మెయన్ ఫీచర్

ఉగ్రవాదుల రక్షణలో ఉదారవాదులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలాంటి పొరపాటు, తడబాటు లేకుండా మనం స్పష్టంగా చెప్పుకోదగ్గ విషయం ఏమంటే- ఈ దేశంలో కొన్ని శక్తులు తమ నైపుణ్యాలన్నింటినీ వెచ్చిస్తూ మన సమగ్రతను, సార్వభౌమత్వాన్ని దారుణంగా వి చ్ఛిన్నం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని, దానికి సంబంధించిన సర్వ సంస్థలను పలుచన చేసే క్రమంలో ఎన్నికల ప్రక్రియను ‘చట్టబద్ధం కాని వ్యవహారం’గా ఆ శక్తులు పరిహాసం చేస్తున్నాయి. అందుకే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇవిఎం) సాంకేతికతను వారు సందేహిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ‘పట్టణ అతివాదుల’లో ప్రముఖుడిగా పేరొంది, దేశ రాజధానిలో చట్టపరంగా ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్న ఓ నాయకుడు- నిష్పక్షపాతానికి నిలువెత్తు నిదర్శనమైన ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను ‘్ధృతరాష్ట్రుని’గాను, ప్రధాని మోదీకి అనుచరుడిగాను అభివర్ణించడం చూస్తున్నాం. ఎన్నికల కమిషనర్‌నే కాదు, ఎన్నికల వ్యవస్థనూ పక్కకు నెట్టివేయాలని తద్వారా ప్రజాస్వామ్యాన్ని మబ్బుల చాటుకు త్రోసివేయాలని ఆ ‘ప్రముఖుడు’ ప్రయత్నిస్తున్నాడు.
ఈ దేశంలో ఉదారవాదుల తదుపరి ప్రయత్నం ఏమంటే- జాతి వ్యతిరేక శక్తుల, పాకిస్తాన్ ఏజెంట్ల ఆగడాలను చట్టబద్ధం చేయాలనుకోవడం. పాకిస్తాన్ నుంచి నిధులు పొందుతున్న ఈ అరాచక ‘్భగస్వాముల’తో ప్రభుత్వం చర్చలు జరపాలని కూడా ఉదారవాదులు డిమాండ్ చేస్తున్నారు. కాశ్మీర్ లోయలో అశాంతిని రాజేయడమే ఈ ‘్భగస్వాముల’ ఏకైక ధ్యేయం. ‘స్వయం ప్రకటిత వేర్పాటువాదులు’ తమ ఘనమైన ఎజెండాలో భాగంగా- ఉదారవాదులతోను, ‘టెన్ జన్‌పథ్’ (దిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి నివాసం)కు చెందిన కొంతమందితోను సమావేశాలు జరుపుతుంటారు. ఈ సమావేశాల ద్వారా వీరు సాధించేదేమిటో ప్రపంచానికి చెప్పకపోయినా, జాతి ప్రయోజనాలను మాత్రం వారు ఘోరంగా దెబ్బతీస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించడమే గాక, అక్కడి నిరుద్యోగ యువతను పాకిస్తాన్ తప్పుదారి పట్టిస్తోంది. మన జవాన్ల నుంచి తీవ్రవాదులు సురక్షితంగా తప్పించుకునేలా కా శ్మీర్ యువతను ‘రక్షణ కవచాల్లా’ వాడుకోవడం పాక్ పన్నాగంలో భాగమే. పాకిస్తాన్ విదిలించే డబ్బుకు ఆశపడి కొందరు కాశ్మీర్ యువకులు మన జవాన్లు జరిపే తీవ్రవాద నిరోధక కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారు. పాక్ ప్రేరిత ఉగ్రవాద సంస్థల నుంచి రోజుకూలి తీసుకుంటున్న యువకులు మన జవాన్లపై రాళ్లు విసురుతున్నారు. రాళ్లదాడి నుంచి జవాన్లు తప్పించుకునే సమయంలో ఉగ్రవాదులు చల్లగా జారుకుంటున్నారు.
