మీకు తెలుసా ?

చిలుకముక్కు చేపలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ అందమైన చేపలను ‘పారట్ ఫిష్’ అని పిలుస్తారు. ముప్ఫై సెంటీమీటర్ల నుంచి మూడు అడుగుల పొడవు వరకు ఉండే ఈ పారట్ ఫిష్‌లకు వాటి రూపంవల్ల ఆ పేరు రాలేదు. వాటి నోటి నిర్మాణం వల్ల ఆ పేరు వచ్చింది. మిగతా చేపలకు భిన్నమైన రూపుతో వీటి నోటి నిర్మాణం ఉంటుంది. బలమైన, దృఢమైన పళ్లతో కూడిన ముందు దవడ వీటి స్పెషాలిటీ. రాతిపై ఉండే నాచు, కోరల్ రీఫ్స్‌లో మొక్కలను చీల్చి తినడానికి వీలుగా వీటి నోరు గట్టిపళ్లతోకూడి ఉంటుంది. చిలుకముక్కులా గట్టిగా ఉండే పళ్లవరస వల్ల వీటిని పారట్ ఫిష్‌లని పిలుస్తారు. దాదాపు 95 రకాలున్న ఈ చేపలు ఎక్కువగా ఇండోపసిఫిక్ సముద్రాల్లో కన్పిస్తాయి. మిగతా ప్రపంచంలోనూ ఇవి ఉన్నాయి.

ఎస్.కె.కె.రవళి