రాజమండ్రి

చెరగని చరిత్ర సారం ‘సురపురం’ (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షర బద్ధం చేయడం ఒకటే చరిత్రకు

జీవమే కాదు. సంఘటనపై నిర్ణయాలు

ఆలోచనలకు ఊపిరిపోస్తాయి.

రాసుకున్నవి ‘చారిత్రక అంశాలు’

అయిపోవు గాని, చరిత్రను మలుపుతిప్పిన

విషయాలుగా సమాజంలో సజీవంగా

ఉంటాయి. భారతదేశం ప్రతిష్ట స్వాతంత్య్రం

అనంతరం పెరిగిందా? స్వాతంత్య్రానికి

పూర్వం కీర్తి దిగజారిందా? లాంటి

విషయాలు అసలేమి తెలియవు ఈనాటి

తరానికి. సులువుగా తెలిసింది ఒక్కటే.

బ్రిటీష్ పాలనలో మగ్గిపోయామని, మనల్ని

దోచుకున్నారని. అర్థం చేసుకునే

ప్రయత్నం చేస్తే.. బ్రిటీష్ పాలకుల్లో ఎందరో

మనకు ముఖ్యంగా తెలుగు వారికి

ఆనకట్టలు నిర్మించి కరువు కాటకాలు

దూరం చేసిన కాటన్, కళారంగంలోను

సృజనకారులను తయారు చేసిన కూల్డ్రే,

తెలుగు సాహిత్య విలువను పెంచేవిధంగా

కృషి చేసిన బ్రౌన్‌లు కనిపిస్తారు.

పీడకులుగా కన్నా ప్రేమికులుగా

అగుపిస్తారు. అంతటి కృషి చేశారు. మన

వాళ్లు మనకు చేయలేనంత ఎక్కువగా

నిస్వార్థంగా సేవ చేయడం చాలా గొప్ప

విషయం.
చిన్న చిన్న రాజ్యాలుగా సంస్థానాలుగా

చీలికలు, పీలికలతో రాజ్యకాంక్ష పదవీ

కాంక్షలతో వెన్నుపోటు రాజకీయాలతో

ప్రజల నడ్డి విరుస్తున్న కాలం భారతదేశం

ఒకటిగా రూపుదాల్చని కాలం.
చక్కని సంస్కరణలకు రాజనీతికి,

అభివృద్ధికి బాటలు వేసిన ఓ

మహాపురుషుని ఆత్మకథ ఎన్నో చారిత్రక

సత్యాలకు, నైతిక విలువలకు

సాక్షీభూతంగా నిలుస్తుంది. నిజాం

రాజ్యంలో అంకితమైన మెడోస్ టైలర్

రాసుకున్న జీవితగాధ ‘ది స్టోరీ ఆఫ్ మై

లైఫ్’ను ప్రసిద్ధ పాత్రికేయులు జి కృష్ణ గారు

‘సురపురం’ పేరుతో అనువదించారు.

నిజాంది మహ్మదీయ రాజ్యం. దానిలో

ప్రధాన భాగం తెలుగు మండలం గుల్బర్గా

అనబడు కలబరిగె మండలంలో సురపురం

సంస్థానంలో ప్రధానాధికారిగా టైలరు పని

చేశారు. అతని జీవితానికి, వ్యక్తిత్వానికి

జిలుగులు చేకూర్చింది సురపురం సంస్థాన

ఉద్యోగం. నిస్వార్థంగా నిష్పక్షపాతంగా

అధికారులు సేవలు చేస్తే ప్రజలు ఎంత

ఆదరిస్తారో అపూర్వంగా అభిమానిస్తారో

చదువుతుంటే గొప్ప అనుభూతి

కలుగుతుంది. పదిహేనేళ్ల వయసులో

భుక్తికోసం భారతదేశం వచ్చి ఇక్కడి

ప్రజలతో కలిసిపోయి చేయగలిగినంత

మంచిని చేసి ఎంతో అభిమానాన్ని

సంపాదించుకున్నవాడు టైలరు. తను

ఎంత ప్రేమించబడ్డాడో అంత మమతనూ

అందించాడు. అందుకే ఓ చక్కని మాటను

సందేశంగా ఆంగ్లేయులకు అందించాడు

భారతదేశ ప్రజలను ప్రేమించి పాలించమని.

విభజించి పాలించమన్న వాళ్లకు విరుగుడు

కదూ ఈమాట. చిన్న ప్రాయంలోనే పెద్ద

బాధ్యతలను మోస్తూ గొప్ప లక్షణాలను

పుణికి పుచ్చుకున్నాడు. పెద్ద చదువులు

చదివనప్పటికీ గ్రంధ అభిలాష కలిగి వివిధ

భాషలు నేర్చుకుని సాహిత్యాన్ని

సృష్టించాడు. భారతదేశ చరిత్రకు

సంబంధించిన సంఘటన ఆధారంగా చాంద్

బీబి, టిప్పు సుల్తాను మొదలైన నవలలు

రచించిన వాడు, తెలుగు చారిత్రాత్మక

నవలకు జీవం పోసిన చిలకమర్తి

లక్ష్మీనరసింహం లాంటి వారిపై టైలరు

ప్రభావం ఉన్నట్టు కన్పిస్తుంది.
ఇక సురపురంలో వారసత్వ పోరు,

అంతర్గత పోరు, కుట్రలు, కుతంత్రాలు

ఒకటేమిటి దొంగతనాలు దోపిడీలు

అరికట్టడంలో టైలరు తీసుకొన్న

సాహసోపేతమైన చర్యలు మనకు

కన్పిస్తాయి. రాణీవాసంలో జరిగే బాగోతాలు

రంకు పురాణాలు ఎండగట్టడం వంటి

చర్యలు కాస్త కటువుగా కన్పించినా వాటిని

నిరోధించటానికి చేసిన క్రియలు

అబ్బురపరుస్తున్నాయి.
టైలరు అనేక యుద్ధాల్లో పాల్గొని శత్రు

సంహారం చేశాడు. అనేక తిరుగుబాట్లను

అణచివేశాడు. మంచి వ్యూహకర్తే కాదు

ఉత్తేజపరుడు, ఉత్సాహకర్త. సైనికుల్లో

పరాక్రమ శక్తి సన్నగిల్లకుండా చూసేవాడు.

