మీకు తెలుసా ?

ఎగురుతూనే నీళ్లు తాగే పక్షులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్నిరకాల పక్షులు ఎగురుతూ వెళ్లి నీళ్లలో ఆహారాన్ని అందిపుచ్చుకోవడం తెలుసు. కానీ ‘స్వాలో’ పక్షులు నీటి ఉపరితలంపై ఎగురుతూ దాహార్తిని తీర్చుకుంటాయి. అది వీటి ప్రత్యేకత. అందమైన రంగులు, విభిన్నమైన ఈకలతో కూడిన తోకలు వీటికి ప్రత్యేక ఆకర్షణ. ఆ విభిన్నతే వాటి ప్రాణాలకు ప్రమాదంగా పరిణమించింది. టోపీల తయారీలో వీటి ఈకలను వాడేందుకు ఈ పక్షులను వేటాడంవల్ల వాటి సంఖ్య తగ్గిపోతోంది. సెకండ్‌కు 11 మీటర్ల దూరాన్ని జిగ్‌జాగ్‌గా ఎగిరే ఈ పక్షులు వలస వెళ్లివస్తూంటాయి. వారం ముందుగా మగపక్షి, ఆ తరువాత ఆడపక్షి సొంత ప్రాంతానికి చేరుకోవడం మరో విశేషం. ఐస్‌లాండ్‌లో తప్ప యూరోప్‌లో చాలాచోట్ల వీటి ఉనికి ఉంది.

- ఎస్.కె.కె. రవళి