మెయన్ ఫీచర్

మార్పులకు సంకేతం.. ‘మినీ సార్వత్రికం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో కులం ‘అప్రకటిత రాజ్యాంగం’ అన్నాడొక విశే్లషకుడు. అందుకే రాజ్యాంగం కన్నా మన దేశంలో కులమే సమాజాన్ని నియంత్రిస్తోంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ‘కులాల కురుక్షేత్రం’ కనిపిస్తోంది. అత్యంత కీలకం కావడంతో ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలను ‘మినీ సార్వత్రికం’గా అభివర్ణిస్తున్నారు. ప్రధాని మోదీ పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో పోలింగ్‌కు అధికార యంత్రాంగం ఓ వైపు సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు తమ బలాబలాలను తేల్చుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ ఎన్నికలు జరగడానికి ముందు పార్లమెంటులో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడం మరో విశేషం. గతంలో కంటే భిన్నంగా నెలరోజుల ముందుగా బడ్జెట్‌ను రూపొందించడం, ఈసారి రైల్వే బడ్జెట్ వార్షిక బడ్జెట్‌లో విలీనం కావడం కొత్త పరిణామం. అయిదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి అనుమతించరాదని విపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ త్రోసిపుచ్చింది. ఈ విషయాలను పక్కన పెడితే, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు దాదాపు అన్ని పార్టీలూ కుల సమీకరణలనే నమ్ముకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు ప్రాంతాల్లో ముస్లిములు, యాదవులు, జాట్లు, బ్రాహ్మణులు కీలక పాత్ర పోషిస్తున్నారు. దళితుల అభ్యున్నతి కోరే బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి గతంలో బ్రాహ్మణులకు సైతం టిక్కెట్లు ఇచ్చి వారి అభిమానాన్ని చూరగొన్నారు. యుపిలో సత్తాచాటుకునేందుకు సమాజ్‌వాదీ, కాంగ్రెస్, బిఎస్‌పి, బిజెపి శ్రేణులు శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయి.
యు.పి. ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టకు కీలకం. ఒక విధంగా ఆయన రెండున్నరేళ్ల పాలనపై రిఫరెండం అంటే తప్పులేదు. సమాజ్‌వాదీ ‘పెద్దాయన’ ములాయంసింగ్ యాదవ్ కుటుంబ కలహాల వల్ల ఆ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సమాజ్‌వాదీ పార్టీలో ఆధిపత్యం అంతా ములాయం కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో వృద్ధనేత ములాయం ఇంటికే పరిమితం కావల్సిన పరిస్థితి ఏర్పడింది. యుపిలో ‘నేతాజీ’గా ప్రసిద్ధుడైన ములాయం భారత ప్రధాని కావాలని 1992 నాటి నుంచి కలలు కంటూనే ఉన్నారు. 2017 నాటికి అది అసంభవం అని తేలిపోయింది. కుటుంబ కలహాలతో సమాజ్‌వాదీ పార్టీ పరువు బజారున పడడంతో ప్రస్తుత పరిస్థితులు తమకు బాగా కలసి వస్తాయని బిజెపి భావిస్తోంది.
దేశంలోనే అతి పెద్ద రాష్టమ్రైన యుపిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ చివరికి సమాజ్‌వాదీ పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, సిఎం అఖిలేష్ కలసి పాల్గొంటున్నారు. ఈ పొత్తు అఖిలేష్‌ను గట్టెక్కిస్తుందా? కాంగ్రెస్ ఉనికిని కాపాడుతుందా? అన్నది తేలాల్సి ఉంది. కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకని దుస్థితి ఉండగా, కొన్ని సీట్ల విషయంలో ఎస్‌పి, కాంగ్రెస్‌ల మధ్య రాజీ కుదరడం లేదు. ఎన్నికల ప్రకటనకు ముందు తమ సిఎం అభ్యర్థి షీలా దీక్షిత్ అని గొప్పగా ప్రకటించిన కాంగ్రెస్ నేతలు వంద సీట్ల కోసం అఖిలేష్ పంచన చేరడంతో ఆ పార్టీకి సొంత బలం ఏపాటిదో ఇప్పటికే అర్థమైపోయింది. కాంగ్రెస్‌కు రాహుల్ నాయకత్వం ఏ మేరకు మేలు చేస్తుందో యుపి ఎన్నికల తర్వాత స్పష్టమవుతుంది.
