రాజమండ్రి

ఆశ - నిరాశ (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశంలో హాయిగా విహరించాలని ఆశ
పాడు పక్షులు పసికట్టి పోటీ పడతాయని నిరాశ

గళం విప్పి బిళహరినే పాడాలని ఆశ
కబురు తెలిసిన కోయిలమ్మ కంఠం విప్పేనని నిరాశ
నడుము వంచి అడుగువేసి నర్తించాలని ఆశ
నిజము తెలిసిన నెమలి నాట్యమాడేనని నిరాశ

ఆకాశంలో హాయిగా విహరించాలని ఆశ
పాడుపక్షులు పసికట్టి పోటీ పడతాయని నిరాశ

ముద్దుముద్దుగా మాటలాడి మనస్సు దోచాలని ఆశ
మర్మమెరిగిన మైన మారు పలికేనని నిరాశ
నేల మీద సొగస్సునంతా దోచాలని ఆశ
నింగినెరిగే డేగకన్ను వేసేనని నిరాశ

ఆకాశంలో హాయిగా విహరించాలని ఆశ
పాడుపక్షులు పసికట్టి పోటీ పడతాయని నిరాశ

పచ్చపచ్చగా బ్రతుకునంతా
పండించాలని ఆశ
పంచవనె్నల రామచిలుక
పంతమాడేనని నిరాశ

ఆకాశంలో హాయిగా విహరించాలని ఆశ
పాడుపక్షులు పసికట్టి పోటీపడతాయని నిరాశ
- కోన బాబురావు, సెల్: 9603880783
**

వలసే శరణ్యం

పేరుకు ఘనం ‘రతనాలసీమ’యని
ఆకలితో జనం ‘వలస సీమ’లకి!
ప్రాజెక్టులపై కోట్ల ఖర్చు
పాలక, అధికార, నాయకుల జేబులు ఫుల్!
ప్రజల కష్టాలకి మొసలి కన్నీరు కార్చు
బడాబాబులు!

వరుణుడి కరుణ లేక
పడ్డ చినుకు కరువుసెగకు కరిగిపోగ
పంటలు లేక, కూటి కోసం కాక
పశుమేత కోసం తాళిని
కుదవపెట్టే దైన్యం

ఊళ్లల్లో జనులు వలసబాట
బడా బాబులు బాక్సైట్ బాట
నిధులన్నీ బడాబాబు జేబులకి, డాబులకి
కార్లల్లో ఈగల్లా ఖనిజానికై వెతుకులాట!

తల్లిలాంటి పల్లెలు
చెల్లెళ్లను వేశ్యల్లా
అన్నలను దొంగలుగా మార్చితే
కరువు రక్కసి పిక్కటిల్లె!
అప్పుల సుడిగుండాన్నీదలేక
పరువు కోసం రైతుల బలవంతపు చావులు!

పంచభూతాలను గుప్పెట్లో బంధించి
కృత్రిమ కరవును సృష్టించి
ప్రజలను యాచకులుగా మార్చి
పుష్కర పండుగలకు కోట్ల ఖర్చు చేస్తూ
పేరు కోసం, కీర్తికోసం
‘రాజధాని’కై హంగు, ఆర్భాటాలు
ఇది మన పాలకుల మహామేధస్సు యంత్రాంగాలు
ఓపక్క రాయలసీమజనుల హాహాకారాలు
మరోపక్క వాస్తుపేరుతో
భవనాల శిథిలాల కింద
కోట్ల డబ్బు భూస్థాపితాలు!
ప్రాజెక్టుల పనితీరు!
పట్టించుకోని నేతలతీరు!
ప్రజాధనం కాంట్రాక్టుల జేబుల్లోకి!
ప్రజల రోదన, వేదన కనరు, వినరు
ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత
ఇదీ మనం ఎన్నుకొన్న నేతల తీరు!
- శైలజ ఉప్పులూరి
రాజమహేంద్రవరం, సెల్: 9440247596
**

వాతల మోత

పిల్ల బరువు పావు
సంచి బరువు అర
సంచుల మోత కొకడు
ఇంటి పని రాతల కొకడు
సూటు బూటు
మెడలో ఊపిరాడని ఉరి
పాఠశాల చిహ్నం
బట్టీల విద్యా బట్టీ
రోజంతా నరకం
అక్షరం నేర్వడానికి ఎంత ఆర్భాటం!
సమాజం బడి
పిల్లలు గురువులు
గతి తప్పిన సంబంధం
తల్లిదండ్రుల ఆరాటం
విద్యా వ్యాపారులకు బేహారం
దోపిడి కది విహారం
సామాన్యుడి జీవితం ఆహారం
కుబేరులకి మాత్రం
సంపదల ప్రదర్శనకు ఒక గొప్ప అవకాశం!
పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే
పులి కాలేదు సరికదా!
వళ్లంతా పుళ్లతో చచ్చింది
నాలుగు టెంగ్లిష్ మాటల కోసం
అప్పుల తిప్పలతో సతమతం
చివరకు అనుభవ జ్ఞానం లేని
అర్థంకాని యోగ్యతా పత్రంతో
ఉద్యోగ విపణిలో పోరాటం
సగం జీవితం గడచిపోయినా
ఇంకా ఆశను రేకెత్తించే
అల్లా ఉద్దీన్ అద్భుత దీపం
సామాన్యుడి ఉద్యోగం
అమ్మ నేర్పిన అ...ఆ...లు
ఒక గట్టి పునాదైతే
మోతలెందుకు? వాతలెందుకు?

- వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు
సీతంపేట, రాజమహేంద్రవరం
సెల్: 9491171327