గోల్కొండ ప్రాంతంలో అతను చేసిన సాహస

చర్యలు మానసిక శక్తికి నిదర్శనమే

సైనికులు ‘మహాదేవ బాబాకీ’ జై అని

చేసిన నినాదాలే ఆయన శక్తియుక్తులకు

తార్కాణం.
మంచి చేస్తే చాలు ఎంత కృతజ్ఞులైపోతారో

చిన్న సహాయానికే

అభిమానపాత్రులైపోతారో సురపురంలోని

బేడర్లే నిదర్శనం. ఇచ్చి పుచ్చుకొనే ధోరణి

ఐక్యతకే కాదు అభివృద్ధికి తోడ్పాటు

అవుతుంది. వ్యవసాయం ద్వారా వచ్చే

పంటను మాత్రమే పంచుకొంటారు గాని

సంస్థానం ఇచ్చిన ఈనాము భూములు

పంచుకొనే పద్ధతి లేదు. టైలరు ఇచ్చిన

పెట్టుబడితో పుష్ప సుగంధ ద్రవ్యాలు,

ఇంగ్లీషు వస్త్ర వ్యాపారంలోకి ప్రవేశించడం ఓ

గొప్ప మార్పు. వారి మత ఆచారాలు,

పద్ధతులు, జీవన విధానం ఈలా

ఎన్నింటిలో లిఖించడం కనుమరుగు కాని

చరిత్రకు నిదర్శనం. భూములకు

సంబంధించిన రికార్డులు తయారు

చేయడం, సర్వే చేయడం ఆయన

కాలంలోనే జరిగింది. దగ్గరున్న వనరులతో

కొలతలు అవీ చేపట్టి నూతన

ఆవిష్కరణలకు నాంది పలికారు. రోడ్డు

నిర్మాణాలకు పునాది వేసి లింకు మార్గాలు

కలిపినది ఆయనే. న్యాయ పరిపాలనకు

హైకోర్టు ఉండాలనీ, భూమి శిస్తు

విధింపులో వసూళ్లలో కొత్త పద్ధతులు

అవలంబించాలని అనేక సూచనలు

చేసింది టైలరే. 1857లో సిపాయిల

తిరుగుబాటు మీద ఆయనో వ్యాఖ్య

రాశాడు. నేను ఆనాటి చరిత్ర రాయడం

లేదు, అప్పటి నా పరిస్థితులు

వివరిస్తున్నానంటారు. 1857-58లో జరిగిన

‘ప్లాసీ’ యుద్ధ సమయంలో వెలువడిన

జోస్యం ఎంతగా నిజమయిందీ! కంపెనీ

వారు వంద ఏండ్ల కన్నా పాలించరని

అప్పుడు జోస్యం చెప్పుకొన్నారట! 1857 - 58

కంపెనీ పరిపాలనకు ఆఖరి సంవత్సరం

అని రాశారు.
సురపురం సంస్థానంలోని భోగ లాలస,

మహారాణి, రాజపుత్రుడు ఎలా వరస తప్పి

భ్రష్టులయ్యారో ఆనాటి రాజ్యాలు రాజుల

పతనం ఇందులో స్పష్టంగా కన్పిస్తుంది.

అయితే వీలైనన్ని సంస్కరణలు అభివృద్ధి

ప్రజల సంక్షేమం పట్లే కాక వినోద

విహారాలకు చక్కని ప్రణాళికలు వేసి

ఆహ్లాద పరచిన విషయాలు కన్పిస్తాయి.

రైతులను పండితులను

రాజకుటుంబీకులను ఎలా గౌరవించి

ఆదరించిన పాశ్చాత్యుణ్ణి చూస్తాం. దేశ

సంప్రదాయాలను సంస్కృతిని అంతగా

అర్థం చేసుకోవడం వల్ల ఇది సాధ్యమైంది.

ఆయనలో విభిన్న కోణాలు కన్పిస్తాయి.

వేటలో ఎంత ఆనందిస్తారో చిత్రలేఖనం

చేస్తూ ప్రకృతిని అంత ఆహ్లాదించటం

కన్పిస్తుంది. కాస్త ఓపికతో 18 అధ్యాయాల్ని

చదివితే చరిత్ర గతి తెలుస్తుంది. వివిధ

పత్రికలకు ఆయన రాసిన వ్యాసాలన్నీ

గమనించవచ్చు. తన కుమార్తె పెళ్లి

చేసుకొని హైదరాబాద్‌లో ఉండిన

విషయాలు చివర అధ్యాయంలో

తెలుస్తాయి. ముప్పయి ఆరేళ్లు భారతీయ

బంధంతో పెనవేసుకున్న తెలుగు వారి

జీవన స్థితులు జీవిత విశేషాలు

కన్పిస్తాయి.
ప్రతులకు
విశాలాంధ్ర, నవోదయ,
ఎమ్మెస్కో బ్రాంచీలు
వెల రూ.100, పేజీలు 161

- రవికాంత్, సెల్: 9642489244