నెల్లూరు

మూఢనమ్మకాలపై అక్షర శరాలు ‘లోకాయత శతకం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సమాజంలో నాలుగు మంచిమాటలు చెప్పేవారే కరవయ్యారు. తమ రచనా చమత్కృతితో నాలుగు మంచి మాటలు చెప్పి సమాజాన్ని ఉత్తేజితులను చేయాలనే సంకల్పం కలవారు బహు అరుదు. అటువంటి వారిలో రాచపాళెం రఘు ఒకరు.
రాచపాలెం రఘు పరిచయం అక్కర్లేని పేరు. సమాజంలో రుగ్మతలనే వస్తువుగా తీసుకుని రచనలు సాగించిన సృజనశీలి. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కోనేటి రాజుపాళెంలో జన్మించిన రఘు పోస్టుగ్రాడ్యుయేషన్‌తోపాటు బిఎల్, ఎంఫిల్ చేసి కార్మిక శాఖ ఉప కమీషనర్‌గా పనిచేస్తున్నారు. కార్మికశాఖలో కమిషనర్ హోదాలో పనిచేస్తున్నా సాహిత్యంపై మక్కువతో విశేష ఆలోచనా పరంపర ఆయన్ని రచనా ప్రక్రియవైపు దారిమళ్లించాయి. కారల్‌మార్క్స్ రచనలతో ప్రేరేపితుడై, అభ్యుదయ భావాల పుట్టగా ఉన్న రఘు ఇప్పటికే నానీలు, పేరడీలు వంటి ఎనిమిది పుస్తకాలు వెలువరించారు. ఇవికాకుండా రఘకు అనేక పురస్కారాలు వెతుక్కుంటూ వచ్చి అలరించాయి.
లోకాయత శతకం అనే పేరుతో లోకంలో అన్ని అంశాలను స్పృశిస్తూ మూఢనమ్మకాలపై వాడైన అక్షర శరాలు సంధిస్తూ రఘు ఖండిక సృజించారు. రాచపాళెం మాట రతనాల మూట అనే మకుటంతో నిఖార్సయిన హేతువాది అయిన రఘు వంద పద్యాలను ఖండిక రూపంలో అక్షర బద్ధం చేశారు. అటు వచన కవిత్వం కాని, ఇటు పద్యం రూపంలోకాని లేని నాలుగుపాదాలు కల ఖండిక ఒక మకుటంతో జత కలిపి రసప్లావితంగా శబ్ధసౌందర్యంతో నిండి ఉంది. పేజీకో ఖండిక దానికింద ఒక అర్ధవంతమైన చిత్రం ఈ పుస్తకానికి వనె్నతెచ్చింది. మూఢ నమ్మకాలను మధించి/ముత్యాలు రత్నాలు పేర్చినాను/ఏరుకొనుట విజ్ఞులకు వదిలినాను/ రాచపాళెం మాట రతనాల్‌మూట అంటూ శతకాన్ని ముగించారు. కారల్‌మార్క్స్ ప్రేరణతో సాహితీ సేద్యం చేస్తున్న రఘు తన లోకాయత శతకాన్ని మార్క్స్ సతీమణి జెన్నీమార్క్స్‌కు అంకితం చేయడం గురుదక్షిణ అనచ్చేమో. సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలు, విశ్వాసాలను తర్కిస్తూ ఆవేశపడడం కన్నా ఆలోచించమని తన అభిప్రాయాన్ని విజ్ఞులముందుంచారు. తాను నమ్మిన హేతువాద సిద్ధాంతాన్ని గొప్పగా చూపుతూ, నచ్చని ఆధ్యాత్మిక, దైవ అంశాలన్ని విమర్శిస్తూ లోకాయత శతకంలో అక్షర యజ్ఞం సాగించారు.
ఆలయంలో దొంగలు పడి విగ్రహాలు అపహరణకు గురైన అంశంపై రచయిత అక్షర శర సంధానం ఇలా ఉంది
సర్వాంతర్యామి సామి వుంటే/సామిశిలలు చౌర్యమందుటేల?/సామి రక్షకు రక్షక భటులేల?
మరో పుటలో సర్వసముడగు దేముడుంటే/కొందరికి పన్నీరు ఎందుకు?/ ఎందరికో కన్నీరు ఎందుకు?
మరోచోట అన్నపూర్ణేశ్వరీ అఖిలాండేశ్వరీ/ అంతటా అవతరించి ఉంటే/అందరి ఆకలి మంటలు ఆర్చదేల? అని
మానవతుల మాన చోరుడు/గోకుల గొల్లభామల మరుడు/ పాపాల గోపాలుడు గోవిందుడెట్లు?
అయోధ్యరాముడు ధర్మప్రభువైతే/ఆదిమజాతి ఆడది తాటకిని/హతమార్చుట ఏపాటి ధర్మంబు?
ధర్మసతిని అగ్నిపరీక్ష నిల్పినోడు/గర్భవతిని కానలంపిన కఠినాత్ముడు/ దశరథాత్మజుడు దయామయుడెట్లు?
కలడు కలడని కల్లబొల్లికబురులు/ ఎనె్నన్నో ఎందుకు? ఎన్నడనయినా/ పేదరికం పారద్రోలినాడా?
అని దేవుడు లేడని చెప్పే ప్రయత్నం చేశారు.

