రాజమండ్రి

వేమన, కబీరుల సామాజిక దృక్పథం (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్త: డా. ఎస్వీ రాఘవేంద్రరావు
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
నవోదయ బుక్ హౌస్
శ్రీమతి ఎస్ కామేశ్వరి
సుమశ్రీ నివాస్, ఇం.నెం.ఎంఐజి. 59
ఎపిహెచ్‌ఒ కాలనీ, లాలాచెరువు
రాజమహేంద్రవరం-6
**
ఇప్పుడేమోకానీ ప్రస్తుతం డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు గారు ‘కవికుల తిలకు’లు. హిందీ భాషా పండితులు ఆచార్య జోస్యుల సూర్యప్రకాశరావు, హిందీ అష్టావధాని డాక్టర్ చేబోలు శేషగిరిరావు, శ్రీ పసల భీమన్న, శ్రీ ఎస్‌పి గంగిరెడ్డి గార్ల ఆమోదం, ఆశీర్వాదం లభించిన గ్రంథం ఇది. 1972 నుంచే డాక్టర్ ఎస్వీ గారు కబీరు దోహాలను ఆటవెలదుల్లో అనువదించడం ప్రారంభించారు. అది బీజం. బీజ రూపంలో ఉన్న సాధన యత్నాన్ని సాక్షాత్తు ‘కళా ప్రపూర్ణ’ డాక్టర్ మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీగారికి చూపించి, వారి ప్రోత్సాహాశీస్సులను పొందారు. రచయిత ఇటు తెలుగులోనూ అటు హిందీలోనూ పాండిత్యాన్ని సముపార్జించుకున్న వారు గనుక సహజంగానే కబీరు, వేమన్నల హృదయాలను పట్టుకోగలిగారు. 1986 నాటికి ఒక నాటి విత్తు మొలకెత్తి మొగ్గ తొడిగింది. దాన్ని ఊతంగా తీసుకొని ‘వేమన కబీరుల సామాజిక దృక్పథం’ అంశం మీద ఎంఫిల్ చేశారు. ఆ విద్వత్తుతో రచయిత ‘వేమన కబీరుల భావసామ్యాలు’, ‘కులమత మూఢ విశ్వాసాలు - వేమన కబీరులు’ గురించి విపులంగా చర్చించ గలిగారు. ఇదే అంశం మీద మరింత పరిశోధన జరిపి డాక్టరేట్ సాధించాలుకున్నా ఈశ్వరేచ్ఛ మరొకలా ఉండడం చేత ‘దక్షారామక్షేత్ర సాహిత్యం’పై పిహెచ్‌డి చేయాల్సి వచ్చింది. అదంతా అలా ఉంచితే నాలుగు భాషా సాహిత్యాలను అధ్యయనం చేసి, మాతృభాషలోకి అనువదించ గలగడం వేరు. ‘వేమన - కబీరుల సామాజిక దృక్పథం - తులనాత్మక పరిశీలన’ పరిశోధన గ్రంథంతో సరిపుచ్చుకోకుండా వేర్వేరు భాషలకు చెందిన ఇద్దరి సాహితీ వ్యక్తిత్వాలను వివిధ కోణాల్లో పోల్చి నిరూపించడం రచయిత నిరుపమాన కృషికి తార్కాణం. కబీరు, వేమన్నలు నాస్తిక వాదులు కారు. ఈశ్వరత్వాన్నీ, బ్రహ్మనూ అంగీకరిస్తూనే వారి కాలాల్లో నెలకొనివున్న మత వ్ఢ్యౌలను ధైర్యంగా ఎత్తిచూపి సామాజిక సంస్కర్తలుగా మిగిలిపోయారు.
కబీరు 14వ శతాబ్దం వాడు. వేమన 17వ శతాబ్దికి చెందినవాడు. కాబట్టి కబీరు ప్రభావం వేమన మీద పడి ఉంటుందని అనడానికి సందేహించనవసరం లేదు. వేమన మీదనే కాదు, 19వ శాతాబ్ది పూర్వార్థానికి చెందిన ఒడియా గిరిజనుడు మహిమాస్వామి మీదనూ ఒడియా అతీంద్రియ సిద్ధాంత ప్రచార కవి, గుప్తజ్ఞాన నిధి అయిన భీమబాయి మీద కూడా కబీరు ప్రభావం ఉందనాలి! కేవలం ఉపాధి నిమిత్తం, పదోన్నతి కోసం స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ రోజుల్లో చాలా మంది డాక్టరేట్లు సాధిస్తున్నారు.
ఈ గ్రంథంలో రచయిత తను ప్రతిపాదించ దలచిన ప్రస్తావనను 8 భాగాలుగా వింగడించుకొన్నారు. 1. కాల, 2. దేశ, 3. జీవిత చక్రాలలో వేమన కబీరులు, 4. కుల మత మూఢ విశ్వాసాలు - వేమన కబీరులు, 5. ప్రజా కవులుగా, 6. వేమన కబీరులుగా వారి వారి భావ సారూప్యతలు, 7. ఇతర కవుల మీద వేమన్న ప్రభావం, 8. తెలుగు సాహిత్యంలో వేమనకు గల స్థానం. ఇలా...
యథార్థం చెప్పాల్సి వస్తే కబీరు ప్రభావం ఉత్తర భారతంలో ఉన్నంతగా, భీమ బొయి ఒడియా గ్రామీణులను ప్రభావితం చేసినంతగా వేమన్న ప్రభావం తెలుగు సమాజం మీద లేదు. శ్రీ ఎస్పీ గంగిరెడ్డి గారన్నట్టు ‘వేమన - కబీరుల పద్యాలను చదవని వారెవరైనా ఈ గ్రంథాన్ని చదివినట్టయితే వెంటనే వారి వారి పద్యాలను చదవాలనే ఉత్కంఠ కలుగుతుంది. 4వ అధ్యాయంలో వివిధ విషయాలపై వేమన కబీరుల భావాలు విడివిడిగా కాకుండా ఒక విషయాన్ని తీసుకుని ఇరువురి భావాలు పక్క పక్కనే వివరిస్తే ఇంకా బాగుండేది అన్న విషయం గమనించాల్సిన అంశం. ఒక్కొక్క చోట కబీరు దోహాలకు స్వేచ్ఛానువాదం భావానువాదం చేయడం వలన కబీరు హృదయాన్ని సరాసరి తెలుగు వారికి సరిగా అందించలేదనిపిస్తుంది. దానికి కారణం - కవిత్వాన్ని కవిత్వంగా అనువదించడం కష్టసాధ్యం. విజ్ఞలైన పాఠకులు అర్థం చేసుకోగలరు. ఏమైనా రచయిత యత్నం ఒక యజ్ఞంలా సాగింది. యజ్ఞంలా ఎప్పుడూ సమాజ హితానే్న కోరుతుంది! స్వస్తి.

***
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- మ. రా. శాస్ర్తీ, సెల్: 7702450157