మెయన్ ఫీచర్

జీవన స్వచ్ఛతకు జవసత్త్వాలు?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానసిక స్వచ్ఛత, బౌద్ధిక స్వచ్ఛత కనిపించవు. కనిపించని శాస్ర్తియ సత్యాలను అంగీకరించకపోవటం, వాటిని మూఢ విశ్వాసాలుగా చిత్రీకరించడం మన దేశంలోని ‘ప్రత్యక్ష ప్రమాణ’వాదులను ఆవహించి ఉన్న విదేశీయ భావదాస్యం. ఈ భావదాస్యం ఈ దేశాన్ని దురాక్రమించిన విదేశీయ బీభత్సకారులు మనపై పెత్తనం చెలాయించిన నాటిది! ఇంటిలో తిష్ఠవేసిన దొంగలు ‘ఇంటితనాన్ని’ మూఢ విశ్వాసం అని నిర్థారించారు. తమ ‘మూఢ విశ్వాసం’ మాత్రమే తర్కబద్ధమైన శాస్త్రం అని శతాబ్దుల పాటు తీర్పు చెప్పారు. అందువల్లనే యుగాలుగా కొనసాగుతున్న భారత జాతీయ తత్త్వం లేదా భారతీయుల ‘ఇంటితనం’ బ్రిటన్ దొంగలకు మూఢ విశ్వాసమైంది! దొంగలు నిష్క్రమించిన తరువాత కూడా దొంగలు చెప్పినదాన్ని ‘ఇంటి’లోని అధికాధికులు ‘శాస్త్రం’గా ‘తర్కం’గా ‘గతితార్కి భౌతికవాదం’గా పరమ ప్రమాణంగా విశ్వసించడం విశ్వసిస్తుండడం మానసిక స్వచ్ఛతను ఆవహించి ఉన్న మాలిన్యం! మానసిక స్వచ్ఛత మళ్లీ వికసించనిదే స్వచ్ఛ్భారత పునర్ నిర్మాణం ఎలా జరుగుతుందన్నది సామాన్యుల సందేహం.. ‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’- ‘‘మానవుల దాస్యానికి మానవుల విముక్తికి మనస్సు మాత్రమే కారణం’’- అన్నది నిజమైన శాస్ర్తియ విజ్ఞానం.. కానేకాదని అంటున్న వారి ఆర్భాటమే ఇప్పటికీ హడలెత్తిస్తూ ఉంది. ‘‘్ఢమ ఢమ చప్పుడురా, ఢమాల్ ఢమాల్‌మని చప్పుడురా.. ఢమాల్ ఢమాల్ మను చప్పుడు వింటే, ప్రజల గుండెలకు గుభేలురా..!’’ అన్నది ఆర్భాటపు ధ్వని కాలుష్య స్వభావం! భాగ్యనగరంలోని బత్తిన సోదరులు మృగశిర కార్తెలో ప్రసాదిస్తున్న ‘చేపమందు’లోని శాస్ర్తియతను విశ్వసించని వారుండడం ఒక ఉదాహరణ మాత్రమే! మందుతోపాటు ‘మృగశిరకార్తె’ కూడా వీరి దృష్టిలో అశాస్ర్తియం! అంతరిక్షంలో భూమికి అనేక కోట్ల మైళ్ల దూరంలో బిక్కుబిక్కుమంటున్న ‘మృగశీర్ష’ నక్షత్రం కనిపించదు.. అందువల్ల! కానీ పడమటి శాస్తవ్రేత్తలకు నాలుగేళ్ల క్రితం ‘దైవకణం’ - గాడ్ పార్టికల్- కనిపించింది!
