మీకు తెలుసా ?

పుట్టినప్పుడు తెల్లగా... ఆ తరువాత నల్లగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని పదిహేను దేశాల్లో మాత్రమే కన్పించే ఓల్డ్‌వరల్డ్ మంకీ విభాగానికి చెందిన ఈ కోతులను ‘కింగ్ కొలబొ మంకీస్’గా పిలుస్తారు. నైజిరియా, లైబీరియా, ఘనా, సియర్రాలియోన్, కెన్యా, కాంగో వంటి దేశాల్లో ఇవి ఎక్కువగా కన్పిస్తాయి. నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో కూడిన శరీర భాగాలతో ఇవి కన్పిస్తాయి. చెట్లపై తిరిగే ఇవి నేలపై అరుదుగా తిరుగుతాయి. చెట్లపై చిగుర్లు, పూలమొగ్గలను ఇవి తింటాయి. మిగతా కోతులకు భిన్నంగా వీటికి బొటనవేళ్లు ఉండకపోవడం విశేషం. పుట్టినప్పుడు తెల్లగా మెరిసిపోయే ఇవి క్రమంగా నల్లగా మారతాయి. దాదాపు ఏడాది వయస్సు వచ్చేసరికి అవి పూర్తిరూపం ధరిస్తాయి. తెల్లటి మీసాలు, ఛాతీతో ఇవి చూడముచ్చటగా ఉంటాయి. మిగతా జాతుల కోతులు తినలేని, వాటికి విషతుల్యమైన ఆకులను, పువ్వులను ఇవి తినగలగడం ప్రత్యేకత.

ఎస్.కె.కె.రవళి