మీకు తెలుసా ?

నైటింగేల్స్ అప్పుడు మాత్రం కూయవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు కోయిలమాదిరిగా బ్రిటన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో శ్రావ్యంగా పాడే పక్షి నైటింగేల్. ఇది చూడటానికి పిచుకమాదిరిగా ఉంటుంది. దానికన్నా కాస్తంత పెద్దవిగా ఉంటాయి. ఇంకా జతకట్టని ఒంటరి మగపక్షులు శ్రావ్యంగా పాటను ఆలపించడం పరిపాటి. దట్టంగా ఉన్న పొదల్లో ఎవరికీ కనిపించకుండా అవి పాటను ఆలపిస్తాయి. పైన ఎగురుతూ వెళ్లే ఆడపక్షులను ఆకర్షించేందుకు ఇవి అలా చేస్తాయి. కానీ జతకట్టి, గుడ్లుపెట్టిన తరువాత ఆ పక్షులు అసలు కూయవు. అలా చేస్తే శత్రువులు వాటిని కనిపెడతాయని వాటి భయం. మరీ ప్రమాదం ఎదురైతే చిన్నచిన్న శబ్దాలు మాత్రం చేసి తోటి పక్షులను అప్రమత్తం చేస్తాయంతే. ఈ చిన్నపక్షులు వేసవి విడిదిగా వేలమైళ్ల దూరం ప్రయాణిస్తుంటాయి.