మీకు తెలుసా ?

వీటిని ‘బటర్‌ఫ్లై ఫిష్’ అని ఎందుకంటారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందు, పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్ర ప్రాంతాల్లో కనిపించే ఈ అందమైన చేపలను ‘సీతాకోక చిలుక చేపలు’ (బటర్‌ఫ్లై ఫిష్) అని పిలుస్తారు. శరీరంపై గుండ్రటి నల్లని కళ్లలాంటి మచ్చలు, చారలు, అందమైన రంగులతో ఇవి దాదాపు సీతాకోక చిలుకల్లా అందంగా ఉంటాయి. అవసరాన్ని బట్టి ముందుకు చొచ్చుకు వచ్చే ముక్కు వీటికి అదనపు అందాన్ని ఇస్తుంది. పగడపు దీవుల్లో ఎక్కువగా ఇవి ఉంటాయి. జత దొరికే వరకు ఒంటరిగా జీవించే ఈ చేపలు జతకట్టాక జీవితాంతం కలిసే ఉంటాయి. గుడ్ల పొదగబడిన తరువాత పుట్టే ఈ చేపలు చాలా చిన్నవిగా ఉంటాయి. రక్షణ కోసం ఈ పిల్ల చేపలు తమ చుట్టూ రక్షణ ఫలకాన్ని నిర్మించుకుంటాయి. కాస్త బలం పుంజుకున్నాక మాములుగా మారిపోతాయి.