నెల్లూరు

ప్రశంస ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశంసతో పెరుగుతుంది
మనలో మనోనిబ్బరం
అందుకోగలుగుతాం ఎంతో సుదూరం
అలవడుతుంది ధరిత్రి సహనం
ఏర్పడుతుంది మనలో
నిష్కల్మష మస్తిష్కం
మన పయనం కలిగిస్తుంది
నిశీధికి కలకలం
ప్రేరణ కలుగుతుంది
నూతన ఆవిష్కారమునకు
మానసిక ఊగిసలాట మాయం స్థిరత్వం ఖాయం
ఒక ప్రశంస చేస్తుంది
చిద్విలాసం మన చిరునామ
పెరుగుతుంది మనపై
మనకు నమ్మకం
చిగురిస్తుంది బీడు వారిన హృదయం
చెరగదు ఆత్మ విశ్వాసం...
చెదరదు మానవత్వం..!

- వేదగిరి రామకృష్ణ
చరవాణి : 8121184689
**

వర్ధమాన కవి

సూర్యచంద్రులను నేత్రాలు చేసుకొని
లోకాన్నంతా శోధిస్తున్నాడు
అడుగడుగునా పెచ్చరిల్లుతున్న అవినీతిని
అహర్నిశలు ప్రతిఘటిస్తున్నాడు
అతివల మీద జరిగే అరాచకాలను
ఆక్రోశంతో ప్రశ్నిస్తున్నాడు
పసిపాపల మీది పాశవిక చర్యలను
నడివీధిలో నిలబడి నిలదీస్తున్నాడు
కులతత్వాన్ని, మతోన్మాదాన్ని
అన్యాయాలను, అక్రమాలను
తన కంటి కిరణాలకు సోకిన
ప్రతి అఘాయిత్యాన్ని
అక్షర రూపంలో పొదిగిపొదిగి
అలుపెరుగని విక్రమార్కునిలా
జనంలోకి విసురుతూనే వున్నాడు
అతని మనసుకు ఆశలు లేవు
కులం లేని తన కలం
యువతను కదిలించాలనే తపన తప్ప
అతనికున్న కోరిక ఒక్కటే
తన ఆయుధం త్రిశూలమై
నేటితరానికి విజ్ఞాన వీచికై
నరరూప రాక్షసులకు అశనిపాతమై
నిరుపేదలకు కాంతిదీపమై
అందరికీ వెలుగులు పంచి
అజరామరమై నిలవాలని
అనుక్షణం పోరాడుతూనే వున్నాడు
నేటి వర్ధమాన కవి
అతని ఆవేదనను గుర్తించండి
అతని అక్షరాన్ని ఆస్వాదించండి
అతని ఆశయానికి చేయూతనివ్వండి
అవనిన శాంతిని నెలకొల్పండి

- శింగరాజు శ్రీనివాసరావు
చరవాణి : 9052048706
**
అమ్మలాంటి విందు

ఆ కళ్లల్లో జాలువారే కరుణ
ఆ పలకరింపులో వాత్సల్యం
అమ్మను మరపించే వంట కూడా
ఎంత కాలానికి మా అమ్మ వంట
రుచి చూస్తున్నాను
విందు భోజనంలో ఏం పెట్టావన్నది కాదు
వేల విలువ చేసే కూరలు వడ్డించావన్నది కాదు
విలువ కట్టలేని ఆప్యాయతానురాగాల్ని
తీయదనాన్ని జోడించావు
విందు అందుకే అంత రుచికరమైంది
విందారగిస్తున్నంత సేపు మా అమ్మే
నా ముందున్నట్లుగా
కొసరి కొసరి వడ్డిస్తున్నట్లుగా
మారాం చేస్తున్నప్పుడు మురిపాల
ముద్దలు తినిపిస్తున్నట్లుగా
అంతా మా అమ్మ చేస్తున్నట్లే!
నా ముద్దు మాటలు వింటూ
పులకించిన మా అమ్మ
నా కళ్ల ముందు ప్రత్యక్షమైనట్లుగా ఉంటుంది
కోటానుకోట్లు ముంగిట ఒంపినా
కలకలాలం కంటికి రెప్పలా కాస్తున్న
అమ్మను మించిన భాగ్యం ఉందా
ఎన్ని భోగభాగ్యాలున్నా సిరిసంపదలున్నా
ఏ ఒక్కటీ అమ్మ ప్రేమకు సరికావు కదా
అమ్మంటే గుండెలోయల్లో దాగిన ప్రేమనిధి
అమ్మంటే గుండెగూటిలోని మమతల పెన్నిధి
అమ్మంటే అణువణువునా నిండిన
వాత్సల్య లోగిలి.. అందుకే
ఏ అమ్మలో చూసినా మా అమ్మే గుర్తొస్తుంది
ఏ అమ్మ ఆప్యాయత కనిపించినా మా అమ్మే సాక్షాత్కరిస్తుంది
అమ్మంటే ఆశించకనే మనపై కురిపించిన
వరాల జల్లు
అమ్మను మరచినవాడు అమ్మరూపంలోని
వింతపశువు కాదా!

- గుర్రాల రమణయ్య
చరవాణి : 9963921943
**
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net