మెయన్ ఫీచర్

చట్టం తెలియక అంతా తికమక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, దాడులు జరిగినపుడు తక్షణం స్పందించే తత్వం అంతకంటే తీవ్రమైన సంఘటనలు జరిగినపుడు మాత్రం చాలామందిలో ఉండటం లేదు. అదేదో మనకు పట్టనట్టు వ్యవహరిస్తుంటాం. స్వల్ప విషయాల్లో పట్టింపు లేకపోవడం మిగిలిన విషయాల్లో ఉదాసీనతకు దారితీస్తుంది. దీనికి కారణం ఆయా అంశాలపై సమగ్ర అవగాహన లేదా ఆసక్తి లేకపోవడమే. నకిలీ వైద్యులు, నకిలీ కరెన్సీ నోట్ల పంపిణీ, దేశవ్యతిరేక నేరాలు, సైన్యానికి సంబంధించిన నేరాలు, ప్రజాసంక్షేమాన్ని భంగపరిచే నేరాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినవి, ఎన్నికల నేరాలు, అధికారిక ఉత్తర్వులను ఉల్లంఘించడం, అబద్దపు సాక్ష్యాలు, నాణాలు, స్టాంపులకు సంబంధించిన నేరాలు, తూనికలు-కొలతలకు సంబంధించిన నేరాలు, ప్రజారోగ్య నేరాలు, భయోత్పాతాన్ని కలిగించడం, అనుమానాలు, అవమానాలు వంటి కేసుల గురించి వినడమే తప్ప స్వయంగా స్పందించేది చాలా తక్కువ.
ఎన్నికల సమయంలో అభ్యర్థుల ప్రలోభాలపై దృష్టి పెట్టడం వినా చట్టం దృష్టిలో ఎంత తప్పు చేస్తున్నామో కొంత మందికి స్పృహ ఉండటం లేదు. కల్తీ విషయాన్ని ప్రభుత్వమే చూసుకోవాలనే ధోరణి కొనసాగడం వల్ల కల్తీ మహమ్మారులు ఎక్కువయ్యాయి. పళ్లు, కాయగూరలు, మాంసం, నూనెలు, పప్పులు, గరం మసాలా వంటి నిత్యావసరాల కల్తీకి హద్దేలేకుండా పోయింది. వీటన్నింటికీ సంబంధించి ఎన్నో చట్టాలు, శిక్షలు చాలా స్పష్టంగా ఉన్నా వాటిపై అవగాహన లేకపోవడంతో రోజూ తినే ఆహార పదార్ధాల్లో కల్తీని సైతం నిలదీయలేకపోతున్నాం. తూనికలు- కొలతల విషయంలోనూ ఏం కొన్నా అర్ధకిలో వరకూ తక్కువ ఉంటున్నా, సీల్డు ప్యాకెట్లలో తూకం తక్కువ ఉన్నా ప్రశ్నించలేని స్థితి. ప్రజారోగ్యాన్ని భంగపరిచే విషయంలోనూ ఉదాసీనత తప్పడం లేదు.
భారత శిక్షా స్మృతి వీటిన్నింటికీ సంబంధించి స్పష్టమైన మార్గదర్శనం చేసింది. దేశంలో జరిగే అనేక నేరాలకు సంబంధించి భారత శిక్షా స్మృతి వివరించింది. వాస్తవానికి ఇది బ్రిటిష్ వలస పాలకుల కాలంలోనే 1860లో అమలులోకి వచ్చింది. ఇంతవరకూ అనేక చేర్పులూ మార్పులూ చేశారు. ఎటువటి చర్యలు శిక్షార్హమైన నేరాలో, ఎటువంటి నేరాలకు ఎంత శిక్ష విధిచవచ్చో ఈ చట్టం నిర్దేశించింది. సార్వజీననమైన, సర్వసాధారణమైన నేరాలకు భారతీయ శిక్షా స్మృతి వర్తిస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక నేరాలకు సంబంధించి ప్రత్యేక శాసనాలు ఎలాగూ అమలులో ఉండనే ఉన్నాయి. మద్యపాన నిషేధ చట్టం, అవినీతి నిరోధక చట్టం, వ్యభిచార నిరోధక చట్టం, ఫ్యాక్టరీల చట్టం, షాపులు, దుకాణాల చట్టం వంటి చట్టాలు చాలా ఉన్నాయి. వివిధ రకాల నేరాలు, వాటికి నిర్వచనాలు, విధించే శిక్షలు భారత శిక్షా స్మృతిలో ఉన్నాయి. ఏ నేరాలు బెయిల్ ఇవ్వదగినవి, ఏ నేరాలకు బెయిల్ ఇవ్వరో, ఏ నేరాల్లో ఇరు పక్షాలు రాజీ చేసుకోవచ్చో, ఏ నేరాలకు ఏ న్యాయస్థానం విచారణ జరిపే అధికారం ఉంటుందో, ఏ నేరాల విషయంలో పోలీసులు అరెస్టు చేయవచ్చో ఇవన్నీ భారతీయ శిక్షాస్మృతిలో ఉండవు. ఆ వివరాలకు నేర విచారణ ప్రక్రియా స్మృతిని పరిశీలించాల్సి ఉంటుంది. నకిలీ నాణాలను తయారు చేయడం ఐపీసీ -231 సెక్షన్ కింద నేరమే. బుద్దిపూర్వకంగా తయారుచేసినా లేదా నకిలీ నాణాల తయారీ ప్రక్రియతో చేతులు కలిపినా సెక్షన్ -232 కింద నేరం. వాటి పరికరాలు విక్రయిస్తే 233వ సెక్షన్, చెలామణి చేస్తే సెక్షన్ 240 వర్తిస్తుంది. నాణాల రూపురేఖలను మారిస్తే సెక్షన్ 244, కాల్పనిక స్టాంపులను అందిస్తే 263ఎ సెక్షన్ వర్తిస్తుంది. తప్పుడు త్రాసు వినియోగిస్తే సెక్షన్ 264 కింద ఫిర్యాదుచేయవచ్చు. ఇతరులను మోసం చేయాలనే సంకల్పంతో బుద్ధిపూర్వకంగా త్రాసును ఉపయోగిస్తే ఏడాది పాటు జైలు శిక్ష విధించవచ్చు.
