మీకు తెలుసా ?

కర్రపెండలం...సగ్గుబియ్యం.. ఇంధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్యాల్లా తెల్లగా మిలమిల మెరిసిపోయే సగ్గుబియ్యం నిజానికి గింజలు కాదు. అది నేరుగా తయారయ్యే పదార్థమూ కాదు. గొట్టాల్లా పెరిగే కర్రపెండలం పొడితో తయారయ్యే సగ్గుబియ్యం మంచి పౌష్టికాహారం. సులువుగా జీర్ణమయ్యే పదార్థం. అందుకే పిల్లలకు, అనారోగ్యం నుంచి కోలుకుంటున్నవారికి అది చక్కటి ఆహారం. పిండిపదార్థం ఎక్కువగా ఉన్న పంటల్లో వరి, మొక్కజొన్న తరువాత కర్రపెండలం మూడోస్థానంలో ఉందంటో ఇది ఎంత బలవర్ధకమైన ఆహారమో అర్థమవుతుంది. అన్నట్లు కర్రపెండలం ద్వారా తయారయ్యే చిప్స్, కేక్స్, వేపుళ్లు, పచ్చళ్లు, సగ్గుజావ, పాయసం, కిచిడీ, పుడ్డింగ్ సంగతి పక్కనపెడితే బ్రెజిల్, చైనా మరో ప్రయోజనాన్ని గరిష్ఠంగా పొందుతున్నాయి. కర్రపెండలంతో బయోడీజిల్ (ఇథనాల్) ఉత్పత్తి చేసి విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఈ దుంపల్లో ఉండే విషతుల్య పదార్థం ‘సైనోజెనిక్ గ్లైకోసైడిస్’ (హైడ్రోజన్ సైనైడ్) ఉండటంవల్ల పచ్చివి తినడం మంచిది కాదు. ఉడకబెట్టి తింటే ఏ ప్రమాదమూ ఉండదు.

ఎస్.కె.కె.రవళి