మెయన్ ఫీచర్

విభజన భూమికపై... విష వృక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మాలోని ‘రోహింగియా’ ప్రజలు మన దేశానికి ఇతర దేశాలకు వలసలెత్తడానికి ప్రాతిపదిక ‘రోహింగియా’లలోని జిహాదీ బీభత్సకారులు! బర్మాను మత ప్రాతిపదికపై విభజించాలని ‘కలలు’ కంటున్న జిహాదీలు క్రీస్తుశకం 1948 నుంచి బర్మాలోని అధిక సంఖ్య బౌద్ధులపై హత్యాకాండ కొనసాగించారు, ఇప్పటికీ కొనసాగిస్తూన్నారు! బర్మాను విభజించాలన్న ‘పగటికల’ అఖండ భారత విభజనతో ముడివడివుంది! 1937 వరకు బర్మా అఖండ భారతదేశంలోని ఒక ‘ప్రాంతం’- ప్రావిన్స్! ఈ ప్రాంతాన్ని బ్రిటన్ సామ్రాజ్యవాదులు అఖండ భారత్ నుంచి విడగొట్టి ప్రత్యేక దేశంగా ఏర్పాటుచేశారు! ఇలా ప్రత్యేక ‘బ్రిటన్ వలస’గా ఏర్పడిన బర్మా 1948లో స్వతంత్ర దేశమైంది! ఈలోగా క్రీస్తుశకం 712వ సంవత్సరం నుంచి మన దేశానికి వ్యతిరేకంగా బీభత్సకాండను జరిపిన ‘జిహాదీ’లు 1947 ఆగస్టు 14న ‘ఘనవిజయం’ సాధించారు... ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉండిన అఖండ భారత భూభాగాలను ‘అఖండ భారత్’ నుంచి విడగొట్టి ‘పాకిస్తాన్’ను ఏర్పాటు చేసుకున్నారు! ‘జిహాదీ’ల ఈ దుశ్చర్యతో అఖండ భారత్‌లోని సాధారణ ముస్లింలకు కాని, అవశేష భారత్‌లోని సాధారణ ముస్లింలకు కాని సంబంధం లేదు! క్రీస్తుశకం 712లో అరేబియా ప్రాంతాల నుంచి మనదేశంలోకి చొరబడిన మహమ్మద్ బిన్ కాసిమ్ ముఠావారు భారత్‌ను బద్దలు కొట్టే కార్యక్రమాన్ని ఆరంభించారు. భారత్‌లో అనాదిగా ఉంటున్న స్వజాతీయ మతాల వారిని హత్య చేయడం, తరిమివేయడం, లైంగిక అత్యాచారాలకు గురిచేయడం, ఇస్లాం మతంలోనికి బలవంతంగా మార్చడం ఈ ‘కార్యక్రమం’లో శతాబ్దులపాటు భాగమన్నది చరిత్ర ధ్రువపరచిన సత్యం! ఈ ‘బద్ధలుకొట్టే’ కార్యక్రమానికి పరాకాష్ట ‘పాకిస్తాన్’! జిహాదీ బీభత్సానికి పరాకాష్ఠ మహమ్మదాలీ జిన్నా.. ఇలా ‘పాకిస్తాన్’ ఏర్పడడం బర్మాలోని ‘అరకాన్’ లేదా ‘రఖాయిన్’ ప్రాంతంలోని ‘ఇస్లాం’ జిహాదీలకు స్ఫూర్తి! ‘బర్మా’ ఆ తరువాత ‘మ్యాన్‌మార్’గా మారినప్పటికీ ‘అరకాన్’లోని జిహాదీ వ్యూహం మారలేదు, లక్ష్యం మారలేదు. భారత్‌ను చీల్చి ‘పాకిస్తాన్’ను ఏర్పాటు చేసినట్టుగానే ‘అరకాన్’ లేదా ‘రఖాయిన్’ ప్రాంతాన్ని బర్మానుంచి చీల్చి ‘ఇస్లాం మతరాజ్యం’గా ఏర్పాటు చేయాలన్నది జిహాదీల లక్ష్యం.. ఎందుకంటే సువిశాల బర్మాలో ‘బౌద్ధులు’ అధికసంఖ్యాకులు, ‘అరకాన్’లో మాత్రం ‘రోహింగియా’ ముస్లింలు అధిక సంఖ్యాకులు! ఈ లక్ష్యసాధనకోసం ‘రోహింగియా’ జిహాదీలు అవలంబిస్తున్న మాధ్యమం బీభత్సకాండను కొనసాగించడం..
