మెయన్ ఫీచర్

‘సర్వభక్షక పాత్ర’లో వామపక్ష సర్కారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో ఇటీవల ‘అమరవీరుల స్మారక పరిశోధనా సంస్థ’ పక్షాన జరిగిన సదస్సులో కొందరు వక్తలు- కేరళలో జరుగుతున్న హత్యారాజకీయాలను ప్రముఖంగా ప్రస్తావించి ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ డిజిపి దినేష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేరళలో సిపిఎం జరుపుతున్న దమనకాండను వివరించారు. కేరళ నుంచి ‘హత్యారాజకీయాల’ బాధితులు కొందరు ఈ సదస్సుకు హాజరై అక్కడి రక్తపాత చరిత్రను కళ్లకు కట్టినట్టు తెలిపారు. కేరళలో 1959 నుండి సిపిఎం హత్యారాజకీయాలను మొదలు పెట్టిందని, 1967 నాటికి అవి తీవ్రస్థాయికి చేరాయని దినేష్ రెడ్డి వివరించారు. మహిళలను కూడా సిపిఎం కార్యకర్తలు కనికరించడం లేదని, పోలీసుల మద్దతుతో అరాచకాలు జరుగుతున్నాయని ఓ మాజీ పోలీసు అధికారి చెప్పడం సదస్సులో అందరినీ విస్మయపరచింది. రిక్రూట్‌మెంటు దశలోనే సిపిఎం కేడర్‌కు చెందినవారిని పోలీసుశాఖలోకి తీసుకోవటం జరిగిందట! బిజెపి నేత డాక్టర్ కె.లక్ష్మణ్ కేరళలోని రాజకీయ హత్యలను గణాంకాలతో వివరించారు.
కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో వామపక్ష పార్టీలు చాలాకాలం పాటు అధికారంలో ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగం కమ్యూనిస్టుల చేతిలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోనే రాజకీయ హత్యలు అధిక సంఖ్యలో ఎందుకు జరుగుతున్నాయని ఆలోచిస్తే- క మ్యూనిస్టుల మూలసూత్రాలను అధ్యయనం చేయాల్సిందే. పెట్టుబడిదారీ వ్యవస్థలో కొందరు వ్యక్తులు సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. అయితే, సామ్యవాద వ్యవస్థలో ఈ ‘సర్వభక్షక పాత్ర’ను ప్రభుత్వమే పోషిస్తుంది. అందుకే కమ్యూనిస్టు పాలిత రాష్ట్రాల్లో ప్రైవేటు పరిశ్రమలను ప్రోత్సహించరు. వ్యక్తికి సొంత ఆస్తి ఉండకూడదనేది వీరి సిద్ధాంతం. ఆచరణలో అది విఫలం కావడంతో, రాజ్యవ్యవస్థ ద్వారా సమాజాన్ని నియంత్రించాలని కమ్యూనిస్టులు ఉద్దేశించారు. రాజ్యాధికార సాధనకు హింసయే ఏకైక మార్గం, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని వారి నమ్మకం. హింస, హత్యారాజకీయాలే వామపక్ష పార్టీలకు పునాదులు. సంపన్నులను ద్వేషించాలని, శ్రామిక రాజ్యాధికార సిద్ధాంతంతో ఎవరినైనా నిర్మూలించాలని వారు బోధిస్తారు. లక్ష్యసాధన కోసం జీహాదీ ఉగ్రవాదులతో చేతులు కలిపితే తప్పేమిటి? అని వామపక్ష నేతలు చెప్పినా మనం విస్మయం చెందనక్కర్లేదు. తమ ప్రయోజనాల కోసం అభిప్రాయాలను, వ్యూహాలను మార్చుకోవడం వారికి అలవాటే. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో బెంగాల్ ఎన్నికల సమయంలో సిపిఎం నేత బుద్ధదేవ భట్టాచార్య వేదిక పంచుకోవడం ఏమిటని ప్రశ్నిస్తే- ‘అది మా ఎత్తుగడలో భాగమ’ని వామపక్ష నేత ప్రకాశ్ కారత్ అంటారు. ఇదీ వారి అవకాశవాద రాజకీయం.
