, తమిళనాడులో లోతైన నీటిలో కొలచెల్ ఓడరేవు నిర్మాణానికి ఈమధ్యనే ఆమోదం తెలిపారు. అయితే చైన్నై, ఎన్నోర్‌ల వద్దగల ఓడరేవులలో వలె ఈ రెం డూ ఏవిధంగా ప్రయోజనకారిగా ఉండగలవన్నదానిపై కొన్ని సందేహాలు లేకపోలేదు. రెం డూ తిరువనంతపురానికి సమీపంలో ఉండటంతో లోతైన నీటిలో ఉండే కొలచెల్ సాం ప్రదాయిక ఓడరేవుగా ఉంటే, విఝిన్‌జం కం టైనర్‌లకు ఉపయోగపడగలదా? రెండూ తిరువనంతపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి, రైల్వే డివిజనల్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉండటంతో స్థానికంగా గల వౌలిక సదుపాయాలకు ఉపయోగించుకోవచ్చు. త్వరలో జిఎస్‌టి అమలులోకి వచ్చే అవకాశం ఉన్నందున రాష్ట్రాల సరిహద్దులు సరుకు రవాణాకు ప్రతిబంధకంగా నిలబడలేవు.
ఈ సందర్భంగా రెండు తీర ప్రాంతాలను సరుకు, పారిశ్రామిక క్యారిడార్‌తో విఝిన్ జం, కొలచెల్‌ల నుండి తూతుకూడికి నాగర్‌కోయెల్ మీదుగా కలిపితే మరింత ప్రయోజనకారిగా ఉండగలదని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సాగరమాలలో భాగంగా ప్రస్తుతం ప్రారంభించిన తిరువనంతపురం-నాగర్‌కోయెల్ జాతీయ రహదారి విస్తరణ పనులను పూర్తి చేయాలి. కేరళలోని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు, తమిళనాడులోని తయారీ ఉత్పత్తులకు ఇవి ప్రోత్సాహం కలిగించగలవు. ఈ ప్రాంతంలో పారిశ్రామిక క్యారిడార్‌లతో పాటు విస్తారమైన వైమానిక స్థావరం కూడా ఏర్పర్చవలసిన అవసరం కూ డా ఉంది. అత్యాధునిక రాడార్‌తో పాటు స ముద్రంతో శత్రువుల జలాంతర్గాములను వెం టాడి, దాడి చేయగల పెట్రోలింగ్ వ్యవస్థను కూడా ఏర్పరచుకోవలసిన అవసరం ఉన్నది. గత సంవత్సరం కొలంబో వద్ద చైనా జలాంతర్గామి ఆగి ఉండడం ఈసందర్భంగా గు ర్తుంచుకోవాలి.
తిరువనంతపురం వద్ద సదరన్ ఎయిర్ కమాండ్ ఉన్నప్పటికీ, దానికి చెందిన యుద్ధ విమానాలు అనేకం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నాయి. కారా నికోబార్, సులూర్ (కోయంబత్తూర్), పోర్ట్ బ్లెయర్‌ల వద్ద ఇవి ఉంటున్నా యి. హిందూ మహాసముద్రంలో శత్రు విమానాలను అడ్డుకోవాలంటే సులూర్ నుండి విమానం ప్రయాణించడానికి అరగంటకు పైగా పడుతుంది. ఎరువెల్లి ప్రాంతంలో ఒక వైమానిక స్థావరాన్ని ఏర్పరచుకుంటే సత్వరమే విమానాలను పంపడానికి వీలు ఏర్పడుతుంది. గల్లంతైన ఎన్-32 విమానం సదరన్ ఎయిర్ కమాండ్ పరిధిలోనే ప్రయాణించడం గమనార్హం. అయినా దాని ఆచూకీ కనిపెట్టలేకపోతున్నాం. హిందూమహాసముద్రం లో మన వైమానిక దళ సామర్ధ్యాన్ని పటిష్ట పరచవలసిన అత్యవసరాన్ని ఈ సంఘటన వెల్లడి చేస్తున్నది. ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక క్యారిడార్‌లో ఎరోస్పేస్ క్లస్టర్‌ను కూడా అభివృద్ధి చేయడం చాలా సముచితంగా ఉండగలదు. మనతరంలో భద్రతా వ్యవస్థను పటిష్టం చేసుకోవలసిన అవసరం ఉందంటే చైనా నేరుగా వచ్చి మనపై దాడి చేసే అవకాశం ఉందని మాత్రం అర్థం కాదు. సుమారు 400 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి నేరుగా మనపై దాడిచేయగల దుశ్చర్యకు ఆ దేశం పాల్పడుతుందని భావించలేం. అయితే శ్రీలంక సహా మన పొరుగున ఉన్న పలు దేశాలతో ఆర్థిక సైనిక సంబంధాలను మెరుగు పరచుకోవడాననికి ఆదేశం చేస్తున్న యత్నాలను మనం విస్మరించలేం.
