మెయన్ ఫీచర్

మహిళలకు మన్నన ఇదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రి వర్జీనియా వుల్ఫ్ తాను రచించిన ఒక సుదీర్ఘ వ్యాసంలో ఇలా అంటుంది...
‘‘్భవనా ప్రపంచంలో స్ర్తి అత్యంత ఉన్నతురాలు. కవిత్వం విషయంలో తొలినుంచి తుది వరకూ ఆమె కనబడుతుంది. కానీ, వాస్తవానికి వచ్చేసరికి మాత్రం తాను పెళ్లాడిన ఏ సామాన్య మగాడికైనా ఆమె బానిస. అతని ఆస్తిలో ఆమె ఒక భాగం-’’
- గత శతాబ్ది, తొలి దశాబ్దులలో వర్జీనియా వుల్ఫ్ ఈ మాటలను అన్నప్పటికీ, - ప్రేమ పేరుతో స్ర్తిలపై యాసిడ్ దాడులు, అత్యాచారాలు, పరువు హత్యలు, గృహహింస, సాధారణమైపోతున్న ఈ రోజులతో పోల్చిచూస్తే ఆమె పలుకుల ‘స్థాయి’ని దాటి, మనం- ముఖ్యంగా భారతదేశంలో స్ర్తిలను హింసించే విషయంలో చాలా ‘పురోగతి’ని సాధించామనిపిస్తుంది!-
చెత్త సినిమాలను, చెత్త ఆన్‌లైన్ ఛానెల్స్‌ను చూస్తున్న యువకులు- కంటికి ఇంపుగా కనిపించే అమ్మాయిలను ప్రేమిస్తున్నామంటూ వెంటబడి, వారి నుంచి తమకు సరైన ప్రతిస్పందన కనబడనప్పుడు వారి ముఖంపై యాసిడ్ పోసి వారిని కురూపులను చెయ్యడమూ- అంధులను చెయ్యడమూ.. ఇవాళ సర్వసామాన్యమైపోయింది. పేరుకు ఎన్ని కఠిన చట్టాలున్నా అభం శుభం తెలియని అమ్మాయిలను అవి ఏ విధంగానూ రక్షించలేకపోతున్నాయి. ఆడపిల్లల కుటుంబాలకు చెందినవారు పోలీస్ స్టేషన్‌లలో- ఆ అరాచకాల గురించి ముందుగానే ఫిర్యాదు చేసినా, దాడి జరిగిన తర్వాత విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇక, బాధితుల పునరావాసం గురించి పట్టించుకునే వారెవరు?
ఒక అధ్యయనం ప్రకారం కేవలం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూలై 23, ఆగస్ట్ 18 మధ్యకేవలం 25 రోజుల వ్యవధిలో అమ్మాయలపై అయిదు యాసిడ్ దాడులు, రెండు మరణాలు సంభవించాయి.
యాసిడ్ దాడుల బారినపడి సజీవంగా వున్నవారి గురించి పనిచేసే- ‘యాసిడ్ సర్వయివర్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ (ఏ.యస్.ఎఫ్.ఐ) అనే ‘ప్రభుత్వేతర సంస్థ’ (నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్- ఎన్.జి.ఓ) వారి అంచనాల ప్రకారం 2010- 2014 సంవత్సరాల మధ్యకాలంలో మన దేశ రాజధాని దిల్లీలో 90 మంది, ఉత్తరప్రదేశ్‌లో 71, పశ్చిమ బెంగాల్‌లో 65 మంది మహిళలు యాసిడ్ దాడులకు గురి అయ్యారు. మన దేశంలో అత్యధికంగా యాసిడ్ దాడులు జరిగేది దిల్లీ లోనే. మిగతా రాష్ట్రాలన్నీ ఈ విషయంలో వెనుకబడి లేవు అనే విషయం విస్మరించకూడదు. ఒక్క ఈశాన్య రాష్ట్రాలలోనే- మొత్తం భారతదేశంలో యాసిడ్ దాడులకు గురైన మహిళల్లో 21శాతం మంది వున్నారు. గత ఏడాదిన్నర కాలంలో యాసిడ్ దాడుల సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరిగినట్టు వివిధ నివేదికలు పేర్కొంటున్నాయి. ఇవాళ ప్రపంచం మొత్తంమీద అత్యధిక సంఖ్యలో యాసిడ్ దాడులు భారతదేశంలోనే జరుగుతున్నాయి. అదీ మన ఘనత!
ఒకప్పుడు ఇట్లాంటి స్థానం బంగ్లాదేశ్‌కు ఉండేది. కానీ, కఠిన చర్యలతో ఆ దేశం ఇలాంటి దాడుల సంఖ్యను బాగా తగ్గించగలిగింది. యాసిడ్ దాడులకు పాల్పడిన వ్యక్తికి మరణ దండనకు కూడా ఆ దేశ చట్టంలో అవకాశం వుంది. కానీ, మనం న్యాయ విచారణకు సుదీర్ఘకాలం తీసుకుని, పలు సందర్భాలలో చట్టంలోవున్న లొసుగుల కారణంగా నిందితులకు శిక్షకూడా పడకుండా చేసి, ఆ తరువాత వారిని నిర్దోషులుగా వదిలివేస్తున్నాం. ప్రత్యక్ష సాక్షులున్న సందర్భాలలో కూడా 40.2 శాతానికి మించి నిందితులకు శిక్ష పడటం లేదు.