ఇక, గోవాలో మహారాష్టవ్రాదీ గోమంతక్ పార్టీ బలం పుంజుకుంటున్నది. ఇది కేంద్ర రక్షణ మంత్రి, గోవా మాజీ సిఎం మనోహర్ పారేకర్‌కు ఇబ్బంది కలిగించే అంశం. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ‘్భంగ్రా డాన్స్’ మొదలుపెట్టింది. ఇక్కడ బిజెపి-అకాలీ కూటమి ఇబ్బందులలో పడబోతున్నదని ఎన్నికల సర్వేలు చెపుతున్నాయి. ఐతే, ఈ ముందస్తు సర్వేలపై విశ్వసనీయత ఎంత? గత ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె పార్టీ మెజారిటీ సీట్లు గెలుస్తుందని సర్వేలు చెప్పాయి. తీరా అన్నా డిఎంకె అధినేత్రి జయలలిత పూర్తి మెజారిటీ సాధించారు. కోటి మంది జనాభాలో యాభైవేల మందిని సర్వే చేస్తారు. అది ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుందా? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ గెలుస్తుందని సర్వేల్లో తేల్చారు. కానీ, అందుకు భిన్నంగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాడు. ఇదేరీతిలో పంజాబ్‌లో సర్వేలకు అతీతంగా ‘్ఫలితాలు’ ఉంటాయా? అన్నది చెప్పలేం. ఇక, ఈశాన్య రాష్టమ్రైన మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికలు దేశభద్రత దృష్ట్యా చాలా కీలకమైనవి. అక్కడ చైనా దుర్మార్గాలు చాపకింద నీరులా సాగుతున్నాయి.
పెద్దనోట్ల రద్దు తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గానీ, అభ్యర్థులు గానీ గతంలో వలే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉండదు. అయితే, ఎన్నికల మేనిఫెస్టోల్లో ‘ఉచిత పథకాల’కు, తాయిలాలకు లోటుండదు. వీటన్నింటికీ మించి ‘కులం’ బలం ఎలాగూ ఉండనే ఉంది. యాదవులు తమ కులానికి చెందిన అభ్యర్థులకే వోట్లు వేస్తారు. ముస్లిములు తమ మతస్థులనే ఆదరిస్తారు. కానీ- విచిత్రంగా హిందువులు మాత్రం మూకుమ్మడిగా హిందువులకు ఓట్లు వేయరు. ఇది గత డెబ్బది సంవత్సరాల భారత రాజకీయ చరిత్ర. ‘కులం, మతం, భాష, ప్రాంతం పేరు మీద ఓట్లు అడగ కూడదు’ అని సుప్రీంకోర్టు ఈనెలలోనే ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలు జరిగే దాఖలాలు మాత్రం ఉండవన్నది ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే తెలుస్తుంది. మాయావతి, ములాయం సింగ్ వంటి నేతలకు స్వీయ రాజ్యాంగాలు ఉన్నాయి. బిహార్ నుండి నితీశ్‌కుమార్, హైదరాబాదు నుండి అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలు యుపి ఎన్నికలతో సంబంధం లేకున్నా ప్రచారంలో పాల్గొంటారు. అజం ఖాన్ అనే పాక్ ప్రేరిత ఉగ్రవాది యుపి రాజకీయాల్లో ‘సైకిల్’ చక్రానికి గాలి నింపుతూ సమాజ్‌వాదీ పార్టీ నీడలో ఉన్నాడు. ఎన్నో ఆరోపణలున్నప్పటికీ యుపి సర్కారు గానీ, మోదీ ప్రభుత్వం గానీ అజం ఖాన్‌ను ఏమీ చేయలేకపోయాయి. ఈయన నేతృత్వంలో అలీగఢ్ యూనివర్సిటీ ‘మినీ పాకిస్తాన్’లా మారింది. అజం ఖాన్ వంటి మతోన్మాదుల వల్ల ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీకి ప్రతికూల పరిస్థితులు తప్పవన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
అయిదు రాష్ట్రాల్లో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా- ‘దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు’ అన్న మోదీ ఆలోచన కార్యరూపం దాల్చితే 2019లో లోక్‌సభకు, అన్ని శాసనసభలకూ ఒకేసారి ఎన్నికలు జరగవచ్చు. ఈ సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతం అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు దేశ సుస్థిరత, భద్రతకు సంబంధించి కూడా కీలకమైనవి కావడం గమనార్హం. ప్రధాని మోదీ వ్యక్తిగత ప్రతిష్టకు, కేంద్రం తీసుకోబోయే కీలక నిర్ణయాలకు ఈ ఎన్నికల ఫలితాలు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. మోదీ ప్రస్తుత పాలనా కాలంలోనే పాకిస్తాన్‌తో పూర్తిస్థాయిలో ప్రత్యక్ష యుద్ధం, చైనాతో పరోక్ష యుద్ధం తప్పదు. అందుకని ఈ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలో బిజెపి విజయం సాధించి తీరాలి. లేకుంటే యుపిని అజాం ఖాన్, దావూద్ ఇబ్రహీం వంటివారు కబళించి వేస్తారు. మన సరిహద్దుల్లో పాక్, చైనాలు మరింత వీరంగం సృష్టిస్తాయి. ఈ దుర్గతిని నివారించటం కోసం బిజెపి యుపిలో గెలిచి తీరాలి. అందుకు మోదీ ఏం చేయబోతున్నారు? ఇండియా, రష్యా, అమెరికా, జపాన్‌లు కలిసి చైనా- ఉత్తర కొరియా- పాకిస్తాన్‌లను అదుపులో పెట్టాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న 200 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఏకకాలంలో సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించాలి.