రోజూ మనం మార్కెట్‌కు పోయినపుడు కూరగాయలు కొన్నపుడో లేదా మాంసం కొనుగోలు చేస్తున్నపుడో వ్యాపారులు రాళ్లనే వినియోగించడం, తప్పుడు త్రాసులను వాడటం చూస్తునే ఉంటాం. కాని అది మనకు సంబంధించింది కాదులే అనుకుంటుంటాం. ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రానపుడు అంతా సక్రమంగానే ఉందని తూనికలు-కొలతల శాఖ అధికారులు భావిస్తుంటారు. ఒక్కరైనా ఫిర్యాదు చేస్తే, కేసు నమోదు చేస్తే మిగిలిన వారిలోభయం అనేది ఉంటుంది. ఇతరులను మోసం చేయాలనే సంకల్పంతో వస్తువుల బరువును, పొడవు, వ్యాపకత, భారకతను గుర్తించేందుకు తప్పుడు కొలతలు ఉపయోగించినా సెక్షన్ -265 వర్తిస్తుంది. తప్పుడు కొలతలు తూయకపోయినా అలాంటి త్రాసు కలిగి ఉన్నా అది సెక్షన్ 266 కింద నేరంగానే పరిగణించాల్సి ఉంటుంది.
ప్రజలు అందరూ వినియోగించుకునే మరో కీలక హక్కు సెక్షన్ -268 , మనం నివసించే ప్రాంతంలో రాత్రంతా పాటలు, భజనలు, మ్యూజిక్‌తోనో విసిగిస్తుంటే ఈ సెక్షన్‌ను వినియోగించవచ్చు. ఈ హక్కును వినియోగించుకునే క్రమంలో భయపెట్టినా, అసౌకర్యం కలిగించినా దానిని కూడా నేరంగానే పరిగణిస్తారు. కొన్ని సార్లు ప్రజలకు అసౌకర్యం కలిగించే చర్యలో కొంత ప్రయోజనం ఉన్నా దానిని కూడా అసౌకర్యంగానే పరిగణించే వీలుంది. వాస్తవానికి ఈ సెక్షన్ చాలా విశిష్టమైనదే కాదు, ప్రజాసంక్షేమానికి, భద్రతకు,ఆరోగ్యానికి, సౌఖ్యానికీ ఈ సెక్షన్ రక్షణ కవచం లాంటిది. ధాన్యం మిల్లు, పిండిమర రాత్రి కూడా ఆడుతున్నట్టయితే అది కూడా ప్రజలకు అసౌకర్యం కిందకే వస్తుంది. క్లబ్‌లు,బార్‌లు అర్ధరాత్రి వరకూ తెరచి ఉంచడం, మురుగునీటిని రోడ్డుపై వదలడం, రోడ్లపై గోతులు తవ్వడం, ఇండ్ల సముదాయంలో పేలుడు పదార్థాలను నిల్వ చేయడం, శబ్ద కాలుష్యం,్ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యాన్ని కూడా ఈ సెక్షన్ కింద ప్రశ్నించవచ్చు. వంద కోట్ల మంది భారతీయుల్లో ఇవన్నీ సర్వసాధారణం అనుకున్నవారే ఎక్కువ. తమ హక్కును వినియోగించుకునే వారెందరు? అంటువ్యాధులు ఉన్న వారు ఇతరులకు అవి సోకేలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే సెక్షన్ 269 కింద కేసు నమోదుచేయవచ్చు. ఆహారపానీయాలను విషతుల్యం చేస్తే సెక్షన్ -272 కింద, విక్రయిస్తే సెక్షన్ -273 కింద ,మందులను కల్తీ చేస్తే సెక్షన్ 274 కింద కేసులు పెట్టొచ్చు. కల్తీ మందులను విక్రయించడం, ఒక మందుకు బదులు మరో మందును అమ్మడం, చెరువుల్లో నీటిని పాడు చేయడం, వాతావరణ కాలుష్యం, నిర్లక్ష్యంగా వాహనం నడపటం, పడవలపై ఎక్కువ మందిని ఎక్కించుకోవడం, భవనాల కూల్చివేతలో నిర్లక్ష్యం, అశ్లీల సాహిత్యం విక్రయించడం ఇవన్నీ భారతీయ శిక్షా స్మృతి కింద నేరాలే. అశ్లీల పాటలు పాడినా, అలాంటి సాహిత్యాన్ని పిల్లలకు ఇచ్చినా, లాటరీలు నిర్వహించినా నేరంగానే పరిగణిస్తారు.
