మీకు తెలుసా ?

ఎగిరే చేప వేగం తెలుసా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ చేప ఎగురుతుంది (గ్లైడింగ్) తెలుసా. అందుకే వీటిని ‘్ఫ్లయింగ్ ఫిష్’ అంటారు. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల్లో ఎక్కువగా కన్పించే ఈ చేపలు అన్నిచోట్లా ఉంటాయి. కరేబియన్ ప్రాంతమైన బార్బడోస్‌ను ఒకప్పుడు ‘లాండ్ ఆఫ్ ఫ్లయింగ్‌ఫిష్’గా పిలిచేవారు. మిగతా చేపలకు భిన్నంగా వీటి రెక్కలు (్ఫన్స్) ఉంటాయి. సముద్రంలో సూర్యకాంతి ప్రసారమయ్యేంత లోతు వరకు ఇవి సంచరిస్తాయి. నీటి ఉపరితలంపైకి దూసుకువచ్చేటపుడు దాని వేగం గంటకు 35 మైళ్లు. ఇక ఉపరితలంపైకి వచ్చాక గాలిలోకి ఎగిరేటప్పుడు దాని వేగం గంటకు 70 కిలోమీటర్ల పైమాటే. తోక కొస నీటికి తాకుతూ గాలిలో ఎగిరినప్పుడు వీటి మొదటి రెక్కల జత విప్పార్చుకుంటుంది. ఏకధాటిగా 450 అడుగుల దూరం వరకు అది అతి వేగంగా గాలిలో ఎగురుతూ (గ్లైడ్) వెళ్తుంది. అలా 1350 అడుగుల దూరాన్ని క్షణాల్లో అధిగమించి మళ్లీ నీళ్లలోకి జారుకుంటుంది. ప్రమాదం ఎదురైనప్పుడు శత్రువులనుంచి తప్పించుకోవాలనుకున్నప్పుడు అది అలా ఎగురుతుంది. ఒక్కోసారి సముద్ర ఉపరితలంపై నాలుగు అడుగుల ఎత్తు వరకు ఎగిరి తప్పించుకుంటుంది.

ఎస్.కె.కె.రవళి