మెయన్ ఫీచర్

‘ఫలితాల’ తర్వాత అనూహ్య పరిణామాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో రెండు దశలలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతున్న తరుణంలో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలు వెలువడిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై పడింది. రాజకీయ పార్టీల నేతలు ఎవరికి వారుగా అంచనాలు వేసుకొంటూ ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. మొన్నటి వరకు 2014లో కన్నా ఎక్కువగా సీట్లు గెలుస్తామని, ఎన్డీయేకు మూడింట రెండు వంతుల ఆధిక్యత లభిస్తుందని ధీమాతో ఉన్న భాజపా నేతలలో ఇప్పుడు- తమకు కొత్తగా మద్దతు ఎవరు ఇస్తారా? అనే ఆలోచనలు ప్రారంభం అయ్యాయి. ఇక, ప్రధాన మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ప్రతిపక్ష శిబిరంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎవరి ఎత్తుగడలతో వారు మునిగి ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా సుమారు 300 సీట్లు గెలుస్తామనే సంకేతం ఇస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు భాజపా ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఒక ఇంటర్వ్యూలో తమకు పూర్తి ఆధిక్యత రాకపోవచ్చని సందేహం వ్యక్తం చేయడం భాజపా శిబిరంలో గందరగోళానికి దారితీసింది.
అంతేకాదు, స్వాతంత్య్రం వచ్చిద తర్వాత తొలిసారిగా తాను ప్రభుత్వ అనుకూలతతో మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లు ప్రధాని మోదీ ఒక వంక ప్రకటనలు చేస్తుండగా, ఉత్తరాదిన భాజపా ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని రామ్ మాధవ్ చెప్పడం కూడా ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ఎన్నికల రణరంగం కీలక దశలో ఉన్న సమయంలో అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖ నేత ఈ విధంగా మాట్లాడటాన్ని ఆ పార్టీ నేతలు సమర్ధించుకోలేక పోతున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో 120 సీట్లతో జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడని చెబుతూనే, పొరపాటున చంద్రబాబు నాయుడు గెలిచిన గెలవవచ్చని మరో భాజపా ప్రధాన కార్యదర్శి మురళీధరరావు చెప్పడం కూడా భాజపా వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నది.
సొంతంగా కేంద్రంలో తిరిగి అధికారంలోకి రాలేమన్న అనుమానాలు భాజపా వర్గాలను ఆవహించినట్టు స్పష్టం అవుతున్నది. వాస్తవానికి ఎన్నికల ముందు నుండే ఈ అనుమానాలు భాజపా నాయకత్వంలో నెలకొన్నాయి. అందుకనే జగన్ మోహన్ రెడ్డి, కె.చంద్రశేఖ్రరావు వంటి వార్లతో ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుపై హామీ పొందిన్నట్లు కథనాలు వచ్చాయి. పైగా చంద్రబాబు నాయుడిని ఓడించే పరిస్థితులలో రాష్ట్రంలోని భాజపా నాయకత్వం లేదని గ్రహించి జగన్‌కు అన్ని విధాలా సహకారం అందించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌పై కూడా పలు విమర్శలు చెలరేగాయి.
మరోవంక ఫోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల సందర్శనను అవకాశంగా తీసుకొని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ప్రధాని మోదీ ఓ అవగాహనకు వచ్చిన్నట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వంలో బిజూ జనతాదళ్ చేరేందుకు మోదీ ఒప్పించినట్లు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సహితం సానుకూల సంకేతాలు పంపే ప్రయత్నం అక్షయ కుమార్ కుమార్ జరిపించి, రాజకీయేతర ఇంటర్వ్యూ ద్వారా ప్రయత్నం చేశారు. అయితే, ఆమె ఎదురు తిరగడంతో అది ఫలించలేదు. దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు హంగ్ లోక్‌సభ ఏర్పడాలని కోరుకొంటున్నాయ. అప్పుడు తాము కేంద్రంలో చక్రం తిప్పవచ్చని కేసీఆర్, చంద్రబాబు, మమత, మాయావతి, అఖిలేశ్ వంటి వారు ఎదురు చూస్తున్నారు. నిన్నటి వరకు భాజపాకు ఎన్నికల అనంతరం మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకైనా మంచిదని కాంగ్రెస్‌కు స్నేహ సంకేతాలు పంపుతున్నారు. అందుకోసం హెచ్ డి కుమారస్వామి, ఏంకె స్టాలిన్‌లతో రాయబారం పంపుతున్నారు.
