మీకు తెలుసా ?

‘బుద్ధ భంగిమ’ ఈ పిల్లి ప్రత్యేకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కాంటాండ్‌కు పుట్టిన ఈ సంకరజాతి పిల్లులను ‘స్కాటిష్ ఫోల్డ్ క్యాట్’ అని పిలుస్తారు. పొట్టిగా, మడతపెట్టినట్లు ఉండే చెవుల వల్ల వీటికి ఈ పేరు వచ్చింది. అయితే ఇదే జాతిలో నిటారుగా చెవులుండే పిలులూ ఉంటాయి. కాకపోతే వాటి సంఖ్య చాలా తక్కువ. వాటిని ‘స్ట్రెయిట్స్’ అని పిలుస్తారు. ఈ స్కాటిష్ ఫోల్డ్ పిల్లులకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బొద్దుగా, ముద్దుగా ఉండే ఇవి మిగతా పిల్లులకన్నా వినసొంపుగా అరుస్తాయి. వీపును నేలకు ఆన్చి పడుకోవడం వీటి అలవాటు. అలాగే బుద్ధుడు కూర్చున్న విధంగా పిరుదలను నేలకు ఆన్చి, వెనుక కాళ్లను నేలపై ముందుకు ఆన్చి, ముందరికాళ్లను పొట్టపై పెట్టుకుని బుద్ధుడు కూర్చున్నట్లు చతికిలపడి కూర్చోగలడం వీటికి మాత్రమే సొంతం. పిల్లలు, ఎక్కువమంది సభ్యులున్న కుటుంబంలో కలసిమెలసి ఉండటం వీటికి ఇష్టం. యజమానితో కలసి అన్నిచోట్లకు వెనకాలే వెళ్లటం వీటికి అలవాటు. గుండ్రటి తల, పెద్దకళ్లున్న ఈ పిల్లులను ‘గుడ్లగూబ’లాంటి పిల్లిగా చెప్పుకుంటారు.

- ఎస్.కె.కె. రవళి