ఇలా ‘దివ్యకణం’- డివైన్ పార్టికల్- ‘ఉనికి’ని కనుగొన్న ‘్భతిక రసాయన’ ఐరోపా శాస్తవ్రేత్తలకు ‘నోబెల్’ బహుమతిని కూడా ఇచ్చేయి! ‘దివ్యకణం’ ‘దైవకణాలు’ ఉన్నాయని చెప్పే సాహసానికి భారతీయ శాస్తవ్రేత్తలు ఆధునిక కాలంలో ఒడిగట్టలేదు. ఎందుకంటే భారతీయులు అనాదిగా దర్శించిన విజ్ఞానమంతా మూఢ విశ్వాసంగా ప్రచారం చేసిన పాశ్చాత్యుల భావకాలుష్యం ఇప్పటికీ మన మానసిక స్వచ్ఛతను మలినపరుస్తోంది! ‘‘విస్తరించి ఉన్నవాడు విష్ణువు..’’ విశ్వమంత కణం కణంలో అణువులో పరమాణువులో నిండిన దివ్యతత్త్వం విష్ణువు! అందుకే ‘‘నా విష్ణుః పరమః..’’- విష్ణువును మించినది లేదు! విస్తరించడం, తుది మొదలు లేని విస్తరణ విష్ణువు! ఇది ఆద్యంతరహితమైన చైతన్యం విశ్వస్థితి! ఈ స్థితిని భారతీయులు అనాదిగా గుర్తించడం పాశ్చాత్యులకు గొప్పకాలేదు. నోబెల్ బహుమతులు పుట్టకముందు కోట్లు ఏళ్లుగా భారతీయుడు ‘‘ఇందుకలడందు లేడన్న’’ విష్ణుకణాన్ని, విశ్వకణాన్ని, దివ్యకణాన్ని దర్శించాడు! కానీ పాశ్చాత్యులు ‘గ్రహించడం’ మాత్రమే గొప్ప.. అందుకే వారికి బహుమతులు! ‘‘దివ్యకణాన్ని ఐరోపా వారు కనిపెట్టారట..’’ అన్న ఆశ్చర్యాన్ని అభినయిస్తున్న మనవారి మానసిక స్థితి భావదాస్యానికి చిహ్నం! అందువల్లనే ‘‘వెయ్యి మంది నరేంద్ర మోదీలు లక్షమంది మహాత్మాగాంధీలు కలసినా స్వచ్ఛ్భారత నిర్మాణం సాధ్యంకాదు. నూట ఇరవై ఐదు కోట్లమంది భారతీయుల భాగస్వామ్యం వల్లనే ‘స్వచ్ఛత’ సాధ్యం అవుతుంది..’’ అన్నది మహాత్ముని జయంతినాడు ప్రధానమంత్రి చేసిన నిర్థారణ! ‘‘శివోభూత్వా శివం యజేత్..’’- ‘‘శివుడుగా మారి శివుడిని పూజించడం’’- అని అంటే ఇదే మరి! ఇదీ స్వచ్ఛతతో ‘మనస్సుల’ అద్వితీయ స్థితి, ‘స్వచ్ఛ్భారతం’తో భారతీయుల అద్వైత స్థితి, ప్రకృతితో ప్రాణుల స్వభావ ఏకత్వం ఇది.. సృష్టికర్తతో సృష్టికి కల ఏకత్వం!
