మీకు తెలుసా ?

గడ్డి లేకపోతే మనుగడే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడ్డిపరక అని తీసి పారేస్తూంటాం కదా! కానీ ఈ భూమి మీద జీవుల మనుగడకు ప్రధానమైన ఆహారం గడ్డిజాతులే. మనం తినే వరి, గోధుమ, జొన్న, చాలా రకాల పూలు, పళ్లు...ఇలా ఎన్నో గడ్డిజాతికి చెందినవే. ఇళ్ల ముందు, లాన్‌లలో కేవలం కొద్ది అంగుళాల ఎత్తు మాత్రమే పెరిగే గడ్డి నుంచి 120 అడుగుల ఎత్తు పెరిగే ‘జెయింట్ బాంబూ’ రకం వెదురు వరకు అన్నీ గడ్డి రకాలే. అంటార్కిటికా, భూమధ్య రేఖ, ఉత్తర, దక్షిణ ధృవాలుసహా భూమీద అన్ని ప్రాంతాల్లో పెరిగే జీవజాలం గడ్డి. వాతావరణంలోకి విడుదలయ్యే ఆక్సిజన్‌లో 40శాతం ఈ గడ్డే విడుదల చేస్తోంది. మన ఇంటిముందు పెంచే లాన్‌లోని గడ్డి 20శాతం ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఇంటి విలువను, మానసికోల్లాసాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. పచ్చటి గడ్డి తిన్న పశువులు చిక్కటి, తెల్లని పాలను ఇస్తాయి. గడ్డిని మనం చులకనగా చూస్తాం గానీ...మనం తినేది అదే.

ఎస్.కె.కె.రవళి