ఈ నెల ఆరంభంలో ‘ఇండియా టుడే’ జరిపిన సర్వే ప్రకారం యుపిలో బిజెపి ప్రథమ స్థానంలోను, సమాజ్‌వాదీ పార్టీ ద్వితీయ స్థానంలోను ఉన్నాయి. మాయావతి పార్టీకి లభించే సీట్లు అంతంత మాత్రమే. కాంగ్రెస్ పార్టీ కేవలం 5 సీట్లు మాత్రమే గెలుచుకోబోతున్నదట. పెద్దనోట్ల రద్దు తర్వాత కూడా బిజెపికి ప్రజల నుంచి భారీగా మద్దతు లభించడం ఆశ్చర్యాన్ని కల్గించే విషయం. ఇదే నిజమైతే భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలవుతాయేమో!
యుపి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికి మూడు, నాలుగు సర్వేలు వచ్చాయి. అన్ని సర్వేల్లోనూ బిజెపి 200 సీట్లకుపైగా గెలుచుకోగలదని తేలింది. అంటే పెద్దనోట్ల రద్దు వల్ల వ్యతిరేక ప్రభావం లేదని అర్థం. ఇక, పంజాబ్‌లో అధికారంలో ఉన్న సుఖవీర్ బాదల్ ఓడిపోతాడని సర్వేలు సూచిస్తున్నాయి. ‘డ్రగ్స్ మాఫియా’ను నియంత్రించక పోవడం పంజాబ్ సర్కారుకి మైనస్ పాయింట్‌గా మారింది. ఇక్కడ ఆప్ ప్రభావం ఉండదంటున్నారు. ఒక సర్వే ప్రకారం పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రథమస్థానంలో, ఆప్ ద్వితీయ స్థానంలో, బిజెపి తృతీయ స్థానంలో ఉంటాయట! ఇక, ఉత్తరాఖండ్‌కు దేవభూమి అని పేరు. ఇక్కడ సిఎం హరీశ్ రావత్ పాలన పట్ల ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇది బిజెపికి కలిసి వస్తుంది. ఎటుతిరిగి పంజాబ్‌లో బిజెపి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. అక్కడి అకాలీదళ్ పాలనపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.
* * *
తమిళనాడులో జల్లికట్టు క్రీడ విషయంలో కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌మెయిల్‌కు గురైంది. తమిళుల సంతృప్తి కోసం జల్లికట్టుపై నిషేధం రద్దు చేస్తూ ఆర్డినెన్సు ఇవ్వగా, ఇప్పుడు కర్ణాటకలో కంబాల క్రీడకు అనుమతి కోరుతున్నారు. ఏపిలోని విశాఖ బీచ్‌లో జల్లికట్టు స్ఫూర్తితో ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ ఉద్యమం తలపెట్టగా అది భగ్నమైంది. ఈ తరహా ఆందోళనలకు ముగింపు ఎప్పుడు? కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక రాజకీయ లబ్ది కోసం ఆశించకుండా రాజ్యాంగాన్ని రక్షించవలసి ఉంది. జల్లికట్టు ఉద్యమం వెనుక కాంగ్రెస్, డిఎంకె విద్యార్థి విభాగాల వారు ఉన్నట్లు తేలింది. విశాఖ బీచ్‌లో ఉద్యమం వెనుక ప్రతిపక్ష నాయకుల పాత్ర కన్పడుతున్నది.

- ముదిగొండ శివప్రసాద్