మహాత్మాగాంధీ ‘మాల్‌గుడి’కి వచ్చినప్పటి సంగతి.. ‘శ్రీరామ్’ అనే యువకుడు మహాత్మాగాంధీ అనుయాయి అయిన ‘్భరతి’ అనే యువతిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇందుకు మహాత్ముని అనుమతి అనివార్యమని ‘్భరతి’ నిర్దేశించింది! అందువల్ల మహాత్ముని కలుసుకొనడం కోసం ‘శ్రీరామ్’ తెల్లవారు జామున మూడు గంటలకు గాంధీ బస చేసిన ‘కుటీరం’ వద్దకు వెళ్లి వేచి ఉండవలసి వచ్చింది! అప్పటికే గాంధీ నిద్రలేచి, ‘రాట్నం’తో ‘నూలు’ వడుకుతున్నాడు! ‘నూలు’ పోగులు ‘పత్తి’ బట్టల స్వచ్ఛతకు ప్రతీక అన్నది గాంధీమాట! దశాబ్దుల తరువాత పత్తిని నూలును విషరసాయనాల ‘ప్లాస్టిక్’ దిగమింగుతోంది. స్వచ్ఛ్భారత్ ఎలా మళ్లీ అవతరిస్తుంది?? జన్యువుల మార్పిడి - జెనటిక్ మోడిఫికేషన్- జిఎమ్- పేరిట పుట్టుకొచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ‘పత్తి’గింజలలో ‘బాసిలస్ తురింజెన్సిస్’ -బిటి- అన్న విష రసాయనాన్ని నింపుతోంది. ‘ఈ ‘బిటి’ పత్తి భూమిని, పరిసరాలను, ప్రకృతిని మానవ ఆరోగ్యాన్ని కలుషితం చేస్తోంది. ‘ఆవాల’కు సైతం ‘బిటి’ పోపును పెట్టడానికి విదేశీయ వాణిజ్య సామ్రాజ్యవాదులు, వారి తొత్తులు రంగాన్ని సిద్ధం చేస్తున్నారు! మహాత్మాగాంధీతోపాటు, మహాత్మాగాంధీకి పూర్వం కూడా అనాదిగా ఈ దేశ ప్రజలు తెల్లవారు జామున నిద్రలేచారు. మేలుకున్నారు! ఇపుడు అధిక శాతం భారతీయులు ‘బారెడు’, ‘రెండు బార్ల’ పొద్దెక్కేవరకూ నిద్రపోతూనే ఉన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు నిద్రలేచి పండ్లు తోమకుండానే ఫలహారాలు మెక్కేస్తున్నారు! పరపరా నమిలేస్తున్నారు.. అక్కడ, అపుడు ‘మాల్‌గుడి’లో, కుటీరంలో నూలు వడకిన గాంధీ నాలుగు గంటలు కాగానే ‘నడవడానికి’ బయలుదేరాడు.. ‘్భరతి’ శ్రీరామ్’ తదితర గాంధీ బృందం వారు కూడా ఆ తెల్లవారు జామున నడిచారు. గాంధీ చాలా వడివడిగా నడిచాడు. యువకుడైన ‘శ్రీరామ్’ రొప్పుతూ పరిగెత్తవలసి వచ్చిందట! ‘‘మహాత్ముని అనుమతి కోసం’’- వెయిటింగ్ ఫర్ ది మహాత్మా- అన్న తమ చారిత్రక ఆంగ్ల ‘నవల’లో రాసీపురం కృష్ణస్వామి నారాయణ్ ఈ సంగతి వివరించాడు. ఈ సంగతినే ‘శ్రీరామ్’ గాంధీతో చెప్పాడు. ‘‘మీరు చాలా వేగంగా నడుస్తున్నారు...’’ తమ చెప్పులు తెగి ఉండడంవల్ల పాతబడినందువల్ల గాంధీని అందుకోలేకపోతున్నామని మరికొందరు ‘ఆశ్రమవాసులు’ చెప్పుకొచ్చారు! ‘‘కొత్త చెప్పులు కొనుక్కోవచ్చునుగా..’’ అన్నది శ్రీరామ్ సందేహం! ‘‘ఆవు సహజంగా మరణించాలి, అపుడు ఆవు చర్మాన్ని ఉపయోగించి చెప్పులను కుట్టించుకోవాలి!’’ అని మహాత్ముడు సమాధానం చెప్పాడు. ‘శ్రీరామ్’ వెంటనే గాంధీ కాళ్లవైపు చూశాడు కుతూహలంగా.. ‘‘అవును వార్థా ఆశ్రమంలోను సబర్మతీ ఆశ్రమంలోనూ అలాంటి వ్యవస్థ ఉంది’’ అని మహాత్ముడు ముక్తాయించాడు! ఆవులు, గోసంతతి సహజంగా మరణించేవరకు వేచి ఉండడం స్వచ్ఛ భారత జాతీయ స్వభావం! మహాత్మాగాంధీ ఆచరించాడు, ప్రచారం చేశాడు! ఇపుడు ఆవులను హత్యచేసి ‘‘గోమాంస భోజన ఉత్సవాల’’- బీఫ్ ఫెస్టివల్స్‌ను జరుపుతున్నవారు ‘స్వచ్ఛత’ను పరిమార్చుతున్నారు, ఈ దేశపు వౌలిక తత్త్వాన్ని హతమార్చ యత్నిస్తున్నారు. గోసంతతి వ్యవసాయ భూమికి బలం, ప్రాకృతిక స్వచ్ఛతను పరిరక్షించే సనాతన మాథ్యమం..
