రాజమండ్రి

వసంతంలో గ్రీష్మం ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోరూరించే
మామిడి పిందెలూ!
విరబూసే వేప పూలు!
శృతి పేయంగా
కోకిలల కుహుకుహూ రావాలు...
ఇవన్నీ! ఒకప్పటి వసంత సంకేతాలు!
ఇప్పుడో!
కుటిల కులమత రాజకీయాలు
భూకబ్జాలూ! కాల్ మనీలూ!
ఇసుక మట్టి మాఫీయాలూ!
లక్షల కోట్ల అవినీతి భాగోతాలూ!
బడాదొరల
బ్యాంకు రుణాలు ఎగవేతలూ!
యాసిడ్ దాడులూ, భ్రూణహత్యలూ!
యూనివర్శిటీ రాజకీయాలూ!
ఇలా ఒక్కటేమిటి! అన్నిటా
గ్రీష్మమే గాని వసంతం మచ్చుకైనా లేదు
అందుకే పైన కర్మ సాక్షి కూడా
వసంతంలో గ్రీష్మాన్ని కురిపిస్తున్నాడు!
నిప్పులు చెరుగుతున్నాడు

- కసిరెడ్డి. టి.వి.ఎన్. సత్యనారాయణ
పెద్దాపురం, తూ.గో.జిల్లా
చరవాణి: 9494004349
***

మళ్లీ తరగతి గదికి...

చెట్టులా పచ్చగా
ఎదిగిన మనిషి
స్వార్థంతో పచ్చ కాగితాల
పరుగులో
అంతరంగంలో ఆశల అలలపై
కదలాడే ఎటిఎం ప్రయాణం
జీవితం కాగితాల మధ్యలో
రంగులు వెలిసిపోతుంటే
ఆత్మవిశ్వాసం సన్నగిల్లి
కొత్తకొత్త కోరికతో
బొమ్మగా మారి
డబ్బుకోసం, కీర్తికోసం
అవినీతికి బానిసై
తెరచాపలేని పడవలా
తేనెపూసిన కత్తిలా
కాలానికి పచ్చ కాగితాల వంతెన
నిర్మిస్తున్నాడు
ధన కలల వెంట పరుగులెడుతున్నాడు
మనిషిని మళ్లీ బడిలో వేయాలి
కొత్త నీతి అక్షరాలు దిద్దాలి
మళ్లీ తరగతి గదిలో
గతి తప్పిన బ్రతుకును సరిదిద్దుకోవాలి
మంచి అలవాట్లతో
గొప్ప లక్ష్యాలను సాధించి
సమాజానికి చైతన్యవంతమైన
చెట్టుగా నిలవాలి

- నల్లా నరసింహమూర్తి
అమలాపురం
చరవాణి: 9247577501
***

మేఘ సందేశం

చదువుకుంటూ, వ్రాసుకుంటూ
ఆలోచించుకొంటూ,
సంఘర్షించుకొంటూ
మా ఆయన

మడిలో, గుడిలో
పూజలో, వ్రతంలో
నోములో, నియమంలో
మా ఆవిడ

మా నాన్న, అమ్మ
సమాంతరాలు
వాళ్లని ఏకమార్గంలో
ప్రవేశపెట్టు తండ్రీ
మా బిడ్డ

లోకం తప్ప ఇల్లు తెలియని తండ్రి
ఇల్లు తప్ప లోకం తెలియని తల్లి
వాళ్లిద్దరూ తప్ప ఏమీ తెలియని బిడ్డ

- కె జనార్దనస్వామి
ముంగండ, పి గన్నవరం మండలం