అయితే తన వాణిజ్య అవసరాల రీత్యా హిందూ మహాసముద్రంలో భద్రత అంశాలకు భారత్ సహకారం చైనాకు అత్యవసరం కాగలదు. ఈ విషయంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా చైనా దుందుడుకు ధోరణిని అరికట్టడం సాధ్యం కాగలదు. ఈ సందర్భంగా పొరుగు దేశాలతో, ముఖ్యంగా మాల్దీవులు, మారిషస్, సిషెల్స్ వంటి దేశాలతో సహ సంబంధాలను మెరు గు పరచుకోవడం ద్వారా హిందూ మహాసముద్రంలో భద్రతను మెరుగు పరచడానికి సమష్టి కృషి జరపడానికి వీలు కాగలదు. చైనాకు చెందిన 80 శాతం మేరకు సముద్రం వాణిజ్యం ఈ మార్గంలోనే జరుగుతూ ఉండటం వల్ల సైనికంగా ఈ ప్రాం తంపై ప్రాబల్యం వహించే విధంగా ఆ దేశం సమాయత్తం కావడం సహ జం. అందుకు తగిన రీతిలో భారత్ సైతం తగు రక్షణ చర్యలు చేపట్టక తప్పదు. అమెరికా రక్షణశాఖ కన్సల్టింగ్ ఫోరం 2005లో తయారు చేసిన ఒక నివేదిక ప్రకారం చైనా భారత్ చుట్టూ ఓడరేవు సదుపాయల సమూహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నది. ఇవన్నీ పౌర ఓడరేవులైనా, వాటిని సైనిక స్థావరాలుగా మార్చుకోవడం చైనాకు అంత సులభం కాకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండవలసిందే.
చైనా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఆధిప త్యం పొంద చూస్తున్న ఆర్థిక శక్తిగా రూపొందడంతో హిందూ మహాసముద్రం ప్రాం తంలో భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిస్థితుల లో పెను మార్పులకు కారణం కాబోతున్నది. అమెరికా, ఇతర అభివృద్ధి చెందిన ఆర్థిక శక్తులపై చైనా ఆధిపత్యం కోసం ఆర్థిక రక్షణ రం గాల్లో చేస్తున్న ప్రయత్నాలకు ఈ ప్రాంతం కీలక స్థావరంగా మారనున్నది. అంతర్జాతీయంగా ప్రబల శక్తిగా ఆధిపత్యం వహించడానికి సముద్రాలపై ఆధిపత్యం వహించే ప్రయ త్నాలను ఇటీవలికాలంలో చైనా ముమ్మరంగా చేస్తుండడం గమనార్హం. దానితో హిందూ మహాసముద్రంలో వివిధ దేశాల ప్రయోజనాల మధ్య ఘర్షణకు దారితీసే అవకాశముం ది. 1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ యు ద్ధం సందర్భంగా అమెరికా, సోవియట్ యూ నియన్లు ప్రత్యక్షంగా హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాయ. అమెరికా తన సప్తమవాహక నౌకను ఇక్కడకు తీసుకొని రాగా, సోవియట్ యూనియన్ యుద్ధ నౌకలను తెచ్చింది. అయితే సోవియట్ యూనియన్ వి చ్ఛిన్నం కావడంతో ఇప్పుడు అమెరికా ప్రధా న శక్తిగా ఉన్నది. ఇక చైనా తన ప్రాబల్యంకోసం ప్రయత్నిస్తున్నది.
అంతర్జాతీయంగా సముద్రంలో వాహనాల రాక పోకలు 1992 నుండి 300 శాతం పెరగడం గమనిస్తే వ్యూహాత్మకంగా సముద్ర యానానికి పెరుగుతున్న ప్రాధాన్యత వెల్లడి అవుతుంది. హిందూ మహాసముద్రంలో ప్రపంచంలోని కంటైనర్ ట్రాఫిక్‌లో సగం మేరకు జరుగుతున్నది. ఈ తీరంలో ఉన్న ఓడరేవులో ప్రపంచ వాణిజ్యంలో 30 శాతం జరుగుతున్నది. ప్రపంచ చమురు వాణిజ్యం 66 శాతం మేరకు ఈ సముద్రం ద్వారా జరుగుతున్నది. 55 శాతం చమురు నిల్వలు, 40 శాతం వాయువు నిల్వలు ఈ ప్రాంతంలోనే ఉన్నట్లు అంచనా. అందుచేత ఇంధనం దృ ష్ట్యా, ఇతరత్రా వ్యూహాత్మకంగా హిందూమహాసముద్రం నే డు తీవ్ర ప్రాధాన్యతను సంతరింపజేసుకున్నది. ఈ ప్రాంత రక్షణ పట్ల అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతై నా ఉంది. అఫ్గానిస్థాన్‌లో సంపన్నమైన ఎన్‌జిఓలో అత్యధిక జీతానికి పనిచేస్తున్న ఒక ఉద్యోగిని అపహరణకు గురైతే మీడియాలో లభించిన ప్రాధాన్యత, వైమానిక దళం వి మానం గల్లంతైన సంఘటనలో 29 మంది సై నికులు అదృశ్యం అయితే వారి గురించి ప ట్టించుకున్న పాపాన పోకపోవడం విచారం కలిగిస్తున్నది.

- చలసాని నరేంద్ర