మీకు తెలుసా ?

పెదవి దాటని నిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి పెదాలకు ఉన్న ప్రత్యేకతలు తెలిస్తే విస్తుపోవాల్సిందే. మన పెదాలలో కనీసం పది లక్షల నరాల కొసలు ఉంటాయని తెలుసా! పైగా రక్షణ పొరంటూ ప్రత్యేకంగా లేని మానవశరీర భాగం ఇదే. స్వేదగ్రంధులు లేని భాగమూ అదే. అందుకే పెదాలకు చమట పట్టదు. అందువల్లే చలికాలం, వేసవి, విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో పెదాలు పగిలిపోతాయి. పెదాలపై ఆరువరుసలున్న పొర కప్పి ఉంటుంది. అదే చర్మంపై పదహారు వరుసల పొర రక్షణగా ఉంటుంది. వేలిముద్రల్లాగానే ప్రతి మనిషి పెదాలు ప్రత్యేకమైన ముద్రలు కలిగి ఉంటాయి. అన్నట్లు పెద్దపెదవులున్న మహిళలు మగవారికి నచ్చితే, మీడియమ్ సైజ్ పెదవులున్న మగవారిని మహిళలు ఇష్టపడతారట.

ఎస్.కె.కె.రవళి