మీకు తెలుసా ?

నిజమైన నీలిరంగులో ఉండే బ్లూబెర్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతిలో అసలుసిసలు నీలిరంగులో కన్పించే అరుదైన ఫలం బ్లూబెర్రి. మన ద్రాక్షపళ్లలా కన్పించే ఈ బ్లూబెర్రీలంటే ఉత్తర అమెరికా వాసులకు పిచ్చి. వారి ఆహారంలో ఇవి ఓ భాగం. అచ్చమైన నీలిరంగుతో, బూడిదపట్టినట్లు కన్పించే ఈ పళ్లలో భారీగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. మతిమరుపును పోగొట్టి, జ్ఞాపకశక్తిని పెంచే ఈ పళ్లు క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. వీటి రసం, తొక్కలతో మద్యం తయారు చేస్తారు. ఈ పళ్లతో రసాలు, సలాడ్‌లు, ఐస్‌క్రీమ్‌లు, కేక్‌లు తయారు చేస్తారు. ఎండిన బ్లూబెర్రీల వాడకమూ అక్కడ ఎక్కువే. ఒకటీఅరా ఐరోపాలో అక్కడక్కడ, ఆసియాలో టర్కీ వంటి ఒకటీ అరా దేశాల్లో ఈ బ్లూబెర్రీ సాగవుతున్నప్పటికీ ప్రపంచంలో వీటిని ఎక్కువగా పండించే దేశం అమెరికాయే.

ఎస్.కె.కె.రవళి