మీకు తెలుసా ?

మలినాలను తొలగించే ఫైర్ ష్రింప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరల్ రీఫ్స్‌లో కన్పించే ఈ అక్వేరియం జలచరం పేరు ఫైర్ ష్రింప్. ఎర్రగా ఉండటం వల్ల వీటిని బ్లడ్ ష్రింప్ అని పిలుస్తారు. వీటికి సిగ్గు, బిడియం ఎక్కువ. ఎక్కువ సేపు రాళ్ల సందులు, గుహల్లాంటి లోతైన ప్రాంతాల్లో దాక్కునే ఉంటాయి. చేపలపై ఉండే పరాన్నజీవులను, చేపలు, ఇతర జలచరాలు వదిలేసిన మాంసపు తునకలను తింటాయి. ఒకరకంగా ఇవి పారిశుద్ధ్యం పనులు చేస్తాయనే చెప్పాలి. ఇతర రొయ్యలకు భిన్నంగా ఇవి తమ జతగాడితో కలసి జీవిస్తాయి. మిగతా రొయ్యలు మేటింగ్ తరువాత మగవాటిని తరిమేస్తాయి. నైట్రోజన్, కాపర్‌లను ఇది భరించలేదు. అక్వేరియంలో వీటిని పెంచినపుడు ఆ మూలకాలు లేకుండా చూసుకోవాలి.