మీకు తెలుసా ?

రంగు మారితే ఈడొచ్చినట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర అమెరికాలో కనిపించే అందమైన నీటిపక్షి ‘వుడ్ డక్’. శరీరంలో ఒక్కో భాగం ఒక్కో రంగుతో విభిన్నమైన, స్పష్టమైన ముదురు వర్ణంతో ఆకట్టుకునే ఈ మగ వుడ్ డక్ నిత్యం అలా ఉండదు. మామూలు రోజుల్లో తేలికపాటి రంగుల్లో ఉండే ఈ నీటిపక్షి జతకట్టే సమయంలో ఆడపక్షులను ఆకర్షించేందుకు ఇలా వర్ణశోభితంగా మారిపోతుంది. ఎర్రటి కళ్లు, తల పై భాగంలో మెటల్లిక్ ఊదా, ఆకుపచ్చ మిళితమైన రంగు, ముఖం ఇరువైపులా నల్లటి ఈకలపై బుగ్గల మీదుగా సాగే తెల్లటి గీతలు, ముక్కు మొదలయ్యే చోట పసుపురంగు, ఛాతీవద్ద ఎరుపు, దానికి ఇరువైపులా నలుపు, తెలుపు గీతలు, తెల్లటి ఉదరం, తోక, పృష్ఠ్భాగం నల్లగా, రెక్కలు నలుపు, నీలం కలగలసిన రంగులతో ఉంటాయి. ఈ విభిన్నమైన రంగుల మగపక్షి నీటిలో ఈదుతూ తేలికపాటి రంగులతో ఉండే ఆడపక్షిని ఆకట్టుకుంటుంది. సాధారణంగా మామూలుగా ఉండే ఈ మగపక్షి శీతాకాలం మొదటి నుంచి వేసవి మొదలయ్యే వరకు ఇలా రంగులబొమ్మలా మారిపోతుంది. దాదాపు మూడు అడుగుల పొడవువరకు పెరిగే ఈ పక్షులు మొదటి నాలుగు సంవత్సరాలు బతకడం దినదినగండమే. చెట్టు తొర్రలు, మనం చేసే కృత్రిమగూళ్లలో గుడ్లు పెట్టడానికి ఇష్టపడతాయి. సమయానికి గూళ్లు సిద్ధం కాకపోతే ఇతర బాతులు చేసిన గూళ్లలో గుడ్లు పెట్టేస్తాయి. వుడ్‌డక్ బాతులు పుట్టిన తరువాత మొదటి ఏడాదంతా జలచరాలు, కీటకాలను తింటే ఎదిగిన తరువాత వాటితోపాటు మొక్కలు, నాచు, గడ్డిని తింటాయి. గంటకు 30 మైళ్ల వేగంతో ఎగిరే ఈ పక్షులు సీజన్ మారినప్పుడు బొచ్చు విడిచిపెట్టడం విశేషం.

- ఎస్.కె.కె. రవళి