- గౌతమి
9347109377
***

మనోగీతికలు

నోటు - పోటు

పురిటినొప్పులు - పుట్టినరోజులు
పెళ్లిళ్లు, ముహుర్తాలు, తాంబూలాలు
విందులు, వినోదాలు, ఆనందాలు, ఆర్భాటాలు
దిగవంత దినాలు - గడవాల్సిన దినాలు
అన్ని ఎక్కడివక్కడ స్తంభించిన రోజులు
మనసు ఆందోళనతో బేజారైన క్షణాలు
దాచిన సొమ్ము, దోచుకొన్న సొమ్ములు
‘నోటు’చాటున జరగాల్సిన దినచర్యలు
ఆగిపోయి, ఎటిఎంలు మొరాయించిన క్షణాలు
గంటల్లో అతలాకుతలమైన బతుకులు..
నోట్లు మూగనోము పట్టిన ‘‘జీవన చిత్రాలు’’

దేవస్థానాలు, తీర్థయాత్రలు
బస్టాండ్లు, సినిమాహాళ్లు
మార్కెట్లు - కిరాణాషాపులు
బంగారం కొట్లు - కొనుగోలైన ప్లాట్లు,
హోమ్‌నీడ్స్,
హాస్పిటళ్లు - సెల్‌షాపులు, కార్పొరేట్ సంస్థలు
మిఠాయిలు, టీలు, కార్ఖానాలు
దిగులుగా దిగులుగా నిలిచిన వ్యాపారాలు
రాత్రికిరాత్రే తీరందాటిన తుఫానులు
జన జీవితంలో తాకిందొక ‘నోటు పోటు’
కరెన్సీ నోట్లలో తుఫాను,
కాఫీ కప్పులో చేదుగుళిక
నోట్లు తెచ్చాయి పలుపాట్లు.

బడా వ్యాపారస్థులు, నల్లధనపు కుబేరులు
వడ్డీ జలగలు, బటాచోర్‌లు, కాల్‌మనీ సెంటర్లు
ఉగ్రవాదులు, అసాంఘికవాదులు,
పెద్దమనుషులు ఉలిక్కిపడి తమ ఖజానాల తాళాలు తీస్తున్నారు
అడక్కుండానే అప్పులుదీరుస్తామనే లౌకికులు
పాత బకాయిలు, వడ్డీ వసూళు కాని సొమ్ములు
రియల్ ఎస్టేట్స్‌లో పండిన అప్పణపు పంటలు
ప్రభుత్వ సంస్థల్లో తీసుకొన్న ఋణాలు
కట్టలపాములై జడిపిస్తున్నాయి
స్కాముల స్వాములు హఠాత్ సంఘటనపై
పళ్లునూరుతున్నారు
ప్రతిపక్షాలు అసాంఘికం,
అప్రజాస్వామ్యమంటూ
శాపనార్థాలు పెడుతున్నారు
మనిషి చేసిన కాగితాలు (కరెన్సీ)
ఎంత సంచలనం సృష్టించాయో
మనుషుల్ని, వారి బతుకుల్ని శాసించాయి
దానితోనే ‘శ్వాసించే’ మనుషులను పెంచాయి
సన్యాసం తీసుకున్న స్వాములైన
జనాల డబ్బులు దోచుకొనే ఆసాములైనా
రాజీనామాలు చేసిన మాజీలైనా
‘లౌక్యం’ ప్రదర్శించిన అధికారులైనా
విలువలు అమ్మిన తులువలైనా
చట్టం, తెలివి, అవసరాలను అడ్డంగా
వాడేసే ధూర్తులనైనా
దళారీలైనా చేతివాటం గాడులనైనా
‘కట్ల’పాము కాటేసింది - దిమ్మదిరిగింది
కట్లుదెంచిన వృషభంలా
తొందరగా ‘వైట్’గా మారాలనే తపనతో
మనిషిని క్షణం నిలువనీయకుండా
మారధాన్ పరుగుకు పంపింది
గుండెల్లో రైళ్లు, మనసుల్లో గుబుళ్లు
రేపేం జరుగుతుందనే ఆందోళనలు
‘సగటుమనిషి’ని బజారుకెక్కించింది