మన పూర్వులు ఆవిష్కరించిన శాస్త్ర విజ్ఞానాన్ని నమ్మనివారు సైతం ఇపుడు ‘దివ్య’ కథలను, విశ్వస్థిత చైతన్య ప్రేరిత అద్భుతాలను నమ్మవలసివస్తోంది, ఐరోపావారు ‘దివ్యకణాన్ని’ కనిపెట్టి ‘నోబెల్’ పురస్కారాలు పొందారు కదా.. అందుకని.. కైలాసంలో బుజ్జిగణపతికీ, కుమారస్వామికీ ఒకేసారి ఆకలయింది, అందువల్ల అన్నదమ్ములిద్దరూ అర్భక స్వరాలతో గట్టిగా ఏడ్చారు. వాళ్లను సముదాయించడం వాళ్లమ్మకు చాలా కష్టమైపోయింది, పాలు కావాలని పిల్లలిద్దరూ పట్టుపట్టారు! అందువల్ల పరమేశ్వరి పాత్రను పట్టుకొని పాలకోసం బయలుదేరింది. మన ఇంటిలో ‘నిండుకున్న’ పదార్థాలను పక్కింటిలోనో ఎదురింటిలోనో తెచ్చుకొనడం అసహజం కాదు మరి.. అందువల్ల పరమశివుని అర్థాంగి కూడా పాలు ‘బదులు’ తెచ్చుకొనడం కోసం పాత్రను తీసుకొని వైకుంఠానికి వెళ్లిందట.. నాయనమ్మలు చెప్పిన కథ. ‘దివ్యకణం’ ఉందని ‘నోబెల్’ గ్రహీతలు చెప్పిన మాట నమ్మినవారు ఈ దివ్య వాస్తవాన్ని కూడా నమ్మాలి... పర్వతరాజ పుత్రికను చూడగానే ‘క్షీరసాగర కన్య’ పులకించింది, సాదరంగా వదినగారికి స్వాగతం చెప్పింది. ‘‘ఒక పంచ పాత్రడు పాలు కావాలి. పిల్లలు పాలకోసం పరితపిస్తున్నారు!’’ అని పార్వతీదేవి తన సోదరుని భార్య అయిన మహాలక్ష్మికి నివేదించింది! ‘‘పంచ పాత్రడు కాకపోతే ఒక బిందెడు పాలు పట్టుకెళ్లండి. మా పుట్టింటినుంచి నిత్యం అనేక గంగాళాలతో పాలు వస్తున్నాయి. పాలకేం భాగ్యం..’’ అని రమాదేవి ప్రకటించింది. కానీ ఉమాదేవికి ఉక్రోషం వచ్చింది. ‘‘ఈ ‘ఇందిర’ తన పుట్టింటి గొప్పతనం గురించి ‘డప్పు’ వాయిస్తోంది. మా పుట్టిల్లు మంచుగడ్డల మయమని యద్దేవా చేస్తోంది..’’ అని భావించిన గిరిజాదేవి పాలు పుచ్చుకొనకుండానే రుసరుసలాడుతూ కైలాసానికి తిరిగి వెళ్లిపోయింది. అక్కడ నారదుడు పిల్లలిద్దరినీ ఆడిస్తూ ఆశీనుడై ఉన్నాడు. గణపతి, కుమారస్వామి ఆకలి సంగతి మరచి ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. యథావిధిగా ధ్యాన నిమగ్నుడై ఉండిన పరమశివుడు అర్థాంగి ఆగ్రహాన్ని