మీకు తెలుసా ?

మయూర సాలీడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన రంగులతో నాట్యం చేసే సరికొత్త సాలీడు జాతిని ఆ మధ్య శాస్తవ్రేత్తలు కనిపెట్టారు. ప్రమాదకరమైన సాలీళ్లు ఎక్కువగా ఉండే ఆస్ట్రేలియాలోనే ఇదికూడా కనిపించింది. ముఖ్యంగా పెర్త్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కన్పిస్తోంది. మామూలు రంగుల్లో కన్పించే ఆడ సాలీళ్లను ఆకర్షించేందుకు విభిన్నమైన, ఆకర్షణీయమైన రంగులతో ఉన్న ఉదరాన్ని పైకెత్తి పెట్టి, మూడోజత కాళ్లను చువ్వల్లా నిలబెట్టి అటూఇటూ కదులుతూ విన్యాసాలు చేయడం మగ సాలె పురుగులకు అలవాటు. వీటికి ఉన్న రంగులు, నృత్యరీతి వేటికి వాటికి ప్రత్యేకం. నాట్యంలో వైవిధ్యం, ఆకర్షణలో వెనుకబడితే ఆ మగ సాలీళ్లకు ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే నచ్చని మగ పురుగులను ఆడ సాలెపురుగులు వెంటాడి తినేస్తాయి. అసమర్థుడైన ఆ మగపురుగు వేటితోనైనా జతకలిస్తే అలాంటివే పుడతాయని అవి భావిస్తాయట. సరే వీటికి ఉన్న ప్రత్యేకమైన రంగులవల్ల వీటిని ‘పీకాక్ స్పైడర్’ అని పిలుస్తున్నారు. ఇది ‘జంపింగ్ స్పైడర్’ జాతికి చెందినది.

ఎస్.కె.కె.రవళి