మీకు తెలుసా ?

రంగులు మారే ముక్కు -- మీకు తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సీ పారెట్స్’గా పిలిచే ఈ ‘పఫిన్’ పక్షులు నిజానికి చిలుకలు కావు. వీటి ముక్కువల్ల వాటికి ఆ పేరువచ్చింది. ఇవి సముద్రపక్షులు. వీటి ముక్కు సీజన్‌బట్టి రంగు మారుతూంటుంది. శీతాకాలంలో వీటి ముక్కు లేతబూడిద రంగులో ఉంటే వసంతకాలం వచ్చేసరికి ముదురు ఎరుపు లేదా కాషాయవర్ణంలోకి మారుతుంది. నిజానికి వసంతం వచ్చేసరికి అవి జతకలిసే సమయం వచ్చినట్లన్నమాట. సరైన జతను ఆకట్టుకోవడంకోసం ఇవి ఇలా ఆకర్షణీయంగా మారిపోతాయన్నమాట. వీటికి మరో ప్రత్యేకత ఉంది. వీటిముక్కుకు సన్నటి కొక్కిల్లాంటి స్పైన్స్ ఉంటాయి. ఒకేసారి పదుల సంఖ్యలో చేపలను వాటితో గుచ్చి పట్టుకోవడం వీటి అలవాటు. పిల్లలకు ఆహారాన్ని పుష్కలంగా తెచ్చేందుకు వీటికి ఉన్న ప్రత్యేక ఏర్పాటు అది. సముద్రంలో అలలపై విశ్రాంతి తీసుకోగలగడం, గాలిలో ఎగిరేటప్పుడు అవసరమైతే నిముషానికి 400 సార్లు రెక్కలుకొట్టి గంటకు 88 కి.మీ. వేగంతో ఎగరగలగడం వీటికి సాధ్యం.

దీని మధ్యవేలు చాలా పొడుగు..

కేవలం మడగాస్కర్‌లో మాత్రమే జీవించే ఈ జంతువు పేరు ‘అయె-అయె’. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఎవరికీ తెలీదు. ఆ దేశపు భాషలో అయెఅయె అంటా ‘ఏమీ తెలీదు’ అని అర్థం. అక్కడివారికి ఆ జంతువంటే ఇష్టం ఉండదు. దానిని దుశ్శకునంగా భావిస్తారు. ఎలుకలు, లీమర్, స్లాత్, వీసెల్‌వంటి ఆరు జంతువుల పోలికల్లో ఉండే దీని కళ్లు బంగారు వర్ణంతో పెద్దవిగా ఉంటాయి. వీటి చెవులుకూడా అతిపెద్దవిగా ఉంటాయి. విభిన్నమైన చేతివేళ్లే వీటి ప్రత్యేకత. వీటి చేతివేళ్లలో మధ్యవేలు మిగతావాటికి భిన్నంగా, పొడవుగా, సన్నగా, మృదువైన చర్మం, ఎముకలతో నిర్మితమై ఉంటుంది. అది మిగతా వేళ్లతో సంబంధం లేకుండా స్వతంత్రంగా కదలగలుగుతుంది. చెట్ల పైకొమ్మల్లో ఉండటానికి ఇష్టపడే ఈ జీవి...కాండంలో ఎక్కడైనా గుల్ల ఉందేమో తెలుసుకునేందుకు తన చేతితో చరుస్తుంది. ఒకవేళ గుల్ల ఉందని, ఆ గుల్లలో పురుగులు, వాటి గుడ్లు ఉన్నాయన్పిస్తే నోటితో కన్నం చేసి తన పొడవైన మధ్యవేలితో వాటిని బయటకు తీసి తినేస్తుంది. మిగతా వేళ్ల సైజుకన్నా మూడురెట్ల పొడవుగా ఈ మధ్యవేలుంటుంది. ఆహారాన్ని అందిపుచ్చుకునేందుకే ఈ ఏర్పాటన్నమాట. వీటి కళ్లల్లో మూడో కనుపాప ఉండటం, దంతాలు జీవితాంతం పెరుగుతూనే ఉండటం వీటి స్పెషాలిటి.

ఆహారాన్ని కడిగి తింటాయి...
జపాన్‌లో కన్పించే ఈ ‘మంచు కోతులు’ (స్నోమంకీస్) కోతిజాతిలో మహాతెలివైనవిగా చెబుతారు. చిలకడ దుంపలు, ఇతర ఆహార పదార్థాలను నీటిలో కడిగి వాటిపై మట్టి తొలగిపోయాక తినడం వాటికి అలవాటైన ప్రక్రియ. అలాగే పప్పుగింజలనుకూడా చేతుల్లో ఒడిసిపట్టుకుని నీళ్లలో ఆ దోసిలిని ఉంచుతాయి. ఆ గింజలకు ఉన్న మట్టి, ఇసుక నీళ్లలోకి జారిపోయి, గింజలు పైకి తేలాక వాటిని తింటాయి. ఇలా ఎప్పటికప్పుడు కొత్తకొత్త విధానాలను కనుగొనడం, తమ పిల్లలకు నేర్పడం వీటికి తెలుసు. మంచు కురిసే వేళల్లో నీటిబుగ్గల్లో సేదదీరడం, శరీర ఉష్ణ్రోగ్రత తగ్గిపోకుండా కోతులన్నీ వరుసగా, పక్కపక్కనే, ఒకదానిని ఒకటి పట్టుకుని కూర్చోవడంవంటి చేష్టలు దాని తెలివిని తెలియచేస్తాయి. రాళ్లతో గుంపులుగుంపులుగా ఆడుకోవడం వాటికి ఇష్టం. తీవ్రమైన మంచులోను, వేలాది అడుగుల ఎత్తులోనూ అవి హాయిగా బతికేస్తాయి. వాటి మొహం, పృష్ట్భాగం బాగా ఎరుపుగా ఉంటే...అవి ఎదిగిన కోతులని భావించాలి.

=====

-ఎస్.కె.కె.రవళి