ఒక మతానికి చెందిన నేరస్థులలో ఆ మతానికి చెందిన సాధారణ ప్రజలకు సంబంధం లేదు. ఒక దేశంలోని నేరస్థులను ఆయా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు శిక్షించడం ఆ దేశంలోని ప్రజలకు వ్యతిరేకమైన చర్య కాదు. అందువల్ల ‘ఇస్లాం’ మతంలోని పిశాచాలవంటి జిహాదీ బీభత్సకారులను శిక్షించడం ఇస్లాంలోని సాధారణ ప్రజలకు వ్యతిరేకమైన చర్య కాజాలదు! కానీ జిహాదీలను శిక్షించినట్టయితే సాధారణ ముస్లింలకు కోపం వస్తుందని, అందువల్ల వారు తమకు ‘వోట్లు’ వేయరని ఈ దేశంలోని అనేక రాజకీయ పక్షాల నిర్వాహకులు 1947 నుంచి భ్రమిస్తున్నారు! ఈ ‘భ్రమ’ నిజానికి సాధారణ ముస్లింలకు అవమానకరం, వారి దేశభక్తి పట్ల అనుమానం! ఈ ‘భ్రమ’ కారణంగానే ‘బీభత్స’ పాకిస్తాన్‌తో తెగతెంపులు చేసుకొనడానికి సైతం మన ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు భయపడుతూ వచ్చారు. ‘కశ్మీర్’లోయలో జిహాదీలను కఠినంగా అణచివేయకపోవడానికి, ‘జమ్ముకాశ్మీర్’కు ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తిని కట్టబెట్టడానికి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిపడిన అక్రమ ప్రవేశకులను వెళ్లగొట్టకపోవడానికి, ‘రోహింగియా’లను ఇన్నాళ్లుగా తిప్పి పంపకపోవడానికి ఈ ‘భ్రమ’ కారణం! ఈ ‘భ్రమ’కు గురికాని ప్రస్తుత ప్రభుత్వం ‘రోహింగియా’ అక్రమ ప్రవేశకులను దేశంనుంచి బయటికి తరలించి బర్మాకు పంపడానికి సిద్ధమైంది. ‘భ్రమ’ తొలగని విపక్షాలు యధావిధిగా ‘రోహింగియా’లను ఇక్కడనే ఉండనివ్వాలని ‘గోల’ చేయడం అందువల్ల ఆశ్చర్యం కాదు.
మన దేశంలోకి వచ్చి పడి జీవిస్తున్న ‘రోహింగియా’లను మన దేశానికి వ్యతిరేకంగా తీర్చిదిద్దే కుట్రను పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స విభాగమైన ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్’ యధావిధిగా కొనసాగిస్తోంది! ఈ ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్’- ఐఎస్‌ఐ- వివిధ దేశాలలోని ‘జిహాదీ’ ముఠాలను అనుసంధానం చేసి మన దేశంలోకి ఉసిగొల్పుతోంది! ఇప్పుడు అప్ఘానీ ‘అల్‌ఖాయిదా’ ముఠా కూడా మన దేశంలో బీభత్స వ్యూహాన్ని అమలుజరుపుతోంది! మన దేశంలోని ‘రోహింగియా’లను జిహాదీలుగా మార్చి మన దేశ ప్రజలపైకి, బర్మాలోకి ఉసిగొల్పడానికి అల్‌ఖాయిదా యత్నిస్తోందన్నది ధ్రువపడిన వాస్తవం! అందువల్ల మన దేశాన్ని ‘బద్ధలు కొట్టడానికి’ అమలుజరుగుతున్న విస్తృత జిహాదీ వ్యూహంలో ‘రోహింగియా’లు భాగం! దేశమంతటా నలభయి వేలకుపైగా ‘రోహింగియా’లు విస్తరించి ఉన్నారట! హైదరాబాద్‌లో నివసిస్తున్న నాలుగు వేలమంది ‘రోహింగియా’లలో రెండు వేల ఐదు వందలమందికి ‘శరణార్థి’ హోదాను కల్పించే గుర్తింపు పత్రాలు కూడా జారీ అయ్యాయట! భారత జాతి అనాదిగా శరణార్థులకు నీడనిచ్చిన