మీకు తెలుసా ?

వీటి శరీరాన్ని తాకితే నిప్పురవ్వలు రావొచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా, నాలుగైదు ఆసియా దేశాల్లో మాత్రమే కనిపించే ఆలిగేటర్ గార్ చేపలు నిజానికి ఆలిగేటర్‌తో ఎటువంటి సంబంధం లేని జలచరాలు. ఉత్తర అమెరికాలో గార్ కుటుంబానికి చెందిన చేపల్లో ఇవే అతిపెద్దవి. దాదాపు 8 నుంచి పది అడుగుల పొడవు పెరిగే వీటి శరీరం వజ్రాల్లాంటి పొలుసులతో చాలా ధృడంగా ఉంటుంది. ఒక్కోసారి వీటి శరీరాన్ని గట్టి వస్తువులు, లోహపు ఆయుధాలతో తాకితే రాపిడికి నిప్పురవ్వలు కూడా వస్తూంటాయి. ఆలిగేటర్‌లకు ఉన్నట్లు వీటికి ముక్కు పొడవుగా, పదునైన పళ్లతో ఉండటం వల్ల ఈ గార్ కుటుబానికి చెందిన చేపలను ‘ఆలిగేటర్ గార్’ చేపలుగా పిలుస్తారు. నెమ్మదిగా కదిలే ఈ చేపలు జలచరాల్లో క్రూరంగా దాడి చేసేవిగా గుర్తింపు పొందాయి. చాలామందికి షార్క్‌లు, తిమింగలాలు క్రూరంగా వ్యవహరిస్తాయని చెబుతారు. కాని ఆలిగేటర్ గార్‌లు కూడా అంతకన్నా ప్రమాదకారులు. అయితే ఇవి నెమ్మదిగా కదిలే జలాల్లో, రహస్యంగా జీవించడానికే ఇవి ఎక్కువగా ఇష్టపడతాయి.

- ఎస్.కె.కె. రవళి