మీకు తెలుసా ?

ఛాతీపై మచ్చ... దేనికదే ప్రత్యేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్‌లో అందరికీ పరిచయమైన ఈ పక్షి పేరు ‘రాబిన్’. అక్కడి ప్రజలకు ఎంతో ఇష్టమైన పక్షులు ఇవి. ఐరోపాతో సహా పలు దేశాల్లో కన్పించినప్పటికీ బ్రిటన్‌లో వీటి సంఖ్య, వీటికి ఆదరణ చాలా ఎక్కువ. బ్రిటన్ జాతీయ పక్షి కూడా అదే. అక్కడి పోస్ట్‌మెన్‌ను రాబిన్ పక్షులతో పోలుస్తారు. ఎందుకంటే వారి డ్రెస్‌కోడ్‌లో ఛాతీపై ఎర్రటి వస్త్రం ధరించడంతో ఆ పక్షులతో పోలుస్తారు. రాబిన్ పక్షులు పుట్టినప్పుడు ఆ మచ్చ గ్రే కలర్‌లో ఉంటుంది. ఎదుగుతున్న కొద్దీ రంగు మారుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికాలో వీటిని పరిచయం చేసే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మరికొన్ని దేశాల్లో వీటిని పోలిన పక్షులున్నప్పటికీ అవి ‘రాబిన్స్’ కాదు. ఛాతీపై ఉండే ఆరెంజ్ కలర్ మచ్చలు వీటికి ప్రత్యేక ఆకర్షణ. మన వేలిముద్రల్లాగానే ఈ పక్షులకు ఉండే ఈ మచ్చ ఏ రెండింటికీ ఒకేలా ఉండదు. అన్నట్లు ఈ పక్షులు పళ్లు, గింజలు, కీటకాలను తింటాయి. అయినా వీటికి ‘మీల్ వార్మ్స్’ అంటే మహాఇష్టం.

ఎస్.కె.కె.రవళి