మన దేశంలో- 2013లో క్రిమినల్ చట్టానికి సవరణలు చేసి - యాసిడ్ దాడుల్లో నిందితుడికి పదేళ్లదాకా జైలుశిక్ష విధించే వీలుకల్పించారు. కానీ, అది అమలు జరగడం తక్కువ మాత్రమే.
ఇదిలావుండగా- నిందితులకు యాసిడ్ ఎలా దొరుకుతున్నదనే విషయం కూడా గమనించదగ్గదే! యాసిడ్‌ను వినియోగదారులకు విక్రయదారు అమ్మాలంటే చాలా నిబంధలున్నాయి. విక్రయదారు తాను యాసిడ్‌ను ఎవరికి, ఎందు నిమిత్తం, ఎంత మొత్తంలో విక్రయం చేసిందీ ఒక రిజిస్టరులో విధిగా రాయాలి. కొనుక్కునేవాడు తనకు సంబంధించిన వివరాలన్నీ ఆధారాలతో సహా విక్రయదారుకు చూపాలి. తాను యాసిడ్‌ను ఎందుకోసం కొంటున్నదీ తప్పనిసరిగా చెప్పాలి. కానీ, ఈ నిబంధనలన్నీ తుంగలోకితొక్కి విక్రయించి నిందితులకు అవకాశం ఇస్తున్నారు. వస్త్రాలకు రంగులు వేసే ఫ్యాక్టరీలలోను, నగలు తయారుచేసేచోట ఘాటైన యాసిడ్‌లను అనునిత్యం వాడుతూంటారు. అందుచేత వారు వీటిని మార్కెట్‌లో కొంటూ వుంటారు. అక్కడినుండి కూడా దొంగచాటుగా నిందితులకు యాసిడ్ చేరే అవకాశముంటుంది.
ఈ విషయాల గురించి చర్చ ఎలావున్నా, నిందితుల చర్యలను ఒక సామాజిక రుగ్మతగా భావించి- దీనిని రూపుమాపేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. యువకులలో లైంగిక విశృంఖలత పెరగడానికిగల కారణాలను మూలాల నుండి అనే్వషించి, దాని నివారణకు తగు చర్యలు తీసుకోవలసి వుంది.
ఇలాంటి మానసిక వికృతుల కారణంగా- కొందరు యాసిడ్ దాడులకు దిగుతూ వుంటే- మరికొందరు మరో ముందడుగువేసి, అమాయకులైన అబలలపై లైంగిక అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
మహిళలపై జరిగే ‘హింస’ అంటే - కేవలం లైంగిక అత్యాచారాలే అనుకోనక్కరలేదు. మహిళలను కిడ్నాప్ చెయ్యడం - ఆమె గౌరవానికి (మోడెస్టీ) భంగం కలిగించే చర్యలకు, దాడులకు పాల్పడడం- ఆమె మర్యాదకు భంగం కలిగించే రీతిలో దూషణలకు, అసభ్య పదజాలాలతో నిందించడానికి పూనుకోవడం- గృహంలో భర్త, అతని బంధువులు మాటలతోగాని, చేతలతో గాని హింసించడం- బలవంతంగా వ్యభిచారం చేయించడం కోసం మగువలను ఎగుమతి చెయ్యడం, లేదా దిగుమతి చెయ్యడం ఇలాంటివన్నీ వస్తాయి.
పరువుపోతుందనే భయంతోనో, ఇతర కారణాలతోనో చాలామంది మహిళలు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురారు. పోలీసులను ఆశ్రయించిన సందర్భాలలోవారు చర్యలు తీసుకున్న సందర్భాలు, నిందితులకు శిక్షపడిన దాఖలాలు కూడా మన దేశంలో తక్కువే.
ఉదాహరణకు 2013వ సంవత్సరంలో మహిళలపై నేరాలు జరిగినట్టుగా- 3,09,566 ఫిర్యాదులు అధికారికంగా నమోదైనాయి. అందులో - 22.4 శాతం మందికి మాత్రమే శిక్షలుపడ్డాయి. భర్త, అత్తవారు, తమను హింసిస్తున్నారంటూ (అదే సంవత్సరంలో) 1,18,866 మంది ఫిర్యాదులు చేస్తే 16శాతం మందికి శిక్షలుపడ్డాయి. మానభంగాల పరిస్థితి ఇందుకు భిన్నమైంది అనిపిస్తుంది. నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ బ్యూరో వారి నివేదిక ప్రకారం 1971వ సంవత్సరంలో మహిళలపై అత్యాచారం జరిగినట్టుగా నమోదైన కేసులు 2,467 మాత్రమే. (దేశం మొత్తంమీద) - కాని, 2013 సంవత్సరం వచ్చేసరికి- ఆ సంఖ్య 33,707కు చేరుకొంది. అంటే- 1255.3 శాతం పెరుగుదల కనిపిస్తోంది! ఇలాంటి గణాంకాలు మన ‘ప్రగతిని’ సూచించవని తెలుసుకోవాలి. మహిళలను రక్షించడానికి ‘నిర్భయ చట్టం’ వంటి చట్టాలు మనకున్నాయి. కానీ, మహిళలకు నిర్భయత్వమే లభించడం లేదు. మానవత్వం వున్న మహనీయులందరూ ఈ విషయమై తీవ్రంగా ఆలోచించాల్సిన స మయం ఆసన్నమైంది. ఇందుకు మరో కందుకూరి వీరేశలింగం అవతరించాలా?

-కోడూరి శ్రీరామమూర్తి 93469 68969