మీకు తెలుసా ?

ప్రపంచంలో అతి చిన్న జింకలు ఇవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలీ, అర్జెంటీనాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జీవించే ఈ ‘పుడు డీర్’ జింకల జాతిలో అతి చిన్నది. బాగా ఎదిగిన ఈ జింక మహా అయితే 85 సెంటీమీటర్లు ఎత్తుంటుంది. 12 కేజీల బరువుకు మించదు. పుట్టినప్పుడు 600 గ్రాములకన్నా తక్కువ, వెయ్యి గ్రాములకన్నా ఎక్కువ బరువుంటే ఇవి బతకడం కష్టం. పొడవు పెరగని కొమ్ములు, ముఖంపై ఉండే గ్రంధులు విడిచే ద్రవం వెదజల్లే పరిమళం ద్వారా జతకట్టే ఆడ పుడుకు కమ్యూనికేషన్ ఇవ్వడం వీటి ప్రత్యేకత. అప్పుడే పుట్టిన పిల్లల బొచ్చుపై తెల్లటి మచ్చలు ఉన్నా పెరిగే కొద్దీ శరీరం అంతా ముదురు గోధుమ వర్ణంలోకి మారిపోతుంది. జతకట్టడానికి తప్ప మిగతారోజుల్లో ఒంటరిగా జీవించే వీటిని చిలీ కొండమేకలుగానూ పిలుస్తారు. త్వరగా భయపడిపోయే ఈ జింకలు ఆ సమయంలో వణికిపోవడం మామూలే.

- ఎస్.కె.కె. రవళి