మీకు తెలుసా ?

బెల్లం..మనమే రారాజులం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వీట్ సుగర్’గా పిలిచే బెల్లం ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో ఉపయోగిస్తారు. ఎక్కువమంది వాడేది పంచదారనే. చెరకు, తాటి, ఖర్జూరం, కొన్ని రకాల దుంపలతో బెల్లం తయారు చేస్తారు. మొలాసిస్ వేరు చేయకుండా, రసాయనాలు కలపకుండా సంప్రదాయ శైలిలో తయారు చేసే బెల్లం మనం కనీసం 3వేల ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్నాం. ఆయుర్వేదంలో ఇది లేనిదే ఏ మందూ లేదు. బలవర్ధకమైన ఖనిజ లవణాలు సహజసిద్ధంగా దీనిలో ఉంటాయి. మహిళలకు దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రపంచంలో బెల్లం ఉత్పత్తిలో 70 శాతం మనమే తయారు చేస్తున్నాం. ఎగుమతుల్లోనూ మనదే అగ్రస్థానం. ఇథియోపియా, నైజీరియా, సూడాన్ సహా చాలా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. బెల్లానికి ఎన్నోపేర్లు ఉన్నాయి. కొన్ని దేశాల్లో దీనిని పనేలా అని పిలుస్తారు.