నెల్లూరు

ప్రజలు మార్పు కోరుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్,మార్చి 20: 2019లో కేంద్రంలోని ఎన్‌డీఏ తోను రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాలతో ప్రజలు విసుగు చెందారని మార్పును కోరుకుంటున్నారని రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ ధ్యేయమని,2019లో కేంద్రంలోను,రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే ధ్యేయంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పని చేయాలని ఏఐసీసీ సభ్యులు బూడిద బిక్షమయ్యగౌడ్ అన్నారు.మంగళవారం పట్టణంలోని కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసి సమావేశంలో బూడిద బిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ ఆలేరు నియోజక వర్గం ప్రజల ఆశిర్వాదంతోనే తను ఈ స్థాయికి ఎదిగానని ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు.కాంగ్రేస్ పార్టీ పేదల పార్టీ అని కాంగ్రేస్‌తోనే దేశం సుభిక్షంగా ఉంటుందని,కుల మతాలకతీతంగా ప్రజలుకు సేవ చేయడమే కాంగ్రేస్ పార్టీ ద్యేయమని, రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తుందని ప్రజాస్వామ్యం మంటగలుసుందని,కుటుంబ పాలనకు చెరమ గీతం పాడాలని అన్నారు. ప్రధాని మోదీ పెట్టుబడుదారులకు అనుకూలంగా పనిచేస్తన్నారని పేద ప్రజలను,రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని,యువత నైరాష్యంలో ఉన్నారని అన్నారు. ధనిక రాష్టమ్రైన తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీ ఆర్‌దేనని అన్నారు.కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రక్కన బెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని తగిన సమయంలో ప్రజలు బుద్ది చెప్పేందుకు చూస్తున్నారని 2019లో రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టి అధికారంలోకి వస్తుందని అన్నారు.కాంగ్రేస్ మండల పార్టీ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిక్షమయ్యగౌడ్‌ను ఆలేరు నియోజకవర్గంలో అత్యదిక మొజారీటీతో గెలిపించాలని,జిల్లాలో మంత్రి అయ్యి ప్రజలకు న్యాయం చేస్తాని అన్నారు. ఏ ఐ సీసీ సభ్యులుగా నియమితులైన బిక్షమయ్యగౌడ్‌ను కాంగ్రేస్ పార్టీ నాయకులు గజమాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా ఇంచార్జీ గుడ్లవరలక్ష్మీ,పెలిమెల్లి శ్రీ్ధర్‌గౌడ్,గుండ్లపల్లి భరత్‌గౌడ్,సుగునాకర్,గుండ్లపల్లి నర్సింహ్మ తదితరులు కాంగ్రెస్ నాయకులు,సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

ఏఐసీసీ కో ఆప్షన్ మెంబర్‌గా ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి
నల్లగొండ, మార్చి 20: నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏఐసీసీ కో ఆప్షన్ మెంబర్‌గా ఎంపికయ్యారు. ఆయన ఎంపిక పట్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. ఏఐసీసీ ప్లీనరీ సందర్భంగా జిల్లాకు చెందిన డీసీసీ అధ్యక్షులు బూడిద బిక్షమయ్యగౌడ్, తుంగతుర్తి ఇన్‌చార్జి అద్దంకి దయాకర్, రాంరెడ్డి నరోత్తమ్‌రెడ్డిలు ఏఐసీసీ సభ్యులుగా ఎంపిక కావడం జరిగింది. తాజాగా కో ఆప్షన్ సభ్యుడిగా రాజగోపాల్‌రెడ్డి ఎంపికవడం జిల్లా కాంగ్రెస్‌కు ఏఐసీసీలో సముచిత స్థానం దక్కినట్లయ్యింది.
యాదాద్రి క్షేత్ర పాలకుడికి ఘనంగా ఆకు పూజోత్సవం
యాదగిరిగుట్ట, మార్చి 20: యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో కొనసాగింది. నిత్య పూజలు, విశేష పూజలు, నిత్య కల్యాణోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయుడికి మంగళవారం సందర్భంగా ఆకుపూజ నిర్వహించారు. కొండపై ఈవో గీత ఆధ్వర్యంలో సిబ్బంది స్వచ్ఛ్భారత్ కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం ఒక రోజు హుండీ ఆదాయం 7లక్షల 82,908రూపాయలుగా వచ్చిందని ఈవో గీత తెలిపారు.