మనందరికీ బాగా తెలుసు- దిల్లీలోని జెఎన్‌యు, జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, మద్రాస్ ఐఐటి వంటి ఉన్నత విద్యాసంస్థలు ఇపుడు విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడానికి బదులు జాతి వ్యతిరేక శక్తులకు ఆలవాలంగా మారాయి. ఇలాంటి చాలా విద్యాసంస్థల్లో జిహాదీలు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు చొరబడుతున్నారు. వీరికితోడు అరుంధతీ రాయ్‌లు, అరుణా రాయ్‌ల అంశ ఉన్న వారు సైతం వర్సిటీల్లోకి ప్రవేశిస్తూ తమ శక్తిమేరకు- జాతి ప్రయోజనాలను దెబ్బతీసే కలాపాలకు ఆజ్యం పోస్తున్నారు. పాకిస్తాన్ ఏమి కోరుకుంటున్నదో ఈ మేధావులు తమ గళం ద్వారా వినిపిస్తున్నారు. పాకిస్తాన్ కోరేదేమిటో రహస్యమేమీ కాదు.. భారత్‌ను ముక్కలు ముక్కలుగా బద్దలు చేయడమే పాక్ చిరకాల వాంఛ.
కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన వామపక్ష మేధావి, పాక్ ‘అప్రకటిత’ ప్రచారకర్త డాక్టర్ పార్థ చటర్జీ ఓ వెబ్‌సైట్‌లో చేసిన వ్యాఖ్య భారతీయులకు నిజంగా ఆగ్రహం తెప్పిస్తుంది. ‘కాశ్మీర్‌లో జనరల్ డయ్యర్ పాలనను భారత్ వీక్షిస్తోంది..’ అని ఆయన చేసిన వ్యాఖ్య అభ్యంతరకరమే కాదు, ప్రమాదకరమైనది కూడా. జనరల్ డయ్యర్ ఎవరు? పంజాబ్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో 1919వ సంవత్సరంలో వైశాఖి ఉత్సవం జరుగుతు న్న సమయంలో నిరాయుధులైన అమాయక పౌరులపై కాల్పులు జరిపించిన కిరాతకుడు డయ్యర్. ఆ కాల్పుల్లో వెయ్యిమందికి పైగా ప్రా ణాలు కోల్పోయారు. జనరల్ డయ్యర్‌తో భారత ఆర్మీ అధిపతి బిపిన్ రావత్‌ను పోల్చుతున్న డాక్టర్ పార్థ చటర్జీ మానసిక స్థితిని వైద్యులు పరీక్షించాల్సిందే.
స్వాతంత్య్ర సమరం కాలంలో డయ్యర్ ఉన్మాదక్రీడకు బలైపోయిన వారితో- ఇప్పటి పాక్ ఉగ్రవాదులను పోల్చడం మతిలేనితనానికి పరాకాష్ఠ. వేలాదిమందిని కిరాతకంగా చంపిన హంతకుడితో భారత ఆర్మీ చీఫ్‌ను సరిపోల్చడంతో- పార్థ చటర్జీ భారత్‌పై ఎంతటి విద్వేషాన్ని రగిలిస్తున్నాడో అవగతమవుతుంది. చటర్జీ లాంటి ‘ఉదారవాదులు’ ఉండగా భారత్‌కు కొత్తగా శత్రువుల అవసరమే లేదు. తమ దేశపు ప్రయోజనాల కోసం మేధస్సును రంగరిస్తున్నందుకు పార్థ చటర్జీకి పాకిస్తాన్ ప్రభుత్వం అత్యున్నత జాతీయ అవార్డును అందజేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.