జాతి, అన్నం పెట్టిన జాతి! ఈ జాతీయ పరంపరకు అనుగుణంగానే ‘రోమన్ల’ బీభత్సకాండకు బలైన యూదులకు రెండు వేల ఏళ్లకుపైగా మన దేశంలో ఆశ్రయం లభించింది, పౌరసత్వం లభించింది, రాజ్యాంగపు హక్కులు లభించాయి, అధికార పదవులు లభిస్తున్నాయి. పదమూడు వందల ఏళ్లకు పూర్వం అరబ్బీ జిహాదీలు మొత్తం పారశీక దేశాన్ని ధ్వంసం చేశారు, పారశీక దేశం నేడు ఇరాన్... ఇరాన్‌లో నేడు అనాదిగా ఉండిన పారశీకులు లేరు, హతమారిపోయారు, అవశేష పారశీకులకు ఆశ్రయం లభించింది మన దేశంలో మాత్రమే. క్రీస్తుశకం 1893 సెప్టెంబర్ పదకొండవ తేదీన అమెరికాలోని చికాగోలో, సర్వమత సభలో ప్రసంగించిన వివేకానందస్వామి ఈ కొనసాగుతున్న చరిత్ర గురించి ప్రపంచ దేశాలవారికి గుర్తుచేశాడు. ఈ హైందవ జాతీయ పరంపరకు అనుగుణంగానే కోటిమంది బంగ్లాదేశీయ శరణార్థులను మన దేశం 1970వ 1971వ సంవత్సరాలలో నెలల తరబడి పోషించింది! ఆ తరువాత వారు స్వదేశానికి తిరిగి వెళ్లారు. రోహింగియాలు కూడా ఇదే పద్ధతిలో ఇపుడు బర్మాకు వెళ్లడానికి ఏమిటి అభ్యంతరం...?? ‘రోహింగియా’లు తిరిగి వచ్చినట్టయితే వారికి సకల రక్షణలను కల్పించగలమని బర్మా ప్రభుత్వాధినేత ఆంగ్‌సాన్ సూచీ మంగళవారం హామీ ఇచ్చింది. అందువల్ల ‘దురుద్దేశం’ లేని రోహింగియాలు స్వదేశానికి తిరిగి వెళ్లితీరాలి!
‘రోహింగియా’లను మన దేశంనుండి తరలించడాన్ని వ్యతిరేకించడం విస్తృత జిహాదీ వ్యూహంలో భాగం! తరలింపును వ్యతిరేకిస్తున్నవారు సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కానీ ‘రోహింగియా’ల తరలింపు వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం తమకున్నదో లేదో మొదట నిర్థారణ కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా వ్యాఖ్యానించడం హర్షణీయ పరిణామం! ‘రోహింగియా’లు తమపై దాడులు జరుగుతున్నాయన్న సాకుతో ‘రఖాయిన్’నుంచి పెద్ద సంఖ్యలో మన దేశంలోకి చొరబడడం ‘ఐఎస్‌ఐ’ కుట్రలో భాగం! బౌద్ధుల దాడులను దశాబ్దుల క్రితం ఆరంభించింది ‘రోహింగియా’ జిహాదీలు! ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యాకులుగా ఉన్న ప్రతి ప్రాంతంలోను అల్పసంఖ్యాకులను నిర్మూలించడానికి ‘జిహాదీ’లు బీభత్సకాండ జరపడం అంతర్జాతీయ వాస్తవం! మన కశ్మీర్ లోయలో ఇదే జరిగింది. బర్మాలో ‘అరకాన్’- ‘రఖాయిన్’లో ఇదే జరిగింది. కాశ్మీర్‌లో నిర్మూలనకు గురి అయిన తరువాత అవశేష హిందువులు పారిపోయారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు వచ్చేశారు! కానీ ‘రఖాయిన్’లో అల్పసంఖ్యాకులైన బౌద్ధులు ‘జిహాదీ’ల బీభత్సకాండను ప్రతిఘటించారు. ఇదీ తేడా! కాశ్మీర్‌లోని అల్పసంఖ్యాకులకు దశాబ్దుల తరబడి మన ప్రభుత్వాలు రక్షణ కల్పించలేదు, ‘అరకాన్’లోని అల్పసంఖ్యాకులకు బర్మా ప్రభుత్వాలు రక్షణ కల్పించాయి! ఇదీ తేడా.. అందువల్ల పెద్ద ఎత్తున ప్రతిఘటన మొదలైంది, బర్మా విభజనకు వ్యతిరేకంగా ప్రాదేశిక సమగ్రతా పరిరక్షణకు అనుకూలంగా ‘జిహాదీ’లకు ప్రతిఘటన ఎదురైంది! ఈ ‘ప్రతిఘటన’ను రోహింగియా తెగకు చెందిన సామాన్య ప్రజలపై దాడులుగా చిత్రీకరించడం వక్రీకరణకు పరాకాష్ఠ! కశ్మీర్‌లోయలో జిహాదీల కుట్ర ‘విజయం సాధించింది..’