కేరళలో ఒకప్పుడు ఇఎంఎస్ నంబూద్రిపాద్, విఎస్ అచ్యుతానందన్ వంటి మచ్చలేని కమ్యూనిస్టు నాయకులుండేవారు. 1962లో భారత్‌పై చైనా యుద్ధం చేసినప్పుడు గాయపడిన భారత సైనికులకు అచ్యుతానందన్ రక్తదానం చేశారు. దీనిని సిపిఎం పోలిట్‌బ్యూరో తీవ్ర నేరంగా పరిగణించి ఆయనకు పార్టీలో ప్రాధాన్యాన్ని తగ్గించింది. సిపిఐ వర్గాలు సిపిఎంతో విభేదిస్తే ‘రివిజనిస్టులు నశించాలి’ అనే నినాదంతో విజయవాడ వంటిచోట్ల సిపిఐ కార్యకర్తల నివాసాలపై దాడిచేసి దమనకాండ జరపడం తెలిసిందే. 1950వ దశకంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ దహనాలు ఎక్కువగా జరిగాయి. లక్ష్యసాధనే తప్ప, నీతి- అవినీతి అనే కాకమ్మ కబుర్లు తమకు అవసరం లేదని సిపిఎం వారు నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే సిపిఎం, దాని అనుబంధ సంస్థలు రక్తచరిత్రను సృష్టించాయి. ఈ ధోరణి తెలంగాణ, బెంగాల్, కేరళ ప్రాంతాల్లో తీవ్రస్థాయికి చేరింది. సిపిఎం నుంచి వచ్చిన మరొక ఉగ్రవాద వర్గమే సిపిఐ ఎంఎల్. వీరినే నక్సలైట్లు అని పిలుస్తారు. బెంగాల్‌లోని ‘నక్సల్‌బరీ’ ప్రాంతంలో జరిగిన భూపోరాటాల కారణంగా ఈ ఉద్యమానికి ‘నక్సల్‌బరీ’ అనే పేరు వచ్చింది. ఈనాడు నక్సలైట్లలో సామ్యవాదులు ఎవరూ లేరు. కేరళలోని మల్లాపురం అనే ముస్లిం మెజారిటీ ప్రాంతానికి ప్రత్యేక జిల్లా హోదా కల్పించారు. ఇక్కడ జీహాదీ ఉగ్రవాద రిక్రూట్‌మెంట్ స్థావరాలున్నాయి. వారు శ్రీలంక మీదుగా వెళ్లి ‘ఐసిస్’ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటారు. కేరళలో కమ్యూనిస్టులను ఎదుర్కొనే శక్తి ఒక్క ఆర్‌ఎస్‌ఎస్‌కు మాత్రమే ఉన్నందున హిందూ సంస్థలను అణచివేసే కార్యక్రమాన్ని వామపక్ష కార్యకర్తలు స్వీకరించారు. ‘్భరత మాతాకీ జై’’ అని విద్యార్థుల చేత అనిపించినందుకు కన్నూరులో చంద్రశేఖర్ అనే అధ్యాపకుణ్ణి పాఠశాలలోనే 51సార్లు కత్తితో పొడిచి చంపిన సంఘటనను కేరళ ప్రజలు మరచిపోలేరు. ప్రజల్లో భయోత్పాతం సృష్టించే స్థాయికి కమ్యూనిస్టులు ఎదిగారు. 1967లో కోజికోడ్‌లో జరిగిన భారతీయ జనసంఘ్ జాతీయ మహాసభల్లో దీనదయాళ్ ఉపాధ్యాయను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. జనసంఘ్ బలపడటాన్ని సహించలేక దీనదయాళ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని మొగల్‌సరాయ్ రైల్వేస్టేషన్‌లో ‘గుర్తుతెలియని వ్యక్తులు’ హత్యచేశారు. ఈ సంఘటనపై ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరపడానికి నిరాకరించింది. బెంగాల్‌లో వామపక్షాల హత్యా రాజకీయాలను తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ధైర్యంగా ఎదుర్కొన్నది. కేరళలో ‘సామ్యవాదుల’ అరాచకాలను ఎదుర్కొనే బలమైన శక్తి లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఎకె ఆంటోనీ వంటివారు అవినీతి లావాదేవీల్లో మునిగిపోయారే తప్ప వామపక్ష తీవ్రవాదులను నిలువరించలేక పోయారు.