రాళ్లదాడి నుంచి జవాన్లను రక్షించేందుకు ఆర్మీ జీప్‌కు ఫారుఖ్ అహ్మద్ దార్ అనే కాశ్మీరీ యువకుడిని కట్టివేసి మేజర్ లీతుల్ గొగోయ్ సంచలనం సృష్టించడం చటర్జీకి ఆగ్రహం కలిగించి ఉండవచ్చు! అహ్మద్ దార్‌ను గొగోయ్ పట్టుకొనకపోతే అతడిని సాయుధులైన ఓ గుంపు హతమార్చి ఉండేది. అయితే, ఇలా ‘మానవ రక్షణ కవచాల’ను ఉపయోగించడం ఆర్మీలో ఆమోదయోగ్యం కాదు. రాళ్లు రువ్వే యువకులను నిరోధించేందుకే లీతుల్ గొగోయ్ ‘మానవ రక్షణ కవచం’తో ముందుకు కదలడం అందరినీ మెప్పించింది. కానీ- కాశ్మీర్ లోయలో భారత సైనికులు ఎదుర్కొంటున్న రాళ్లదాడి వంటి ఘటనలు ప్రపంచంలో ఏ ఆర్మీకి ఎదురుకావనే చెప్పాలి. భారతీయ ఆర్మీ చర్యలు చటర్జీకి సంతృప్తి కలిగించకపోవచ్చు. అందుకే ఆయన తన రాతల్లో విద్వేషాన్ని వెళ్లగక్కాడు. కాశ్మీర్‌లో ఉద్రిక్తతలు తగ్గాలని, శాంతిభద్రతలు వెల్లివిరియాలని భారత ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ కోరుకోవడం పార్థ చటర్జీ వంటి ‘ఉదారవాదుల’కు ఇష్టం లేదు. సరిహద్దుల్లో బీభత్స వాతావరణం నెలకొనాలని, ఫలితంగా భారత్ విచ్ఛిన్నం కావలన్నదే ఉదారవాదుల అంతిమ లక్ష్యం.
మన ఆర్మీ అధిపతి రావత్‌ను విమర్శించేవారికి ఇపుడు మార్క్సిస్టులు శ్రుతి కలిపారు. మోదీ స్వరాన్ని రావత్ వినిపిస్తున్నాడని, అతను తన మానసిక ప్రవృత్తితో దేశానికే ప్రమాదకారిగా మారాడని మార్క్సిస్టు మేధావులు ఆరోపిస్తున్నారు. నిజానికి ఈ దేశం పట్ల మావోయిస్టులు విధేయతను ఎప్పుడు ప్రకటించారు? మిలియన్ల కొద్దీ తన దేశవాసులనే ఊచకోతకు గురిచేసిన ‘మావో’- మన వామపక్ష నేతలకు ఆదర్శప్రాయుడు! ఇలాంటివారి నుంచి మనం ఏం ఆశించగలం?
బ్రిటన్ ప్రధాని థెరీసా మే ఇటీవల స్పష్టమైన సందేశం ఇచ్చారు. లండన్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు మరణించగా అక్కడి పోలీసులు వీరోచితంగా పోరాడి తీవ్రవాదులను వెంటనే మట్టుబెట్టారు. ఉగ్రవాదులను అంతం చేయడం సరైన చర్య కాదని ఉదారవాదులు చెప్పగలరా? ముష్కరులను మట్టుబెట్టడం మానవ హక్కుల ఉల్లంఘన అని వీరు అనగలరా? ‘మానవ హక్కుల అంశాలు ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ప్రతిబంధకంగా ఉంటే బ్రిటిష్ పౌరుల భద్రత కోసం చట్టాలను మార్చడానికైనా సిద్ధమే’ అని థెరీసా మే ప్రకటించారు. ప్రజాస్వామ్య దేశాలన్నింటికీ తల్లి లాంటి బ్రిటన్‌కు చెందిన మే ఇలా ఎందుకు మాట్లాడారో ఉదారవాదులు అర్థం చేసుకోవాలి. ఎవరు ఉదారవాదులో, ఎవరు కాదో ఇక మనమే నిర్ణయించుకోవాలి.
*

ఎస్‌ఆర్‌ రామానుజం, సెల్ : 80083 22206