మీకు తెలుసా ?

వీటి శరీరంపైనే ఆహారం ఉంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్ పసిఫిక్ సముద్రం అంతర్భాగం, ఆర్కిటిక్ ప్రాంతంలో కనిపించే అతి చిన్నజీవులు ఈ ‘యతి’ పీతలు. పదిహేను మిల్లీమీటర్ల సైజులో మాత్రమే ఉండే ఈ జీవులు సముద్ర అంతర్భాగంలో 4500 అడుగుల లోతుల్లో ఉంటాయి. అత్యంత వేడిగల హైడ్రోధర్మల్, అతిశీతల ఆర్కిటిక్ వాతావరణంలో అవి మనుగడ సాగిస్తాయి.
అతి తక్కువ స్థలంలో వేలసంఖ్యలో ఇవి ఉంటాయి. వీటి శరీరంపై అతి సూక్ష్మమైన, తెల్లని వెంట్రుకల్లాంటి ఒతె్తైన నిర్మాణం ఉంటుంది. అతివేడి, అతి శీతల వాతావరణాన్ని, అక్కడ విడుదలయ్యే విషతుల్య పదార్థాలను నిర్వీర్యం చేయడానికి ఈ ‘బొచ్చు’ పనిచేస్తుంది. ఈ బొచ్చుపై జీవించే ఒకరకమైన మాలిక్యూల్స్, బాక్టీరియాను ఆహారంగా ఈ పీత వినియోగిస్తుంది. ఇదే దీని ప్రత్యేకత. అదీగాక గుడ్లుపెట్టి పొదిగిన వెంటనే తల్లి పీతలు మరణిస్తాయి. అన్నట్లు, వీటికళ్లు దాదాపుగా పనిచేయవు.

- ఎస్.కె.కె. రవళి