రాబోయే ఎన్నికల ఫలితాలు కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాలలో రాజకీయ అస్థిరతకు దారితీసే అవకాశం లేకపోలేదు. భాజపా తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రాజస్థాన్, మధ్య ప్రదేశ్, కర్ణాటకలలో ఉన్న ప్రభుత్వాలు కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలు అస్థిరతను ఎదుర్కొనే అవకాశం ఉంది. 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్యెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని ప్రధాన మంత్రి చెప్పిన మాటలు ఈ విషయాన్ని వెల్లడి చేస్తున్నాయి. కేంద్రంలో భాజపాయేతర ప్రభుత్వం ఏర్పడితే మరి కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారే అవకాశం లేకపోలేదు. ఈశాన్య రాష్ట్రాలలో పలు భాజపా ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం చేయవచ్చు. తమిళనాడులో ముందస్తు ఎన్నికలు తప్పవు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేక పోయినా కాంగ్రెస్ మద్దతు లేకుండా భాజపాయేతర ప్రభుత్వం ఏర్పడలేదు. అటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడలకు వంతపాట పాడక తప్పదు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిర పరచే ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం లేకపోలేదు. ఝార్ఖండ్ వంటి రాష్ట్రాలలో సహితం రాజకీయ అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది. అందుకనే ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలలో పెను మార్పులకు దారితీయక తప్పదు. తమకు పూర్తి ఆధిక్యత రాకపోవచ్చని భాజపా నేతలలో వ్యక్తం అవుతున్న అనుమానాలే ప్రతిపక్ష శిబిరాలలో ఉత్సాహం కలిగిస్తున్నది. కీలకమైన చివరి మూడు దశలలో ఒక విధంగా ఈ అంశం భాజపాకు ప్రతికూలంగా మారే సూచనలు సహితం కనిపిస్తున్నాయి.
తిరిగి అధికారంలోకి రావడానికి ప్రధాని మోదీ అన్ని అస్త్రాలను ఉపయోగిస్తున్నారు. రాహుల్ గాంధీనే కాకుండా జవహర్ లాల్ నెహ్రూ ప్రస్తావన కూడా తీసుకువచ్చి కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఒకే మాటను పదే పదే ప్రస్తావించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందగలమని భావిస్తున్నా పలుఅంశాలలో వాస్తవాలను వక్రీకరిస్తున్నట్లు ప్రతి విమర్శలు ఎదుర్కోవలసి వస్తున్నది. పలువురు భాజపా నేతలు సహితం ఎన్నికల ప్రచారం ఈ విధంగా దిగజారడాన్ని తమాయించుకోలేక పోతున్నారు.
