నెల్లూరు

ఓ కవీ! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ కవీ..నువ్వు ధన్యజీవివి
నీ భావాలను సొగసైన రెక్కలుగా చేసుకుని
సాహిత్యమనే ఆకాశంలో ఎగరగలవు
అంచులూ చూడగలవు.
నీ భావాలను
బలమైన చేతులుగా మార్చుకుని
సాహిత్యమనే సముద్రంలో ఈదగలవు
లోతులూ చేరగలవు
నీ భావాలను ముచ్చటైన లిపిగా మార్చుకుని
అందమయిన ఈ సృష్టినే చూపగలవు
అందరినీ అలరించగలవు.
ఓ కవీ! నీ కలం
ఆ విద్యాదేవి హస్తాన విరిసిన కమలం
అది వెదజల్లే కవితాక్షరాలు అతి కోమలం
సాహిత్యమనే క్షేత్రాన్ని చేస్తుంది సస్యశ్యామలం
అణగారిన బడుగు వర్గాలకు
ఇస్తుంది కొండంత బలం
అవినీతి హద్దు మీరితే
చిందిస్తుంది హాలాహలం

- దామెర్ల గీత, కల్లూరుపల్లి
**

సాహితీ స్రవంతి అద్దేపల్లి

ఆ పల్లి అద్దదే కాని అది అందరి సొంతం
ఆ పల్లి సంగీత సాహిత్య సద్విమర్శల త్రివేణి సంగమం
అదెక్కడో కాదు, బందరు పక్కన సుందర
రాజేశ్వరమ్మల సరాగాల స్వప్న సాకారాల సమున్నత సముద్భవం
కాకినాడ కంఠసీమ కాంతులీను ‘అభిరామ మోహనం’
చాలుచాలుకు అక్షరాలు నాటి గంపలకొది కవిత్వాన్ని
గాదెలకెత్తి కవికుమారుల కడుపులు నింపిన కన్న తల్లి
చెంత చేరిన కవితా పిపాసకులకు చెంబులకొద్ది
సాహితీ సుధలిచ్చి దప్పిక తీర్చిన కళామతల్లి
సాహితీ గగనాన అభ్యుదయ వేగుచక్కలా
మెరుసపుల వెలుగులతో చీకట్లన చీల్చిన దీపావళి
భాష్యంలో వ్యాసునిలా, విశిష్టతలో వశిష్టునిలా
విమర్శలో సమదర్శిలా, గజళ్లగానంలో కరిగిన బాల్యంలా
విశ్వవేదికపై ఎలుగెత్తి పాడే జానపద గీతంలా
పరిమళ భరిత పారిజాత సుమదళాల వనంలా
ప్రజ్ఞాపాటవాలను ప్రపంచానికి పంచిన విజ్ఞానవల్లి
శ్రీశ్రీ, కుందుర్తి, తిలక్ లాంటి వటవృక్షాల వరుసలో
తరతరాల యువతరాన్ని ఊయలలూపిన ఊడలమర్రి
మధుజ్వాల, అంతర్జ్వాల, రససంధ్యల భావాల లావాతో
సాహితీ లోకాలను రగిలించిన అగ్గిపుల్ల ఆ పల్లి
ఆకుపచ్చని సజీవ సముద్రం, కాలం మీది సంతకాల విలోకనం
సంఘం శరణం గచ్ఛామీల ద్వారా కాలంతో కలిసి అడుగేసింది ఆ పల్లి
వరల్డ్ పీస్ అవార్డు, తిలక్ పురస్కారాది రివార్డులే కాదు
సంచార కవితా సారధి, సాహితీ విహారి బిరుదాంకితులు ఆ పల్లి
ప్రగతిశీల బాటలో, నిత్యచైతన్యశాలిగా నిశాంత ప్రశాంతితో
సాగర సంగమానికి సాగిపోయిన సాహితీ స్రవంతి శ్రీ అద్దేపల్లి..

(సెప్టెంబర్ 6వ తేదీ
అద్దేపల్లి జయంతి సందర్భంగా)
- పిడుగు పాపిరెడ్డి, కనిగిరి, చరవాణి : 9490227114