మీకు తెలుసా ?

మొసళ్లు రాళ్లనూ మింగుతాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔను ఇది నిజం. మొసళ్లు రాళ్లను కూడా మింగుతాయి. అవి మాంసాహారులని అందరికీ తెలిసిందే. ఇవి ఆహారాన్ని నమిలి తినలేవు. మాంసాన్ని, రక్తాన్ని లేదా ఎముకలను ఖండాలుగా గుటుక్కుమని మింగుతాయంతే. అయితే తిన్న ఆహారం అరగాలికదా. అందుకోసం చిన్నచిన్న రాళ్లను అవి మింగుతాయి. వాటిమధ్య నలిగి అవి తిన్న ఆహారం అరుగుతుందన్నది వాటి తెలివి. ప్రపంచంలో ఉప్పునీటిలో పెరిగే మొసళ్లు అతిపెద్దవిగా ఉంటాయి. దాదాపు 18 అడుగుల మేరకు అవి పెరగుతూంటాయి. ఈ జాతిలో అతి చిన్నవి డ్వార్ఫ్ క్రొకొడైల్స్. ఇవి దాదాపు 5 అడుగుల మేర మాత్రమే పొడవు పెరుగుతాయి. నిజానికి మొసళ్లు భూమిపై 240 మిలియన్ సంవత్సరాలుగా జీవిస్తున్నాయి. వీటి పూర్వీకులు డైనోసార్లు, పక్షులు అని అంటే నమ్మాలి మరి. అవి బతికున్నంతకాలం వాటికి దంతాలు ఊడటం, కొత్తవి వస్తూనే ఉండటం మామూలే. వీటి చర్మానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా వేటగాళ్లు ఎక్కువగా వీటిని చంపేస్తున్నారు. దాదాపు అన్ని జాతుల మొసళ్లు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.