ఆహార కల్తీకి సంబంధించి రాష్ట్రాల్లో ప్రత్యేక శాసనాలున్నాయి. ఆహార పదార్థాలను కల్తీ చేసినా, వ్యాపారపరంగా లాభం పొందేందుకు అక్రమ వ్యాపారం చేసినా కొన్ని సందర్భాల్లో అది ఆరోగ్యానికి హానికరం కాకపోవచ్చు. నెయ్యిలో వెన్న కలపడం, పాలలో నీళ్లు కలపడం వల్ల ఆరోగ్యానికి హానికరం కాకపోవచ్చు. వేరే పదార్థాలను కలిపితే అవి విషతుల్యం కావచ్చు. అలాంటి సందర్భాల్లో మాత్రమే ఆహార కల్తీచట్టం కింద కేసులు నమోదు చేయగలుగుతారు. ఆహార పానీయాలుగా వినియోగించడానికి పనికి రానివి, తెలిసికూడా వినియోగిస్తున్న సందర్భంలో సెక్షన్ 273 వర్తిస్తుంది. సెక్షన్ 272 కంటే 273 చాలా విస్తృతమైనది. విషతుల్య ఆహారం అమ్మినా, లాభాల కోసం విక్రయించినా శిక్ష తప్పదు. 274 సెక్షన్ కింద మందులను కల్తీ చేయడం నేరంగా పరిగణిస్తారు. ఒక మందు ప్రభావం లేదా సామర్ధ్యాన్ని తగ్గించే విధంగాలేక అది పనిచేసే విధానంలో మార్పు వచ్చేలా,ముడిసరకులను మార్చడం ద్వారా కొత్త మందును మార్కెట్‌లోకి తెస్తే అది కల్తీ కిందకే వస్తుంది. నాసిరకం మందులను తయారుచేయడం ఈ సెక్షన్ కింద శిక్షార్హం కాదు, అయితే ఒక మందును నిర్ధిష్టమైన ప్రమాణాల్లో ఉంటుందని చెప్పి, ఆ ప్రమాణాలు లేకుండానే తయారుచేయడం శిక్షార్హమవుతుంది. ప్రతి మందులో ఏయే పదార్థాలు ఏయే మోతాదులో కలుపుతారో ఆ మందు లేబుల్ మీద ముద్రించి ఉండటం మనం గమనిస్తుంటాం. ఆ మోతాదును తగ్గిస్తే దాని సామర్ధ్యం తగ్గిపోతుంది. కల్తీ మందులను విక్రయిస్తే అటువంటి వారిపై సెక్షన్ 275 కింద కేసులు నమోదు చేయవచ్చు.
ఇవన్నీ చిన్న విషయాలుగానే అనిపించవచ్చు. కోట్లాది మంది ప్రజలు ఉన్నా రోడ్డుపై గుంతలు గురించి ఫిర్యాదుచేసే వ్యక్తి ఒక్కరూ కనిపించరు. కనీసం ఆ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు కూడా తీసుకోవడం లేదు. అలా ప్రశ్నించడం నేరమేమో? అనే భయాందోళనలకు గురవుతున్నారే తప్ప తమ హక్కులపై అవగాహన పెంచుకోవడం లేదు. సాధారణ విషయాలపై ఏ తరగతిలోనూ పాఠ్యాంశాలు లేకపోవడంతో నేటి తరం కూడా న్యాయశాస్త్రంపై పట్టు సాధించలేకపోతోంది. న్యాయం గురించి తెలిస్తే లిటిగేషన్ పెరుగుతుంది. ఇపుడున్న లిటిగేషన్‌ల పరిష్కారానికే 350 సంవత్సరాలు పట్టేలా ఉంది. ఇంకా శాస్త్రంపై పట్టు పెరిగితే జనం బాధ ప్రభుత్వ బాధగా మారక తప్పుతుందా?

-బీవీ ప్రసాద్ 98499 98090