. కశ్మీర్ లోయలో హిందువులు మిగలలేదు! ‘రఖాయిన్’ లో ‘జిహాదీ’ల కుట్ర విఫలమైంది. బౌద్ధులు మిగిలి ఉన్నారు! అందువల్ల ‘పాలస్తీనా’ ముస్లింలవలె ‘రోహింగియా’లు కూడా తమ స్వయంకృతాపరాధంవల్ల కడగండ్లపాలయ్యారు! బౌద్ధులతో కలిసి ఈ ‘రోహింగియా’లు తమ దేశ వ్యతిరేకులైన ‘జిహాదీ’లను బహిరంగంగా నిరసించకపోవడం ఈ స్వయంకృత అపరాధం! బర్మా విభజనను సాధారణ రోహింగియా ప్రజలు సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా?? ఐక్యరాజ్యసమితివారు అడగాలి..
హిమాలయ పర్వతశ్రేణి బలూచిస్తాన్‌లో పడమటి సముద్రంలోకి చొచ్చుకొనిపోయి ఉంది, అప్ఘానిస్తాన్ టిబెట్‌లమీదుగా తూర్పుగా విస్తరించి బర్మా దక్షిణ తీరంలో తూర్పు సముద్రంలోకి తొచ్చుకొని పోయి ఉంది! ఇలా అఖండ భారతదేశానికి ఉత్తర దిశలో నెలకొని ఉన్న హిమాలయ శ్రేణి సహజమైన సరిహద్దు! క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్ది నాటి మహాకవి కాళిదాసు ఈ భౌగోళిక వాస్తవాన్ని ఇలా వివరించి ఉన్నాడు. ‘‘ఉత్తరదిశలో దివ్యస్వభావుడైన హిమాలయ పర్వతరాజు ఉన్నాడు, పడమటి సముద్రంలోకి తూర్పు సముద్రంలోకి చేతులను ముంచి భూమిని కొలిచే ‘మానదండం’వలె నిలిచి ఉన్నాడు...’’ ‘‘అస్తి ఉత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధి రాజః, పూర్వాపరౌతోయ నిధీవగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండః’’. ఈ సహజమైన సరిహద్దును విదేశీయ దురాక్రమణదారులు శతాబ్దుల తరబడి చెఱపివేశారు, బర్మాను ‘అఖండభారతం’నుంచి బ్రిటన్ దుండగులు విడగొట్టడం పరాకాష్ఠ! క్రీస్తుశకం 1601వ సంవత్సరం నుంచి మన దేశంలో చొరబడిన బ్రిటన్ దురాక్రమణదారులు మొత్తం దేశాన్ని ఎప్పటికీ స్వాధీనం చేసుకోలేకపోవడం చరిత్ర! అఖండ భారత్‌లోని నేపాల్ భూటాన్‌లు 1947 వరకూ బ్రిటన్‌గ్రస్తం కాలేదు. బర్మా, అస్సాం వంటి ఈశాన్య ప్రాంతాలు 1885 వరకూ బ్రిటన్ దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడడం చరిత్ర! అంతకుపూర్వం పోర్చుగీసు మూకలను, డచ్చి దుర్జనులను కూడా బర్మా ప్రతిఘటించింది! ఇలా 1885 వరకు స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకున్న అఖండ భారత ప్రాంతం బర్మా.. బ్రిటన్ ప్రభుత్వం 1937లో విడగొట్టి ఉండకపోతే ‘బర్మా’ మన దేశపు అంతర్భాగంగా కొనసాగి ఉండేది. అలా కొనసాగి ఉంటే భద్రతా చరిత్ర మరో విధంగా ఉండేది..

హెబ్బార్ నాగేశ్వరరావు