జనమే జయుడి సర్పయాగంలా
నకిలీనోట్ల పాములు
నోట్లయజ్ఞ గుండంలో పడి
మాడిమసైబోతున్నాయి
గుండెల్లో కోపం లావాలా ఉడుకుతుంది
అది ఎప్పుడు విస్ఫోటం చెంది అమాయకులను తడుపుతుందో
ఎవరిని ఎలా బలితీస్తుందో తెలియని వైనం
అచ్చుయంత్రాలు అత్యంత ఉత్సాహం
చూపుతున్నాయి
గంటలు, రోజులు, వారాలు సాగిపోతున్నాయి
బ్యాంక్‌లు, లావాదేవీలు, చేతులు మారకాలతో
ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి
చంద్రమతి మాంగల్యంలా కనబడకుండా
బినామీల పని జరుగుతున్నాయి
నోటుచేసిన మాయాజలంతో అందరం
దిమ్మదిరగాల్సిందే
నోటుచేసిన శరాఘాతం వేటుకి
సామాన్య జనంపడే పాట్లు
‘‘ఆపై వాడికే’’ తెలియాలి
సెల్ఫీ తీసుకొంటూ నీళ్లల్లో పడ్డట్లు
సందట్లో సడేమియాలాగా అమెరికాలో
హిల్లరీపోయి ట్రంపు విజయపతాకమెగరేసినట్లు
ఇవన్నీ చాలనట్లు ఉప్పులో నిప్పు
నిన్నటిదాకా ఉల్లిలో మాడి, నూనెల్లో కాగి, పప్పుల్లో వేగిన వారిపై
అకాలపు కరువుకాటకాలు - ఆశనిపాతాలు
మెరుపులే లేని పిడుగులు
నోట్లు చేసిన పాట్లు.

- లక్కరాజు శ్రీనివాసరావు
ఆర్టీసీకాలనీ, అద్దంకి. చరవాణి : 9849166951
**

చురక

పిల్లల చేతిన ట్యాబ్‌లు
షాపింగ్‌లకు కార్లు
ఆర్భాటపు పరిచయాలు
విచ్చలవిడి పార్టీలు
నల్లకుభేరుల మంచినీళ్లప్రాయ ఖర్చులు..!
శాంతి కపోతానికి ధాన్యం తిండి
ఓటుహక్కుకు నోట్ల గండి
ధర్మంగా నడిచే దేశానికి
ఈ కర్మ ఏలరా?
అనుకుంటుండగా...
అలనాడు నరేంద్రుని ప్రసంగాలు
విదేశాల జైభారత్ నినాదాలు
ఈనాటి నరేంద్రుని ప్రసంగాలు
స్వదేశ అభివృద్ధికి ఆనవాళ్లు
తల్లికోసం తండ్రిపైకే యుద్ధానికి వెళ్లెను గణపతి
భవిష్యత్తు కోసం నల్లకుభేరులపై యుద్ధశంఖారావం సలిపెను కాషాయ దళపతి
ఆబాట పూబాట.. భావి తరాలకు వజ్రాల మూట
కానీ...
మేకవనె్న పులులు... పులితోలు కప్పుకున్న గుంటనక్కలు
తస్మాత్ జాగ్రత్త...
మోడీగారి నోట్ల రద్దు మెలిక
నల్లకుభేరుల గుండెల్లో చురక
పొలంఉండి దున్నుకోలేని అరక
చివరిగా...
ఈ చురక... అవినీతికి చురకే...!

యర్రాబత్తిన మునీంద్ర
నాయుడుపేట, 8331844527
**

పరిశ్రమించు

ఆకాశాన్ని చూడు
ప్రతిదినం పగలు-రాత్రికై పయనిస్తుంది
అలుపు లేకుండా..
చీమల్ని చూడు
ఎంత చిన్నవైనా తమ లక్ష్యం కోసం పయనిస్తాయి
ఎప్పుడైనా..
రైతును చూడు కఠోర శ్రమ చేస్తాడు
ఫలితం చూడకుండా..
జవాన్‌ను చూడు ప్రాణం ఫణంగా
పెడతాడు దేశం కోసం..
సాలీడు చూడు గూడు అల్లుతూనే ఉంటుంది
ఫలితం చూడకుండ..
తేనేటీగలు చూడు ప్రతి సెకను తేనే
సేకరిస్తూనే ఉంటాయి..
మరి ఆపాటి శ్రమ లేకపోతే
ఫలితం పొందలేము
స్ఫూర్తి పొందు వీటిని చూసి
నీ గమ్యం ఏమిటో తెలిసిపోతుంది
ఫలితం ఆశించకు
అది ఆశించకనే అందుతుంది నీకు..!

- డాక్టర్ ఎం. ఎస్. జ్ఞానేశ్వర్
మదనపల్లె,
చరవాణి : 9440729701