మెయన్ ఫీచర్

‘ఉత్పత్తి’ కులాలన్నీ ఉన్నతమైనవే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ఉన్నట్లుండి ‘ఉత్పత్తి’ అనే అంశం చర్చనీయమైంది. ‘ఉత్పత్తి కులాలు గొప్పవి.. అవి నిర్లక్ష్యానికి గుర
వుతున్నాయి..’ అనే వాదం తెరపైకి వచ్చింది. ఈ నిర్లక్ష్యం ఎవరిది? మన దేశాన్ని దాదాపు వెయ్యేళ్లు విదేశీయులు పరిపాలించారు. ఇక్కడి చేతివృత్తులన్నీ దాదాపు అదృశ్యమయ్యాయి. విక్టోరియా రాణి కాలంలో ఒక సంఘటన జరిగింది. ఆరుగజాల చీరను అగ్గి పెట్టెలో పెట్టి ఒక నేత కార్మికుడు రాణీగారికి కానుకగా పంపాడు. అలాంటి కళాకారుడు భారత్‌లో ఉంటే తమ మాంచెస్టర్ గ్లాస్గో వస్త్రాలను ఎవరు కొంటారు? అని బ్రిటీష్‌వారు ఆ కళాకారుని బొటన వేలిని నరికివేశారు. ఇంతకూ ఈ చర్చ ఇప్పుడు ఎందుకంటే ప్రొఫెసర్ కంచె ఐలయ్య హిందువులను తిడుతూ పుస్తకాలు ప్రచురించాడు. ఇతడు క్రైస్తవ దేశాల నుండి భారీగా నిధులు పొందుతూ, బ్రాహ్మణ- వైశ్య- క్షత్రియులను దుర్గార్గులు అన్నాడు. ‘బాపనోళ్లు తోడేళ్లు, ఫాసిస్టులు గూండాలు, వైశ్యులు దొంగ తూకాలు తూచే సామాజిక స్లగ్మర్లు’ అన్నాడు ఐలయ్య. పాల వ్యాపారం చేసే యాదవులను గూర్చి ఇతడు పేర్కొనలేదు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, కాళీమాత, ఆది శంకరాచార్య అందరూ దుర్మార్గులే అన్నాడు.
ఈ విషయం అటుంచితే ఉత్పత్తి వర్గాలైన కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి వంటి వర్గాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, తాను సామాజికవేత్తగా ఐలయ్య చెప్పుకున్నాడు. పంట పండించేవాడు ఉత్పత్తిదారుడు. ఈ ఉత్పత్తికి- పంపిణీదారులు, వినియోగదారులు కూడా కావాలి. అప్పుడు ‘ప్లానింగ్’ చేసే బ్రాహ్మణుడు, పంపిణీ చేసే వైశ్యుడు అవసరం అవుతారు. అంటే వివిధ వృత్తులవారు పరస్పరం ఆధారపడవలసిందే. కాగా, పొలంలో ధాన్యం పండించటం సాత్వికం. గంజాయి, పొగాకు పండించటం తామసికం. మిర్చి పండించటం రాజసికం. ఉత్పత్తి భిన్న రూపాలలో ఉంటుంది. అవి.. 1) బీజోత్పత్తి 2) సృష్టి 3)జ్ఞానోత్పత్తి 4) వస్తూత్పత్తి 5) రసోత్పత్తి. ఇందులో దేనినీ నిర్లక్ష్యం చేయకూడదు. ఐలయ్య వస్తూత్పత్తిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని జ్ఞానోత్పత్తి, రసోత్పత్తులను విస్మరించాడు. ఇది కేవలం అవగాహనా రాహిత్యం. అన్ని ఉత్పత్తుల్లోనూ గుణాత్మక విశే్లషణ చేయవచ్చు. పండ్ల రసాయలను ఉత్పత్తి చేయ టం సాత్వికం. కల్లును ఉత్పత్తి చేయటం తామసికం. అన్నం తినడం సాత్వికం. గొడ్డు మాం సం తినటం తామసికం. కాళిదాసు కావ్యాలను చదవడం సాత్వికం. ‘నీలిచిత్రాల’ను చూడటం తామసికం. భగవద్గీత చదవటం సాత్వికం. ఎల్లో జర్నలిజం తామిసికం.
జ్ఞానోత్పత్తి
వస్తూత్పత్తి వంటిదే జ్ఞానోత్పత్తి. ఒకటి ద్రవ్యం, రెండవది అద్రవ్యం. జ్ఞానోత్పత్తిలో డాక్టర్లు, సైంటిస్టులు, తత్త్వవేత్తలు వంటివారు వస్తారు. ఒకాయన విద్యుత్‌ను కనిపెట్టాడు, ఇంకొకడు ట్రాక్టర్‌కు రూపకల్పన చేశాడు. ఈ రెండూ ఒకనాటి ఆముదపు దీపాలకు, నాగలికి ప్రత్యామ్నాయాలు. నేడు వ్యవసాయ రంగం వీటిమీద ఆధారపడి ఉంది. సంపద అనేది బొగ్గు, పత్తి, ధాన్యం వంటి రూపాలలో ఉంటుంది. ఆవు, బంగారం స్ర్తి రూపాలుగా ఉంటుంది. సంపద జ్ఞానరూపంలో ఉంటుంది. గృహోపకరణాలు, వ్యవసాయ పనిముట్లూ ఉత్పత్తి చేయటం సాత్వికం. మానవాళికి ప్రమాదకరమైన ఆయుధాలను తయారుచేయడం తామసికం. ఉత్పత్తిని సకారాత్మకం, నకారాత్మకం అని విభజించవచ్చు (పాజిటివ్ అండ్ నెగిటివ్). దీన్ని మొత్తం మానవ భావజాలానికి అన్వయించాలి.
