మీకు తెలుసా ?

పగటిపూట నిద్రపోవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊసరవెల్లులు పగటిపూట అసలు నిద్రపోవు. ఒకవేళ అవి పడుకున్నాయంటే...అనారోగ్యంతో ఉన్నట్లు లెక్క. రాత్రిపూట మాత్రమే అవి కునుకుతీస్తాయి. శత్రువులనుంచి ముప్పు ఉన్నప్పుడు లేదా వాటినుంచి రక్షణకు ఊసరవెల్లులు రంగులను మారుస్తాయని చాలామంది భావిస్తారు. కానీ అది కేవలం శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసేందుకే అలా చేస్తుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. దాని చర్మంలో ఉండే రెండు పొరల్లో ఉండే వేర్వేరు రంగుల పిగ్మెంట్స్‌వల్ల రంగుల మార్చుకోవడం సాధ్యమవుతోంది. మెదడు ఇచ్చే సంకేతాన్నిబట్టి అవి అలా రంగు మార్చుకుంటాయి. పాము కుబుసం విడిచినవిధంగా ఇవి కొన్నాళ్ల తరువాత శరీరాన్ని రాళ్లు, కొమ్మలకు రుద్ది పైపొరను వదిలించుకుంటాయి. ఒక్కోసారి అలా రాలిన చర్మాన్ని తినేస్తాయికూడా. వీటి కళ్లకు ప్రత్యేకత ఉంది. ప్రతి కన్ను 180 డిగ్రీల కోణంలో తిరుగుతూ దృశ్యాలను చూడగలుగుతుంది. అంటే రెండు కళ్లూ కలసి 360 డిగ్రీలకోణంలో చుట్టూరా ఏం జరుగుతోందో తెలుసుకోగలుగుతుంది. ఒకేసారి రెండు కళ్లూ వేర్వేరుగా, స్వతంత్రంగా వేటికవి పనిచేస్తూ పరిసరాలను గమనిస్తాయి. ఆహారాన్ని గుర్తించినపుడు మాత్రం రెండుకళ్లూ దానిపైనే దృష్టి సారించి నాలుకను విసిరి లాక్కుంటుంది. ఆహారాన్ని చేజిక్కించుకోవాలంటే, అది ఎంతదూరంలో ఉన్నదీ ఖచ్చితత్వం కావాలి కనుక రెండుకళ్లూ దానివైపే చూసి అంచనాకొస్తాయి. దాని నాలుక దాని శరీరం పొడవుకు రెట్టింపు సైజులో ఉంటుంది. కేవలం సెకనులో 3వంతు కాలంలో అది ఆహారాన్ని పట్టి తినేయగలిగేంత వేగంగా దాని నాలుక కదులుతుందంటే నమ్మాల్సిందే. కళ్లలోంచి, తలపై ఉండే కొమ్ముల్లోంచి రక్తాన్ని చిమ్మి శత్రువును ఏమార్చడం వీటికి తెలిసిన మరో విద్య. ఇది బల్లి జాతే అయినా తోక తెగితే మళ్లీ పెరగదు. వీటిలో అతిచిన్న ఊసరవెల్లి ఒకటిన్నర సెంటీమీటరుంటే (బ్రుకేసియా మైకా-మేల్), అతిపెద్దది 68.5 సెంటీమీటర్లుండే ఫర్టిఫెర్ ఔస్టాలెటి (మేల్).

ఎస్.కె.కె.రవళి