మీకు తెలుసా ?

ఇవి తొందరగా పండాలంటే ఇదీ చిట్కా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంట్రల్ మెక్సికోలో ఎక్కువగా, మరికొన్ని దేశాల్లో పెరిగే అవొకొడొ నిజానికి బెర్రీ రకానికి చెందిన ఓ ఫలం. వృక్షశాస్త్రం ప్రకారం ఫలమే అయినా చాలామంది దీనిని ‘వెజిటబుల్’గానే పరిగణిస్తారు. పండు మధ్యలో ఒకే పెద్ద విత్తనం, తెల్లని వెన్నలాంటి గుజ్జుతో ఉండే ఈ ఫలంలో ప్రొటీన్లు, పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండదు. బేకరీ పరిశ్రమలో వెన్నకు బదులు దీనినికూడా పెద్దఎత్తున వినియోగిస్తారు. ఐస్‌క్రీముల్లోనూ దీనికి ప్రాధాన్యం ఉంది. మనవాళ్లు దీనిని వెన్నపండు అని పిలుస్తారు. పియర్స్ పళ్ల మాదిరిగాను, వృత్తాకారంసహా పలు రూపాల్లో, ఆకుపచ్చ, ముదురు గోధుమ, తేలికపాటి నలుపు రంగుల్లో ఇవి కన్పిస్తాయి. అవొకొడో పళ్లు పూర్తిగా పండాలంటే బ్రౌన్‌పేపర్‌లో చుట్టి ఉంచొచ్చు. లేదా వాటిపక్కన ఓ అరటిపండో, యాపిల్ పండో పెడితే చాలు. త్వరగా పండిపోతుంది. అరటిపళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. అవొకొడొ పళ్లలో అంతకంటే రెట్టింపు సైజులో పొటాషియం ఉంటుంది.

ఎస్.కె.కె.రవళి