పట్టించుకోలేదు.. గంగాదేవి పట్టించుకొంది! వైకుంఠనాథుని ఇల్లాలి ‘అతిశయం’ గురించి విని ఆమె ఆగ్రహించింది. ‘‘ఆ భార్గవి ఇంటిలో పాలు ప్రవహించుగాక, గానీ వైకుంఠంలో నీటిచుక్క ఉండదు’’ అని మందాకినీదేవి నిర్దేశించింది! పిల్లలను తల్లికప్పగించిన నారదుడు తిరిగి వెడుతూ ఈ వార్తను వైకుంఠంలో వినిపించాడు.. ‘శివుని జటాజూటవాసిని’ చేసిన ప్రతిజ్ఞను- నారదుని ద్వారా విన్న ‘కమలాలయ’ కలత చెందలేదు. నీరు లేకపోతేనేమి? పాలు సమృద్ధిగా ఉన్నాయి. అందువల్ల ఆమె పతికి పాలతో స్నానం చేయించింది. తాను పాలలో జలకమాడింది. వైకుంఠవాసులందరూ నీటికి బదులుగా పాలను ఉపయోగించారు.. విష్ణుదేవుడు తాను నిత్యం అర్చించే పరమశివునికి లింగానికి పాలతో స్నానం చేయించాడు. ‘శుద్ధోదక’ స్నానం మాత్రం లేదు.. కాలం గడిచింది! శివలింగమంతటా ‘చీమలు’ సభలు తీర్చాయి. పాలవాసనకు మురిసిన ఈ ‘పిపీలికాలు’ విష్ణుదేవుని శరీరమంతటా పచార్లు చేశాయి. లాభం లేదని భావించిన లోకమాత భర్తను వెంటపెట్టుకొని కైలాసానికి వెళ్లింది.. అక్కడ శివుని దేహం నుండి భవాని చీమలను దులుపుతున్న దృశ్యం లక్ష్మీనారాయణులకు కన్పించింది. అవును పరమశివుడు మహావిష్ణువునకు ప్రతిరూపం.. అందువల్ల ‘రాజీ’ కుదిరింది. ఆదిదంపతులు తిరిగి వైకుంఠం చేరేసరికి ‘గంగ’ పొంగులెత్తుతూ కనిపించింది!
కథ కంచికి పోయి ఉండవచ్చు! కానీ నీటి ప్రాధాన్యం కథలోని ఇతివృత్తం! ఎండిపోతున్న నదులను రక్షించడం ‘స్వచ్ఛత’ పునరుద్ధరణకు ఏకైక ప్రత్యామ్నాయం! పుడమిని పరిశుభ్రం చేస్తున్నది నీరు, మట్టిని మాతృభూమిగా చేస్తున్నది నీరు! పర్వతాలు మాతృదేవి వక్షస్థలం.. ఈ వక్షస్థలం నుండి జాలువారుతున్న నీరు మాతృభూమి బిడ్డలను పోషిస్తున్న జీవసుధ.. ‘ఈశ’ సంస్థవారు కన్యాకుమారినుంచి హరిద్వారం వరకు నిర్వహించిన ‘నదుల రక్షణ మహాయాత్ర’ - ర్యాలీ ఫర్ రివర్స్- ఈ ధ్యాసను పెంచింది. కానీ యమునా నదిలో ‘ప్లాస్టిక్’ పదార్థాల పర్వతాలుకంటకొని వస్తున్నాయట! గంగనీరు నల్లబడి పోయిందట!!

-హెబ్బార్ నాగేశ్వరరావు