మీకు తెలుసా ?

స్కంక్స్‌కు భయం వేస్తే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షీరదమైన ఈ ‘స్కంక్స్’ మధ్య, ఉత్తర అమెరికాలో కన్పిస్తాయి. నలుపు, తెలుపు చారల బొచ్చుతో కన్పించే ఈ జీవులు రాబిస్‌ను వ్యాప్తి చేస్తాయి. మొక్కలు, కీటకాలను ఇష్టపడే వీటికి తేనెటీగలంటే చాలా ఇష్టం. అందుకే ఇవి ఒక్కోసారి తేనెపట్లపై దాడి చేస్తాయి. రెండునుంచి 15 అంగుళాల పరిమాణంలో ఉండే వీటికి భయం వేసినపుడు పృష్ట్భాగం శత్రువు ముఖంవైపు పెట్టి తోక ఎత్తి, కాళ్లతో నేలను తాకి భయపెడతాయి. అప్పటికీ శత్రువులు వెనక్కి తగ్గకపోతే దుర్గంధంతో కూడిన ఓ నూనెలాంటి ద్రావకాన్ని స్ప్రేలా విసర్జిస్తాయి. దాదాపు పది అడుగుల దూరంవరకు వేగంగా పిచికారీ చేసినట్లు వెదజల్లబడుతుంది. దీంతో శత్రువులు పరారవుతాయి. దీనిని వాసన చూస్తే రెండుమూడురోజుల పాటు వాటి ముక్కులు వాసన పసిగట్టే శక్తిని కోల్పోతాయి. ఒక్కోసారి అవి కరుస్తూంటాయి. గాయాలవల్ల ప్రమాదం లేకపోయినా రాబిస్‌ను వ్యాప్తి చేయడంవల్ల ప్రమాదం పొంచే ఉంటుంది.

ఎస్.కె.కె.రవళి