స్పష్టమైన ఆధిక్యత లభించని పక్షంలో ప్రభుత్వం ఏర్పాటుకు నరేంద్ర మోదీ విముఖత చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్, భాజపాలు లేకుండా కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఎక్కువకాలం మనుగడ సాగించలేదని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. అటువంటప్పుడు మరో ఒకటి, రెండేళ్లలో తిరిగి ఎన్నికలు అనివార్యం కాగలవు. మద్దతు ఇచ్చే పక్షాల నుండి రాజకీయ వత్తిడులకు లొంగడం కన్నా ప్రతిపక్షంలో ఉండడానికే మోదీ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. నవీన్ పట్నాయక్, కేసీఆర్, జగన్ మద్దతు ఇచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్డీయే 230 సీట్లు కనీసం గెల్చుకోవాలి. లేని పక్షంలో కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు సహితం చాలా తక్కువగా ఉంటాయి. మమత, మాయావతి, అఖిలేశ్ ఒక అవగాహనకు వస్తే వారు ముగ్గురు కలసి బైట నుండి మద్దతు ఇవ్వమని కాంగ్రెస్ పై వత్తిడి తీసుకు వచ్చే అవకాశం ఉంది. అధికారం కోసం కాంగ్రెస్ మరికొంతకాలం ఎదురు చూడటం తప్ప మరో గత్యంతరం ఉండదు. అయితే బయట నుండి మద్దతు ఇవ్వడానికి, ప్రధానిగా ఎవ్వరు ఉండాలో తామే నిర్ణయించాలని కాంగ్రెస్ పట్టుబట్టే అవకాశం ఉంది. అటువంటప్పుడు మమత, మాయావతి వంటి బలమైన నేతలను కాంగ్రెస్ ఒప్పుకొనే అవకాశం లేదు. నవీన్ పట్నాయక్ వంటి నేతలను తెరపైకి తెచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటె పట్నాయక్ ను ప్రధానిగా చేస్తే ఒడిశాలో బిజెడి మద్దతు దారులను కాంగ్రెస్ తనవైపు తిప్పుకొనే అవకాశం ఉంటుంది. ఆ రాష్ట్రంలో పోయిన బలాన్ని సమీకరించుకొనే అవకాశం ఏర్పడుతుంది.
అయితే భాజపా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలాన్ని సమీకరించుకోలేక పోయినా అతి పెద్ద పార్టీగా ఏర్పడటం తథ్యం. అటువంటప్పుడు రాష్టప్రతి తప్పని సరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని ముందుగా భాజపాకు ఇవ్వవలసి ఉంటుంది. ఒకసారి రాష్టప్రతి ఆ అవకాశం ఇస్తే అటు, ఇటు ఉన్న పలు పార్టీలు భాజపాకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే నరేంద్ర మోదీ వంటి బలమైన నాయకుడిని వారు సహించలేక పోవచ్చు. భాజపా సహితం మరోనేతను ప్రధానిగా ప్రతిపాదించే అవకాశం ఉండదు.
ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోయినా గతంలో వాజపేయా వలే మరో రెండేళ్లలో తిరిగి తమకే అవకాశం వస్తుందనే ధీమా భాజపాలో కలుగుతుంది. అందుకనే అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. భాజపా కాకుండా మరెవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు? అనే అంశం కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెల్చుకొంటుందన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ వందకు మించి సీట్లను గెల్చుకోలేని పక్షంలో నూతన ప్రభుత్వం ఏర్పాటులో ఆ పార్టీ పాత్ర పరిమితంగా ఉంటుంది. కానీ 150 వరకు సీట్లు గెల్చుకొంటే ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర వహించగలదు. రాష్టప్రతి ముందుగా బిజెపిని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడం కోసం ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తాయ. ఓట్ల లెక్కింపునకు రెండు రోజుల ముందే- ఈ నెల 21న సమావేశమై ముందుగానే ఒక కూటమిగా ఏర్పడి, రాష్టప్రతిని కలిసే ఆలోచనలు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం కనబడటం లేదు. దేశంలో అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ ముందున్న రాజకీయ లక్ష్యం కేవలం భాజపాను అధికారానికి దూరం చేయడమే కాదు. మాయావతి తిరిగి బలం పుంజుకోవడం సహితం ఆ పార్టీ భవిష్యత్ కు గొడ్డలి పెట్టు కాగలదు. అందుల్లనే ప్రతిపక్ష శిబిరంలో వైరుధ్యాలు రాజకీయ పరిస్థితులను మరింత గందరగోళ పరచే అవకాశం ఉంది.

-చలసాని నరేంద్ర 98495 69050