భక్తి కథలు

యజ్ఞము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘యజ్ఞము’ అనగా దేవతలను పూజించి తృప్తిపరచడం. ఆ దేవతలను తృప్తి పరచడానికి కొన్ని వస్తువులను అగ్నికి ఆహుతి ఇవ్వడమే యజ్ఞము. ఈ యజ్ఞాన్ని యాగం, క్రతువు, హవనం అని కూడా అనవచ్చు. యజ్ఞమే బ్రహ్మ, యజ్ఞమే విష్ణువు, యజ్ఞమే రుద్రుడు, యజ్ఞమే సకల దేవతలు ఇక యజ్ఞవేదిక దేవేంద్రుని స్వరాజ్య పీఠం. అగ్ని దేవుని సువర్ణసింహాసనం. చంద్రుని విలాస భశనం. వరుణ దేవుని విశ్రాంతి భవనం. సమస్త దేవగణాలకు దివ్యక్షేత్రం. యజ్ఞం మరియు యజ్ఞవేదిక కృష్ణయజుస్సంహితకు ముఖ్యమైన ప్రాణం. యజ్ఞవేదిక సుప్రతిష్టమైతేనే సర్వం సుప్రతిష్ఠవౌతుంది.
ఈసృష్టిలో మానవుడు సమస్తము ప్రకృతి ద్వారానే పొందుతున్నాడు. ఇంద్రాది దేవతలు, సప్తమహర్షులు సప్త సముద్రాలు, అధిష్ఠాన దేవతలు, అష్టదిక్పాలకులు ప్రకృతి ద్వారా వాటిని మనకు అందిస్తున్నారు. పూర్వకాలంలో మహాత్ములు, ఋషులు, వారని యజ్ఞం ద్వారా సంతృప్తి పరిచి వారి ఆశీర్వాదాన్ని పొంది సకాలంలో వర్షాలతో పాటు సుఖశాంతులను పొందెడివారు. యజ్ఞంలో దేవతలనుద్దేశించి త్యాగం చేసే ద్రవ్యాన్ని హవిస్సు అంటారు. సమస్త ఏదవలకు నోరు అగ్ని దేవుడు. అగ్నిదేవుడు ఈ హవిస్సులను స్వీకరించి సమస్త దేవతలకు పంచుతాడు. అందుకే అగ్ని దేవుణ్ణి హవ్యవాహనుడని అన్నారు. అగ్నికి కొన్ని ముఖ్య హోమ భాగాలున్నాయి. అవి ఇంద్రుడు, వరుణుడు, సోముడు, ఆదిత్యుడు మరియు వావు. వీరి వలన మనకు సిరిసంపదలు, బలం ఆరోగ్యం, స్వర్గప్రాప్తి లభిస్తాయి. ఈ అందరిలో ఇంద్రునిదే అగ్రతాంబూలం.
ఏదేని ఒక పనిని సక్రమ మార్గంలో చేస్తే అది నియమం అవుతుంది. ఈనియమాన్ని గట్టి పరుస్తే దీక్ష అవుతుంది. ఈ దీక్షను దేవతాపరంగా తీర్చిదిద్దితే యజ్ఞమవుతుంది. మానవులు దేవతల యెడ భక్తి శ్రద్ధలు చూపిస్తే వారు మనలను రక్షిస్తారు. కావున యజ్ఞం వల్ల జన్మసార్థకత ఏర్పడుతుంది. ఇహపరాలు సిద్ధిస్తాయి. భగవద్గీతలోని కర్మయోగ రహస్యం ఇదే. పూర్వకాలంలో ఎంతటి భయంకరమైన వ్యాధి యైనా యజ్ఞయాగాదుల వల్లనే తొలగించుకొనేవారు. దక్షుడు చంద్రుని క్షయవ్యాధి కలుగాలని శపించగా, చంద్రుని భార్య రోహిణి యజ్ఞం చేసి తన భర్తనువ్యాధి నుండి విముక్తుడ్ని చేసింది. ఈ ప్రకృతి అంతయూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండే అనేక శక్తులచే నడుపబడుతుంది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, భూమి, గాలి, నీరు సంతులనంగా ఉంటేనే జీవితం సుఖమయవౌతుంది. కావున పూర్వకాలంలో ఋషులు, మునులు, రాజులు, ప్రకృతిలోని శక్తులను ఈయజ్ఞముల ద్వారా సేవించి ఆరాధించేవారు. ఈ క్రమములో ఆవుపాలు, నేయి, అనేక సుగంధ ద్రవ్యాలు, నవధాన్యాలు, ఓషధుల మూలికలు, రావి మఱ్ఱి ,మేడి, శమీ , మామిడి (కర్రలను) సమిథులుగా ఉపయోగించి యజ్ఞం చేసెడివారు. ఆ యజ్ఞం నుంచి వచ్చే ధూమముతో కాలుష్యం తొలిగి వాతావరణం శుభ్రపడి మనకు సంక్రమించిన అనేక వ్యాధులను తొలగించి సకాలంలో వర్షాలు కురిసేవి. దేశం సుభిక్షంగా ఉండి ప్రజలు సుఖశాంతులతో జీవించెడివారు. త్రేతాయుగంలో దశరథ మహారాజు సంతానార్థం పుత్రకామేష్ఠియాగం చేసి విష్ణుమూర్తి అంశతో రామ,లక్ష్మణ, భరత,శత్రుఘు్నలను పుత్రులుగా పొందాడు. ద్వాపరయుగంలో ద్రుపద మహారాజు యాగం చేసి అతి బలవంతుడైన దుష్టద్యుమ్నుని మహాసౌందర్యవతి యైన ద్రౌపదిని సంతానంగా యజ్ఞగుండం నుంచి పొందారు. ఇటువంటిసంఘటనలు మనకు పురాణాలలో ఎక్కువగా గోచరిస్తాయి. నేడుకూడా వర్షాలు కురవాలంటే యజ్ఞయాగాదుల ఆవశ్యకత ఎంతైనా ఉంది.
మహాత్ములు ఈ ప్రపంచాన్ని కాపాడుటకై జన్మించి పరోపకారార్థం ఇదం శరీరం అని తమ సర్వస్వం త్యాగం చేసి అనేక యజ్ఞయాగాదులు నిర్వహించి ప్రజాక్షేమానికై పాటు పడ్డారు. యజ్ఞ్ఫలితాలు పున్నమి వెనె్నలలాగా, మల్లెల పరిమళంలాగా విరాజిల్లుతాయి. నేడు మన రాష్ట్రంలో నిర్వహించనున్న చండీయాగం మనందరికీ శుభ ఫలితాలను ఇవ్వాలని మనందరం ఆ దేవదేవిని వేడుకుందాం.

- పెండెం శ్రీధర్