ఆసియాపై ఆధిపత్యాన్ని సంపాదించాలని, భారత్‌ను నిర్వీర్యపరచాలని కుట్ర పన్నిన చైనా నేతలు కేరళ, బెంగాల్, తెలంగాణ, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కమ్యూనిస్టులకు మద్దతునిచ్చింది. ఎకె ఆంటోనీ కేంద్ర రక్షణమంత్రిగా ఉన్నపుడు- కమీషన్‌కు కక్కుర్తిపడి నాసిరకం ఆయుధ సామగ్రిని కొనుగోలు చేయడం చైనాకు ఉపకరించింది. సీమాంతర ఉగ్రవాదానికి, స్వదేశీయ తీవ్రవాదులకు వామపక్షాలు వివిధ సందర్భాల్లో మద్దతునిచ్చాయి. కేరళలో జరుగుతున్న హత్యాకాండ వెనుక చైనా ప్రత్యక్ష హస్తం, అంతర్జాతీయ వ్యూహం ఉందనేది విశే్లషకుల అభిప్రాయం.
కేరళలో ప్రస్తుత ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్‌ను గతంలోనే సిపిఎం అధినాయకత్వం వి.ఎస్.అచ్యుతానందన్‌కు వ్యతిరేకంగా ప్రమోట్ చేసింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్యుతానందన్ పేరు చెప్పుకొని విజయన్ ఓట్లు సంపాదించుకున్నారు. తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని అచ్యుతానందన్ ప్రాధేయపడినా సిపిఎం నేతలు ఏచూరి సీతారాం, ప్రకాష్ కారత్ తిరస్కరించి విజయన్‌కు పదవిని కట్టబెట్టారు. హత్యా రాజకీయాల్లో నిపుణుడైనందునే విజయన్‌కు పగ్గాలు అప్పగించారు. వెంటనే విజయన్ కేరళ సంస్కృతిని నిర్మూలించే పని మొదలుపెట్టాడు. కేరళలో హిందువులు, క్రైస్తవులు సామరస్య ధోరణిలో ఓనం పండుగను జరుపుకుంటారు. శతాబ్దాలుగా వస్తున్న ఈ సంప్రదాయంపై విజయన్ ఆంక్షలు పెట్టాడు. సచివాలయంలోని ఉద్యోగులు పూలముగ్గులు వేసి ఓనం పండుగను జరుపుకోవటంతో ఆగ్రహించిన ఆయన కేరళలో హిందూ సంప్రదాయోత్సవాలను ప్రోత్సహించకూడదని శాసించాడు.
