విశాఖపట్నం

వెలుగు దివ్వెలు విజ్ఞానపు రవ్వలను రాల్చే చింతా రమణ పాటల సంపుటి (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవి, ఉపాధ్యాయుడు ఒక్కడే అయితే అతని రచనా సంవిధానం, పామర రంజకంగా, విద్యార్థులకానందదాయకంగా ఉంటుంది. పాటైనా, కవితైనా సామాజిక స్పృహ ఉంటే అది నలుగురి నాల్కలపైన నాటుతుంది. సభల్లో కవితా పుష్పాలనందిస్తుంది.
అలాంటి రచనల కోవకు చెందినదే మిత్రుడు చింత రమణ రాసిన వెలుగు దివ్వెలు. పిల్లలనే ప్రతీకగా తీసుకొని రాసిన కవితలు కొన్నైతే, సామాజిక అన్యాయానె్నదిరించేవి కొన్ని. దేశభక్తిని తెలిపేవి కొన్నైతే పండుగల ప్రాధాన్యతను తెలిపేవి మరికొన్ని.
పిల్లలం, మేం పిల్లలం
తొలకరి చినుకుల జల్లులం!
వచ్చీరాని మాటలతో
ముచ్చట గొలిపే మువ్వలం!
ఇది శీర్షికా ప్రకటిత గేయం. పిల్లలు ఇందులో మల్లెలౌతారు. పువ్వులౌతారు. నవ్వులౌతారు. మువ్వలౌతారు.
సత్యాగ్రహమే నీ ఆయుధం
సత్య అహింసలే నీ పథం
నిరాడంబరతకే నీవు నిలువుటద్దం!
నిరాయుధుడవై చేస్తావు యుద్ధం!
మాత్ర చంధోబద్ధంగా, బరువైన అంత్యప్రాసతో నిబద్ధతగా రమణ గలగలలా పారుతూ, అందులో మనల్ని తడుపుతూ పోతాడు.
మధురమైన ఫలాలిచ్చు తరువు కదా గురువు
శుద్ధమైన జలాన్నిచ్చు మందాకిని గురువవు
ఆదరించి అమ్మవలే ఆప్యాయత పంచ గురువు
తండ్రివలే నీ బాధ్యత పంచుకొనును గురువు.
తనువునిచ్చింది తల్లిదండ్రులైతే, జ్ఞాన ధనము నిచ్చింది గురువే. ఇంకా ఈ సంపుటిలో బాలలు ఊయల నెక్కి గేయాలు పాడుకొంటారు. స్నేహం గా మెలగాలని కోరుకుంటారు. సంక్రాంతి పండగను చేసుకుంటారు. ఏదీ ఆ ఉగాది? అంటూ ప్రశ్నిస్తాడు. నవచైతన్యం కావాలని ఆక్రోశిస్తాడు. చింత తీరాలని ఉషస్సు రావాలని కోరుకుంటున్న ఈ కవిమిత్రుని కలం నండి మరిన్ని కవితా సంపుటాలు రావాలని కోరుకుందాం.
***

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- కిలపర్తి దాలినాయుడు, సెల్ : 949176326.