మీకు తెలుసా ?

దీని నోట్లో వందమంది పట్టేస్తారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ భూగోళం మీద అతి పెద్ద ప్రాణి బ్లూవేల్. అప్పుడే పుట్టిన బ్లూవేల్ కనీసం పాతిక అడుగుల పొడవు ఉంటుంది. వయసువచ్చిన మగ బ్లూవేల్ పొడవు వంద అడుగులు, బరువు 150 టన్నులు ఉంటుంది. దీని నోరు అతిపెద్దదిగా ఉంటుంది. ఇది నోరు తెరిస్తే కనీసం వందమంది మనుషులు పట్టేస్తారు. హిప్పోపోటమస్ దీనికి దగ్గరి బంధువు. భూగోళంలోని ప్రాణుల్లో ఇది ఎంత పెద్దదైనప్పటికీ ఇది తినే ఆహారం మాత్రం అతి చిన్న జలచరాల్లో ఒకటైన ‘క్రిల్’. రొయ్యతరహాలో ఉండే ఈ జలచరాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. వీటిని బ్లూవేల్ చేపలు ఎక్కువగా ఇష్టపడతాయి. ఇవి ఊపిరితిత్తులతో గాలి పీలుస్తాయి. వీటి తలపై ఉండే నాసికారంధ్రంలోంచి చిన్నపిల్లలు వెళ్లిపోవచ్చు. ఈ ముక్కునుండి బయటకు వచ్చే గాలి దాదాపు 30 అడుగుల ఎత్తునకు చిమ్మినట్లు బయటకి వస్తుంది. దీని గుండె నిమిషానికి ఐదారుసార్లు కొట్టుకుంటుంది. నీటిపైకి ఎగిరినప్పుడు మూడుసార్లు కొట్టుకుంటుంది. విశ్రాంతి కావాలనుకున్నప్పుడు తన మెదడులో సగభాగాన్ని ఉపయోగించదు. అప్పుడే పుట్టిన పిల్ల బ్లూవేల్ గంటకు వందల లీటర్ల పాలు తాగుతుంది. ప్రతి గంటకు 9 పౌండ్ల బరువు పెరుగుతుంది. దాదాపు వందేళ్లు బతికే ఈ బ్లూవేల్‌కు షార్క్‌లలో ఒక జాతివాటితోను, మనుషులతోనే ముప్పు.