చెప్పు- డప్పు ఉత్పత్తి కులాలు అన్నాడు ఐలయ్య. నిజమే గ్రామీణ సమాజంలో మేధోవర్గం, రక్షణ వర్గం, పంపిణీ, ఉత్పత్తి వర్గం, పారిశుద్ధ్య సేవలు వంటివి ఉంటాయి. అలాగే పలు రకాల రాజ్యాల గురించి కూడా మనం తెలుసుకోవాలి.
మతరాజ్యం: ఇక్కడ దేవుడు, మతం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయి
అర్థరాజ్యం: ఇందులో మేధోవర్గం వారు ధర్మభావనలో సమాజాన్ని సంతులనంలో ఉండేటట్లు చూస్తారు. ధర్మం అంటే మతం కాదు. మతం వేరు, ధర్మం వేరు.
వైశ్య రాజ్యం: నేడు అమెరికాలో ఈ పాలన చూస్తున్నాము. క్షత్రియ రాజ్యం, మిలటరీ పాలన వంటివి పాకిస్తాన్ తదితర దేశాల్లో ఉన్నాయి. తమకు ప్రజాస్వామ్య రాజ్యం పనికిరాదని పాక్ మాజీ అధ్యక్షుతు ముషారఫ్ గతంలోనే చెప్పారు.
బహుజన రాజ్యం: ఇందులో ఒకనాటి అణగారిన కులాలున్నాయి. తమకు బ్రాహ్మణ రాజ్యం, అర్థరాజ్యం అక్కర్లేదని వీరు అంటున్నారు. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులను చంపేయండని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి గతంలో పిలుపునిచ్చింది. (తిలక్-తల్వార్ ఔర్ తరాజూకో మారో)
ప్రోలిటేరియల్ కమ్యూనిజం: నియంతృత్వం అనేది మేధోసంపత్తిని నిర్లక్ష్యం చేసి శ్రామిక వర్గ రాజ్యాన్ని కోరుకుంటుంది. ఉత్పత్తి చేసే వారిని ఆ కులం పేరుతో పిలిచారు. యాదవుడు అంటే గొర్రెలు కాచేవాడు. క్షురకుడు అంటే మంగలి. రైతు అంటే పొలం దునే్నవాడు. శర్మ-వర్మ-గుప్త-దాస్ వంటి శబ్దాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలను సూచించేవి. ఇవాళ కులవ్యవస్థ పేరులో మాత్రమే ఉంది. శ్రీనివాస గుప్తా అనే వ్యక్తి వ్యాపారానికి బదులు పాలన చేస్తున్నాడు. యాదవుడైన కంచె ఐలయ్య అధ్యాపక వృత్తి స్వీకరించాడు. అనేక కులవృత్తుల వారు చదువులో రాణించి ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే నేడు ‘చాతుర్వర్ణ వ్యవస్థ’ ఒకప్పటి మాదిరి లేదు అని అర్థం. కులాంతర, వర్ణాంతర, దేశాంతర వివాహాలు జోరుగా జరుగుతున్నాయి.
వర్ణం, కులం: సత్వగుణ సంపన్నుడైన వ్యక్తి ఏ కులంలో పుట్టినా అతడు బ్రాహ్మణుడు, రజోగుణ సంపన్నుడు క్షత్రియుడు, తమోగుణ సంపన్నుడు శూద్రుడు. ధాన్య ఉత్పత్తిని శూద్రులే కాదు, బ్రాహ్మణులు కూడా చేస్తుండేవారు. నేటికీ గ్రామాల్లో కొందరు బ్రాహ్మణులకు ఆవులున్నాయి. పొలాలకు వెళ్తారు. వేదాల నిండా ‘విశ్వకర్మ’ ప్రస్తావన ఉంది. ఇతడు శ్రమశక్తికి సంకేతం. బాపనోళ్లు సోమరిపోతులు అని గేలిచేసిన ఐలయ్య తాను బుద్ధుని శిష్యుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. కాగా, ఒకప్పుడు బౌద్ధ విహారాలలో వేలాది మంది సోమరిపోతులు ఉండేవారు. వారికి వివాహాలు జరగనందున లైంగిక దుర్మార్గాలు జరిగేవి. ఋగ్వేదం పురుషార్థాన్ని, శ్రమశక్తిని బోధించింది.
‘స్వచ్ఛ్భారత్’ కార్యక్రమంలో యోగి (మహంత్) ఆదిత్యనాథ్ వంటి స్వాములు పాల్గొని ఆగ్రాలో వీధులు ఊడ్చిన దృశ్యాలు టీవీలో చూశాము. ఇది పారిశుద్ధ్య కర్మను గౌరవించడం. తల్లి తన బిడ్డకు ఎంత పారిశుద్ధ్య క్రియ చేస్తుందో మనకు తెలుసు. రోగులకు నర్సులు చేసే సేవలు గణనీయమైనవి. సారాంశమేమంటే అతిశూద్ర వర్గాల వారూ సమాజసేవలో గౌరవనీయులే.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668