మీకు తెలుసా ?

క్రూరమైన పక్షులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంగ్ బర్డ్స్ జాతికి చెందిన ‘ష్రైక్స్’ బుచర్ బర్డ్స్ అని కూడా పిలుస్తారు. వీటిలో లాగర్‌హెడ్ ష్రైక్స్ ఉత్తర అమెరికాలో ఎక్కువగా కన్పిస్తాయి. పెద్దతలతో ఉండటం వల్ల వీటిని అలా పిలుస్తారు. పక్షులు, కప్పలు, కీటకాలు, పాములు, తేళ్లు, ఎలుకలను వేటాడి పట్టుకునే వీటిని కసాయి పక్షులుగా చెబుతారు. అవి పట్టుకున్న ఆహారాన్ని పదునుగా ఉండే ముళ్లకు గుచ్చి చంపుతాయి. ఒకటిరెండు రోజుల తరువాత వాటిని తింటాయి. విషంతో కూడుకున్న జీవుల్ని ఇలా ముళ్లకు గుచ్చి చంపడానికి ఓ కారణం ఉంది. ఆ విషం ప్రభావం తగ్గేవరకు ఆ జీవిని అలా ముళ్లకు వేళ్లాడదీసి ఉంచుతాయి. ఆ ప్రభావం తగ్గాక తింటాయి. మిగతా పక్షులకు భిన్నంగా వీటి ముక్కు గద్దముక్కులా కొనదేరి, వంకీ తిరిగి ఉంటుంది. శత్రువు లేదా ఆహారంగా పనికొచ్చే జంతువులపై దాడి చేసి వాటి వెన్ను విరిచేందుకు, తీవ్రంగా గాయపరిచేందుకు ఈ ఏర్పాటన్నమాట.

ఎస్.కె.కె.రవళి