కేంద్రంలో మోదీ పగ్గాలు చేపట్టడాన్ని విజయన్, ఏచూరి సీతారాం, ప్రకాశ్ కారత్ వంటి సిపిఎం భరించలేకపోయారు. దీంతో దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో అల్లర్లు మొదలుపెట్టించారు. దిల్లీ, ముంబయి, కోల్‌కత, హైదరాబాద్ తదితర నగరాల్లోని విశ్వవిద్యాలయాల్లో వామపక్ష భావాలున్న కొందరు ప్రొఫెసర్లే విద్యార్థుల మధ్య విద్వేషాలు రగిలించారు. కొన్ని వర్సిటీల్లో వామపక్ష విద్యార్థి సంఘాల వారు ‘కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగం కాదు’ అని నినదించారు. ఉగ్రవాదులకు విద్యార్థులు మద్దతు ప్రకటించడంతో కొన్ని వర్సిటీల్లో అరాచకత్వం రాజ్యమేలింది. అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ వామపక్ష విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. కేరళలో తమ కార్యకర్తలను కమ్యూనిస్టులు హతమార్చడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 3, 4 తేదీలలో ఆర్‌ఎస్‌ఎస్ ఆందోళనలు చేపట్టింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేరళ ప్రభుత్వంపై చర్య తీసుకోవచ్చు. కానీ, మోదీ సర్కారు అందుకు సిద్ధంగా లేదు. జనం మద్దతుతోనే తన క్యాడర్‌ను పెంచుకోవాలని బిజెపి నాయకత్వం ఆలోచించింది. కాగా, ఇప్పుడు జరగబోయేదేమిటి..? చైనాలో 18 సార్లు ఇండో-చైనా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని బౌద్ధ స్థావరం తమాంగ్‌ను తనకు అప్పగించవలసిందిగా భారత్‌ను చైనా కోరింది. కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కు ఇవ్వాలని, ఆక్సాయ్‌చిన్, తమాంగ్ ప్రాంతాలపై చైనా ఆధిపత్యాన్ని అంగీకరించాలని సిపిఎం కోరుతోంది. కేరళలో జాతీయతా శక్తుల నిర్మూలనను చైనా అంతర్జాతీయ సామ్రాజ్యవాదంలో అంతర్భాగంగా మనం చూడాలి.
మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి నాయకుడు చంద్రావత్ ఇటీవల మాట్లాడుతూ, ‘కేరళ సిఎం విజయన్ తలను నరికి తెచ్చినవారికి కోటి రూపాయలు నజరానాగా ఇస్తా’నని ప్రకటించాడు. చంద్రావత్ అలా అనడం రాజ్యాంగ విరుద్ధమే. ఐతే- ఈ దేశంలో రాజ్యాంగంపై ఎవరికి గౌరవం వుంది? కేరళ ముఖ్యమంత్రికే లేనప్పుడు సామాన్య ప్రజల సంగతి చెప్పేదేముంది? విజయన్ ఇలా బహిరంగంగా హత్యా రాజకీయాలు నడపడాన్ని సిపిఐ, సిపిఎంలు విమర్శించలేదు సరికదా.. ఇతనిని వెనకేసుకొని రావటం ఏమిటి? ప్రస్తుతం బిజెపి వ్యూహం ఏమై ఉంటుంది? మమతా బెనర్జీ ప్రభావంతో బెంగాల్‌లో వామపక్షాలకు గడ్డుకాలం వచ్చింది. కేరళలో విజయన్ దుందుడుకు చర్యలతో ఆ పార్టీ భస్మాసుర హస్తాన్ని కోరి తెచ్చుకుంటున్నది. బెంగాల్ తరహాలో కేరళలోనూ సిపిఎం అదృశ్యం కాగలదని బిజెపి నమ్ముతున్నది. ఇది ఎంతవరకు సాధ్యమో వేచి చూడాలి.
విజయన్ తలకు వెలకట్టడం ఎంత తప్పో, మోదీ తలకు వెలకట్టడం అంతే తప్పు కదా. యుపిలో ఒక జిహాదీ ఉగ్రవాది మోదీని చంపినవారికి కోటి రూపాయలు ఇస్తానన్నపుడు కమ్యూనిస్టులు ఎవరూ నిరసన తెలపలేదు. మోదీని 101 సార్లు కాల్చి చంపాలని సిపిఐ నాయకుడు కె.నారాయణ అనడం తప్పుకాదా? మన దేశంలో రాజ్యాంగం పట్ల నేతల్లోనూ గౌరవం, భయం అనేవి లేవని భావించాలి.

- ముదిగొండ శివప్రసాద్